అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
2, జనవరి 2021, శనివారం
దివ్యాంగులు 'సదరం' ధ్రువపత్రాల కోసం
ఏపీ సెట్ 2020 పరీక్షల ఫైనల్ కీ విడుదల
డిసెంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ సెట్ 2020 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ లు విడుదల అయ్యాయి.
అతి త్వరలోనే ఏపీ సెట్ 2020 పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్షల ఫైనల్ కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1, జనవరి 2021, శుక్రవారం
మార్కెటింగ్ మేనేజర్ కావలెను
అనుభవం గల ఆఫీస్ బాయ్స్ మరియు రిసెప్షనిస్ట్ కావలెను
హెల్పర్స్ మరియు అప్రెంటిస్ కావలెను
భారత నావికాదళంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
విద్యార్హతలు..
ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఓషనోగ్రఫీ సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే మెటీరియల్ అనాలసిస్/టెస్టింగ్ టెక్నిక్స్/మెషినరీ నాయిస్, వైబ్రేషన్ మూవ్మెంట్స్ అనాలసిస్, రిడక్సన్ టెక్నిక్స్/ కొర్రోజియన్ అనాలసిస్, మిటిగేషన్ టెక్నిక్స్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు..
గరిష్టంగా 30ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తుదారుల విద్యార్హతలు, అకడమిక్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం..
- అకడెమిక్ మెరిట్ ప్రతిపాదికన షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ అందిస్తారు. ఆ తర్వాత వారిని డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. చదువు, చిరునామా, కులధ్రువీకరణ, ఇతర అవసరమైన సర్టిఫికేట్స్ అన్నింటిని పరిశీలించి.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా లేదా నేవీæ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏ4 సైజు పేపర్లో నిర్దేశిత ఫార్మట్ ప్రకారం వివరాలను రాయాలి(చక్కటి చేతి రాత లేదా టైప్ చేసి). అలాగే అవసరమైన పత్రాలను వాటితో జతచేసి.. పోస్టు ద్వారా కింద తెలిపిన చిరునామకు పంపాలి.
చిరునామ: ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్ నావెల్ కమాండ్, బళ్లార్డ్ ఎస్టేట్, టైగర్ గేట్ దగ్గర, ముంబయి–400001.
- దరఖాస్తులకు చివరి తేది: 16.01.2021
- వెబ్సైట్: https://www.indiannavy.nic.in
CIA Jobs Recruitment 2021 Telugu || రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు
భారత దేశ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రి ఎక్సటెన్షన్ మేనేజ్ మెంట్ (మేనేజ్ ) లో విభాగాలవారీగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. CIA Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | డిసెంబర్ 30,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 21,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
కన్సల్టెంట్ (ఏసీ & ఏబీసీ ) | 7 |
కన్సల్టెంట్ (ఏసీ & ఏబీసీ డాక్యూమెంటేషన్ ) | 1 |
టెలి అడ్వైజర్ | 1 |
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ | 1 |
మేనేజ్ రీసెర్చ్ ఫెలో | 1 |
మొత్తం ఉద్యోగాలు :
ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి ఎంబీఏ /పీజీడిఎం/ఎంఎస్సీ/తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత /అగ్రికల్చర్ /అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ /తత్సమాన విభాగాలలో బాచిలర్ డిగ్రీ /అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ /అగ్రికల్చర్ ఎకనామిక్స్ మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.మరియి సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...