26, మే 2021, బుధవారం

ఎస్‌వీవీయూ, తిరుపతిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం ఖాళీల సంఖ్య: 15
జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం–01, విజయనగరం–01, విశాఖపట్నం–01, తూర్పుగోదావరి–01, పశ్చిమగోదావరి–02, కృష్ణా–01, గుంటూరు–01, ప్రకాశం–01, నెల్లూరు–02, చిత్తూరు–01, కడప–01, కర్నూలు–01, అనంతపురం–01.
అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. సేకరణ జెమిని ఇంటర్ నెట్, హిందూపురం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

వెబ్‌సైట్‌: www.svvu.edu.in

సెంట్రల్‌ జీఎస్‌టీ, వడోదరలో ట్యాక్స్‌ అసిస్టెంట్లు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్‌టీ) విభాగానికి చెందిన వడోదరలోని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ట్యాక్స్‌ అసిస్టెంట్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 

పోస్టుల వివరాలు: ట్యాక్స్‌ అసిస్టెంట్‌లు
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత:
గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకురూ.25,500 నుంచి రూ.81,000 వరకు చెల్లిస్తారు.
సేకరణ జెమిని ఇంటర్ నెట్,  హిందూపురం.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

వెబ్‌సైట్‌: www.ccovadodarazone.gov.in

 

 

24, మే 2021, సోమవారం

ఏపీలో 2268 గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs పోస్టులు: గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌లు
మొత్తం పోస్టుల సంఖ్య: 2268
జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296.

అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ/వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి.
వయసు: 18–35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20–25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి).

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

 



భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 3591
ట్రేడులు:
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, వైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.
వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.rrc-wr.com

22, మే 2021, శనివారం

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారంలో టీచర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021



సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.
విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57ఏళ్లు మించకూడదు.

ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

లైబ్రేరియన్‌:
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.

సెక్యూరిటీ సూపర్‌వైజర్‌:
అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు.

కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌:
అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌–500087 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.apsbolarum.edu.in/index.html

18, మే 2021, మంగళవారం

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది.

50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్‌డౌన్‌లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది.

దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (సేకరణ జెమిని కార్తీక్) ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. సేకరణ జెమిని కార్తీక్
https://www.mygov.in/task/logo-design-contest-one-nation-one-ration-card-plan/

ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్‌ కొలువులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది జూన్ 11..

 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీసిటీ (ఐఐఐటీ).. అసిస్టెంట్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్లు(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు(మ్యాథమేటిక్స్‌/డేటాఅనలిటిక్స్‌) టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్‌ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి.
ఈమెయిల్‌: careers.faculty@iiits.in

దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.iiits.ac.in