Alerts

11, డిసెంబర్ 2020, శుక్రవారం

బ్రేకింగ్ న్యూస్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల పై ముఖ్య ప్రకటన :

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET ) 2020 నిర్వహణ పై ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

టెట్ -2020 పరీక్ష నిర్వహణ కు సంబంధించిన దస్త్రాన్ని ఏపీ విద్యా శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపినది.

ప్రభుత్వం  టెట్ నిర్వహణకు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన వెంటనే, ఆంధ్రా లో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు పూర్తి కాగానే టెట్ పరీక్షను నిర్వహించే యోచనలో ఏపీ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన కారణంగా, ఏపీ టెట్ పరీక్ష సిలబస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

ఏపీ టెట్ సిలబస్ లో ఆంగ్ల విద్యకు సంబంధించిన ప్రశ్నలు అడగనున్న క్రమంలో టెట్ పరీక్ష సిలబస్ ను రూపొందించే బాధ్యతలను ఏపీ విద్యా శాఖ SCERT కీ అందచేసినది.

తాజాగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ తో అతి త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

IIIT 2020 News Update telugu || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వ్రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్

 

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన విద్యార్థులకు శుభవార్త :

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష 2020 వ్రాసిన అభ్యర్థులకు ఒక శుభ వార్త వచ్చినది.


ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెనుక బాటు సూచి క్రింద  ప్రత్యేకంగా 0.4 పాయింట్లు కలుపనున్నారు.

దీనికోసం తాజాగా RGUKT చట్టంలో తాజాగా మార్పులు చేసారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఈ 0.4 పాయింట్లు కలపడం వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో 93% శాతం సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు లభించనున్నాయి.

JEE MAINS Exam 2021 Update Telugu || JEE మెయిన్స్ పరీక్ష నిర్వహణ మరియు సిలబస్ పై స్పష్టత


JEE మెయిన్స్ పరీక్షను ఇకపై ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించనున్నారు. ఈ విషయానికి సంబంధించిన కసరత్తులు కేంద్ర విద్యాశాఖ ప్రారంభించినది.

రాబోయే సంవత్సరం 2021 లో దేశంలో 4 సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2021 నెల ఆఖరులో ఒకసారి,

తరువాత మార్చి, ఏప్రిల్, మే నెలలలో మరో మూడు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ప్రణాళికలు రచిస్తుంది.

ఇక ఈ సారి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలకు పాత సిలబస్ నే ప్రకటించనున్నారు. రాబోయే సంవత్సరంలో జేఈఈ మరియు నీట్ పరీక్షలకు పాత సిలబస్ నే కొనసాగించనున్నారు.

ఇక జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సారి పరీక్ష  ప్రశ్నపత్రంలో ఛాయిస్ లు ఇవ్వనున్నారు.విద్యార్థులు 100 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలు వ్రాసే ఛాయిస్ అవకాశం పై  కేంద్ర విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.

Teaching Faculty Jobs 2020 Telugu || ఛాంబర్స్ కాలేజ్, పాలకొల్లు లో ఇంటర్, డిగ్రీ, పీజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

 

ఇంటర్, డిగ్రీ, పీజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకొల్లు నగరంలో ఉన్న భూపతి రాజు రామచంద్ర రాజు మరియు గోపాలకృష్ణ రాజు ఛాంబర్స్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న బోధన విభాగాల టీచింగ్ ఫాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన జారీ అయినది.


ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ  దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీడిసెంబర్ 13,2020
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం ఛాంబర్స్ జూనియర్  &డిగ్రీ కాలేజ్,ఎల్. ఆర్. పేట,పాలకొల్లు – 534260

బోధన విభాగాల వారీగా ఖాళీలు :

పీజీ విభాగం :

ఆర్గానిక్ కెమిస్ట్రీ

ఫీజికల్ కెమిస్ట్రీ

డిగ్రీ విభాగం :

మాథ్స్

స్టాటాస్టిక్స్

జూనియర్ కాలేజీ విభాగం :

మాథ్స్

ఇంగ్లీష్

సంస్కృతం

అర్హతలు :

అభ్యర్థులు  బోధన విభాగాలను అనుసరించి విద్యా అర్హతలను కలిగి ఉండాలి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 20,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

krishnavarmakv@gmail.కామ్

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన  మరిన్ని వివరాలకు ఈ క్రింది మొబైల్ మరియు వాట్సాప్ నెంబర్ లను సంప్రదించవచ్చును.

మొబైల్ & వాట్సాప్ నెంబర్ :

9849212321

🕉 *శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం*



        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:   టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

👉 ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు.

■  ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
👉ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.

👉ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

🕉 *వృద్ధులు, చిన్న‌పిల్ల‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుని శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:   
 కోవిడ్-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ అనంత‌రం 2020 జూన్ 8వ తేదీ నుండి వివిధ సంస్థ‌ల‌ను తిరిగి తెర‌వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

👉65 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారు,
👉అనారోగ్యంతో ఉన్నవారు,
👉గ‌ర్భిణులు,
👉ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల వారు అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.

అయితే...,
65 ఏళ్లు పైబ‌డినవారికి,
10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు
శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని భారీ సంఖ్య‌లో మెయిల్స్ ద్వారా టిటిడికి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి.
డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో కూడా అనేక మంది ఈ విష‌యంపై అభ్య‌ర్థిస్తున్నారు.

🟢 ద‌ర్శ‌నానికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల్లో చాలావ‌ర‌కు చిన్న‌పిల్ల‌ల కేశఖండ‌న‌,
చెవిపోగులు కుట్టడం,
అన్న‌ప్రాస‌న‌,
ష‌ష్టిపూర్తి చేసుకున్న‌వారు,
70-80 సంవ‌త్స‌రాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు.

      ఇది భ‌క్తుల ఆచారాలు, సంప్ర‌దాయాలు, మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న అంశం.
 ఈ కార‌ణాల రీత్యా 65 ఏళ్లు పైబ‌డిన వారు, ప‌దేళ్ల లోపు వారు కోవిడ్‌-19 సూచ‌న‌లు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో వారి సొంత నిర్ణ‌యం మేర‌కు స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌చ్చు. అయితే, ముంద‌స్తుగా ద‌ర్శ‌న టికెట్ల బుక్ చేసుకోవాలి. ద‌ర్శ‌న టికెట్లు క‌లిగిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ప్ర‌త్యేక క్యూలైన్లు ఉండ‌వని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.
 *Dept.Of PRO TTD.*


🕉 *డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు* 🕉 *తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాలు*



        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ధనుర్మాసం సందర్భంగా టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

■ తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఈ ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నారాయ‌ణ‌వ‌నంలోని శ్రీ హ‌రేరామ హ‌రేకృష్ణ ఆల‌యం, కుప్పం మండ‌లం గుడిప‌ల్లిలోని శ్రీ యామ‌గానిప‌ల్లెలో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.

🟢 ఈ ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీకృష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

👉 ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప విశేషం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 *Dept.Of PRO TTD.*

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...