11, జూన్ 2020, గురువారం

1️⃣💁‍♀️వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి అనుమతి


 🍁ఈనాడు, అమరావతి:

🔰వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది .

●వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు .

●ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ సర్జన్, దంత సహాయ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు

🍁పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు అసోం పురస్కారం

 🔰ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్ట్ గా గతంలో అసోంలో పనిచేశారు

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

2️⃣✍నాడు- నేడు పనుల పరిశీలనకు క్విక్ ప్రొఫార్మా: ఆర్జేడీ

 🍁ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 :

 🔰ప్రభుత్వ పాఠశాలల ను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన నాడు - నేడు పనుల పురోగతిని క్షేత్రస్థాయి నుంచి సులువుగా తెలుసుకునేందుకు క్విక్ ప్రొఫార్మా విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీ య సంయుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ) నరసింహా రావు వెల్లడించారు. ఏలూరు సమగ్ర శిక్ష జిల్లా సమావేశ మందిరంలో బుధవారం నాడు - నేడు పనుల ప్రగతిపై నియోజకవర్గ స్థాయి అధి కారులు డీఈవో, సమగ్ర శిక్ష ఏపీసీ, డీవై ఈ వోలు, ఇంజనీరింగ్ సిబ్బంది, కంప్యూ టర్ ఆపరేటర్లతో సమీక్షించారు. జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో రేణుక మాట్లాడుతూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

3️⃣✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష

🍁ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10:

🔰 విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗

4️⃣💁‍♀️ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి: ఏపీటీఎఫ్

 🍁అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి):

🔰రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే షెడ్యూల్ జారీచేసి, బదిలీల ప్రక్రియ చేప ట్టాలి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృద యరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్ష లను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

📚✍టెన్త్ పరీక్షలు ఉంటాయి✍📚

♦షెడ్యూల్ మారదు

♦11కు బదులు ఆరు పేపర్లే

 ♦పరీక్షలు రద్దు కావు

 ♦ప్రచారాలు నమ్మొద్దు

🌻అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి డా సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష లు జరుగుతుందో తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదో తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్ కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరో గ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

📚✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష✍📚



🌻ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10: విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

📚✍డీఎల్ ఎడ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚 | 📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం

📚✍డీఎల్ ఎడ్ పరీక్ష
 ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚

 🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం 20182020 బ్యాచ్) రెగ్యులర్, ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఫైన్ లేకుండా ఈనెల 20వ తేదీ వరకు రూ.50 ఫై తో ఈనెల 25వ తేదీ వరకూ చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్ చేసు కునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు ఫారం www.bseap.gov.in వెబ్లిం    కులో అందుబాటులో ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ. 250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును గేట్వే ద్వారా చెల్లించాలని సూచించారు.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం

🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : పది నెలల వ్యవధితో కూడిన డిప్లొమా ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ చేరేందుకు డిప్యూటేషన్ పై టీచర్లు నుంచి దరఖాస్తులను సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 3వ తేదీ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల ఉపాధ్యాయులు వివరాలను www.cil.org నుంచి వివరాలు తెలుసుకోవచ్చు

🔳ఏఐఏఎస్‌ఎల్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17. పోస్టులు: చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ (ఫైనాన్స్‌) తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
చివరి తేది: జూన్‌ 18, 2020

వెబ్‌సైట్‌: http://www.aiatsl.com/

🔳ఈఎస్‌ఐసీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ హాస్పిటల్‌ కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రెసిడెంట్‌-43, స్పెషలిస్ట్‌-02.

విభాగాలు: మెడిసిన్‌, సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్‌, రేడియాలజీ, క్యాజువాలిటీ, గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/  డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.               

వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 09, 2020. వేదిక: ఇందిరా గాంధీ ఈఎస్‌ఐ హాస్పిటల్‌, జిల్మీ, దిల్లీ-110095.
వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

🔳ఐకార్‌-ఐవీఆర్‌ఐ

బెంగళూరులోని ఐకార్‌-ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 06 పోస్టుల: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), యంగ్‌ ప్రొఫెషనల్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ (లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత, నెట్‌ అర్హత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 16, 2020.
వేదిక: ఐవీఆర్‌ఐ క్యాంపస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆడిటోరియం, హెబ్బల్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: http://www.ivri.nic.in/