Alerts

--------

17, ఆగస్టు 2021, మంగళవారం

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గురించి తెలుగులో సమాచారం | Polytechnic Agriculture Info. in telugu



ICAR Info. in Telugu | ICAR ప్రవేశం గురించి తెలుగులో సమాచారం



విద్యా ఉద్యోగ సమాచారం | Education and Job Info




Classifieds 17-08-2021






కోల్‌ ఇండియాలో 588 ఉద్యోగాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021



భారత ప్రభుత్వ మహారత్న కంపెనీ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Edu news 
మొత్తం పోస్టుల సంఖ్య: 588
పోస్టుల వివరాలు: మైనింగ్‌–253. ఎలక్ట్రికల్‌–117, మెకానికల్‌–134, సివిల్‌–57, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌–15, జియాలజీ–12.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌), ఎమ్మెస్సీ/ఎంటెక్‌(జియాలజీ /జియోఫిజిక్స్‌/అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 04.08.2021 నాట కి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్‌–2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

యూజీసీ నెట్‌– 2021(జూన్‌) నోటిఫికేషన్‌ | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 | పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 | పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;



దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్‌ఎఫ్,లెక్చర్‌షిప్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్‌ ఎలిజి బిలిటీ టెస్ట్‌(నెట్‌)–జూన్‌ 2021 నోటిఫి కేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది.

Edu newsఅర్హత: హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్‌ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో అడుగుతారు.పేపర్‌ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్‌ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021
పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

యూబీఐలో 347 ఉద్యోగాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021


ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Edu news 
మొత్తం పోస్టుల సంఖ్య: 347
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్‌ మేనేజర్లు–146.
విభాగాలు: రిస్క్, సివిల్‌ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్‌ ఇంజనీర్, ప్రింటింగ్‌ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్‌ అకౌంటెంట్, టెక్నికల్‌ ఆఫీసర్లు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. –దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...