అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
15, మే 2020, శుక్రవారం
14, మే 2020, గురువారం
🎯డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 167 సైంటిస్టులు🎯
🏵డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ)కి చెందిన దిల్లీలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
🏵 సైంటిస్ట్-బి మొత్తం ఖాళీలు: 167
🏵విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎరోనాటికల్ ఇంజినీరింగ్ తదితరాలు.
👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్ గేట్ స్కోర్.
👉ఎంపిక విధానం: వాలిడ్ గేట్ స్కోర్, డిస్క్రిప్టివ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
👉దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2020.
⭕వెబ్‌సైట్: https://rac.gov.in/
ఐఐటీ కౌన్సెలింగ్ రౌండ్ల తగ్గింపు!!
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే జేఈఈ-మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు వాయిదా పడటంతో తరగతుల ప్రారంభం కూడా ఆలస్యమవడం అనివార్యంగా మారింది. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐఐటీ, నీట్‌లలో ప్రవేశాలకుగానూ జేఈఈ కౌన్సెలింగ్‌కు ఈ ఏడాది తక్కువ రౌండ్లు నిర్వహించాలని యోచిస్తోంది. 2019లో సీట్ల భర్తీకి జోసా 7 రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈసారి రౌండ్లు తగ్గించాలని ఐఐటీలు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. దీంతో ఈ ఏడాది ఐదు లేదా ఆరు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. జేఈఈ-మెయిన్ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే
AP ELECTRICITY NEW TARIFF
*ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్*
కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి.
1. *కేటగిరి A*
నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50 ---> 1.45
51-75 ----> 2.60
*2. కేటగిరి B*
నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50 ----> 2.60
51 - 100 -----> 2.60
101 - 200 -----> 3.60
201 - 225 -----> 6.90
*3. కేటగిరి C*
నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50 ----> 2.65
51 - 100 -----> 3.35
101 - 200 -----> 5.40
201 - 300 -----> 7.10
301 - 400 -----> 7.95
401 - 500 -----> 8.50
500 పైన -----> 9.95
చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి. దీనికి సర్ చార్జీలు అదనం.
SVMVV | SRM JEEJEEE Entrance | Sathybhama Entrance Exams details
🔳ఎస్పీఎంవీవీ పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు
తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ ప్రవేశాలకు ఏటా నిర్వహించే.. ఎస్పీఎంవీవీ-2020 పీజీసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూన్ 10 వరకు పొడిగించినట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. కొవిడ్-19 కారణంగా జులై లేదా ఆగస్టులో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
జులై 30 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ ప్రవేశ పరీక్షలు
ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజినీరింగ్(ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ) ప్రవేశపరీక్షలు జులై 30 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆగస్టు 2 లేదా 3వ వారం నుంచి ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఆగస్టు 3 నుంచి ‘సత్యభామ’లో ప్రవేశ పరీక్షలు
‘సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ వర్సిటీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఆగస్టు 3 నుంచి 5 వరకు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 8న ఫలితాలు, 12న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...