11, డిసెంబర్ 2020, శుక్రవారం

JEE MAINS Exam 2021 Update Telugu || JEE మెయిన్స్ పరీక్ష నిర్వహణ మరియు సిలబస్ పై స్పష్టత


JEE మెయిన్స్ పరీక్షను ఇకపై ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించనున్నారు. ఈ విషయానికి సంబంధించిన కసరత్తులు కేంద్ర విద్యాశాఖ ప్రారంభించినది.

రాబోయే సంవత్సరం 2021 లో దేశంలో 4 సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2021 నెల ఆఖరులో ఒకసారి,

తరువాత మార్చి, ఏప్రిల్, మే నెలలలో మరో మూడు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ప్రణాళికలు రచిస్తుంది.

ఇక ఈ సారి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలకు పాత సిలబస్ నే ప్రకటించనున్నారు. రాబోయే సంవత్సరంలో జేఈఈ మరియు నీట్ పరీక్షలకు పాత సిలబస్ నే కొనసాగించనున్నారు.

ఇక జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సారి పరీక్ష  ప్రశ్నపత్రంలో ఛాయిస్ లు ఇవ్వనున్నారు.విద్యార్థులు 100 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలు వ్రాసే ఛాయిస్ అవకాశం పై  కేంద్ర విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.

కామెంట్‌లు లేవు: