*📃వర్షిక, ప్రవేశ పరీక్షల ఫీజులు రద్దు చేయాలంటూ వినతులు*
*🌀ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఎంసెట్‌ను జూన్ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అవి ముగిశాక, 4, 5 వారాల సమయం ఇచ్చి ఎంసెట్‌ను జూన్‌లో జరపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆ నెలలోనే జరిపేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.*
*💰పరీక్ష ఫీజులు వసూలు చేస్తారా?... రద్దు చేస్తారా?*
*🌀కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి ఈసారి అన్ని రకాల వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షల ఫీజు రద్దు చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల రుసుములను ఇప్పటికే రద్దు చేశారు. తెలంగాణలోనూ అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తల్లిదండ్రులు, సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తరగతులు జరగకున్నా ప్రైవేటు కళాశాలలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం పరీక్ష ఫీజులైనా రద్దు చేయాలని కోరారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కనీసం ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకైనా రుసుములు మినహాయించాలని ఐఐటీ జేఈఈ-నీట్ ఫోరమ్ కన్వీనర్ లలిత్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజులు మినహాయించాలని మరికొందరు కోరుతున్నారు.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, జనవరి 2021, శనివారం
జూన్ రెండో వారంలో ఎంసెట్
💁♀ఏప్రిల్ 18న నీట్..
🔰నయా ఢిల్లీ : నీట్ పీజీ -2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తిచేసి వుండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్ సైటు సందర్శించవచ్చు.
*💁♀️దూరవిద్య కోర్సులకు అనుమతి..*
🍁ఈనాడు, అమరావతి:
*🔰ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలకు దూరవిద్య కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ఆచార్య నాగార్జునలో డిగ్రీ, పీజీ కలిపి 46 కోర్సులు, శ్రీకృష్ణదేవరాయలో 17, శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 11కోర్సులకు అనుమతించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఈ కోర్సులపై వర్సిటీలు చేసిన దరఖాస్తుల మేరకు ఆమోదం తెలిపింది.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*2️⃣💁♀️ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థులూ.. ఉపాధ్యాయ కొలువులకు అర్హులే*
*🔰బఈడీ-ఎంఈడీ మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులూ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సర్వసభ్య సమావేశం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో వివాదం తలెత్తడంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఎన్‌సీటీఈ..మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ పూర్తిచేసిన వారు టెట్ రాసి టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడవచ్చని పేర్కొంది.*
*💁♀️ఇంటర్ మొదటి ఏడాది తరగతులు మే 31వరకు..*
*🔰రెండో శనివారం, వేసవి సెలవులు రద్దు..*
🍁ఈనాడు, అమరావతి:
*🔰ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు మే 31వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యా మండలి ప్రకటించింది. సవరించిన మొదటి ఏడాది అకడమిక్ కేలండర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే తరగతులు మొత్తం 106 రోజులు జరగనున్నాయి. రెండో శనివారం, వేసవి సెలవులను రద్దు చేశారు. అర్ధ సంవత్సరం పరీక్షలు మార్చి 25 నుంచి 31వరకు నిర్వహిస్తారు. ప్రీఫైనల్, బోర్డు థియరీ పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తారు*.
*💥నవోదయ పరీక్ష తేదీల మార్పు..*
*🌻హదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీలను మార్చారు.*
*🔹ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. దీనిని ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నామని జవహర్ నవోదయ సమితి తెలిపింది.*
---------------------------------------------
*💥ఏప్రిల్ 18న నీట్..*
*🔹నయూఢిల్లీ : నీట్ పీజీ -2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్ షిప్ పూర్తిచేసి వుండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్ సైటు సందర్శించవచ్చు.*
#NATIONAL_NEWS
💁♀నవోదయ పరీక్ష తేదీల మార్పు..
🔰హదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీలను మార్చారు.
🔰ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. దీనిని ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నామని జవహర్ నవోదయ సమితి తెలిపింది.
🕉– *తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం*
Co-Op Society Jobs 2021 Update || గోదావరి -కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగాల భర్తీ
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు :
బ్రాంచ్ మేనేజర్స్ | 9 |
మార్కెటింగ్ మేనేజర్స్ | 18 |
గోల్డ్ లోన్ ఆఫీసర్స్ | 5 |
క్లర్క్స్ | 9 |
డీటీపీ ఆపరేటర్స్ | 3 |
సేల్స్ అడ్మిన్ – ఫిమేల్ (తెలుగు &ఇంగ్లీష్ ) | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ విద్యార్హతగా కలిగి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు లేదు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా 10,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి.
ఈమెయిల్ అడ్రస్ :
అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్, ఉద్యోగ విభాగం మరియు ఫోన్ నంబర్లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.
ఈమెయిల్ :
admin@godavarikrishna.com
సంప్రదించవల్సిన అడ్రస్ :
గోదావరి – కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,
9-61-13,
బీ. ఆర్. పీ రోడ్, ఇస్లాం పేట,
విజయవాడ – 520001,
కృష్ణా జిల్లా.
ఫోన్ నంబర్లు :
0866 – 2957177
9100068751
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...