ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న రీజియన్ బట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు | 17 నవంబర్ 2020 నుండి 25 నవంబర్ 2020 వరకు |
పోస్టుల సంఖ్య:
అన్ని రీజియన్ లలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొక్యూర్ మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు
ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్
నాలెడ్జ్ ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
19 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
18924 నుండి 20522 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వారి దరఖాస్తు చేసుకున్న రీజనల్ ఆఫీస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు TRIFED రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.