టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల పై ముఖ్య ప్రకటన :
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET ) 2020 నిర్వహణ పై ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.
టెట్ -2020 పరీక్ష నిర్వహణ కు సంబంధించిన దస్త్రాన్ని ఏపీ విద్యా శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపినది.
ప్రభుత్వం టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, ఆంధ్రా లో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు పూర్తి కాగానే టెట్ పరీక్షను నిర్వహించే యోచనలో ఏపీ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన కారణంగా, ఏపీ టెట్ పరీక్ష సిలబస్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఏపీ టెట్ సిలబస్ లో ఆంగ్ల విద్యకు సంబంధించిన ప్రశ్నలు అడగనున్న క్రమంలో టెట్ పరీక్ష సిలబస్ ను రూపొందించే బాధ్యతలను ఏపీ విద్యా శాఖ SCERT కీ అందచేసినది.
తాజాగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ తో అతి త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి