Alerts

--------

30, అక్టోబర్ 2021, శనివారం

AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. అప్లై ఇలా.

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP Postal Circle) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల(Jobs)ను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Gemini Internet

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను(Sports Quota Jobs) భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP POSTAL CIRCLE) తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్(Postman), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff) తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను(Sports Quota Jobs) భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP POSTAL CIRCLE) తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్(Postman), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff) తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


విభాగాల వారీగా ఖాళీల విరాలు ఇలా ఉన్నాయి..

పోస్టుఖాళీలు
పోస్టల్ అసిస్టెంట్19
సార్టింగ్ అసిస్టెంట్04
పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్03
పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్04
పోస్ట్ మ్యాన్18
మల్టీ టాస్కింగ్ స్టాఫ్27


For Applications Visit  Gemini Internet, Dhanalakshmi  Road, Hindupur.విద్యార్హతలు:
పోస్టల్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి ఇంటర్ విద్యార్హతను కలిగి ఉండాలి.

పోస్ట్ మ్యాన్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా కలిగి ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాష తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉండాలి.

-అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

క్రీడలు: స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, చెస్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, కబడ్డీ, షూటింగ్ తదితర క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ/ఇంటర్ టోర్నమెంట్స్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.


వయో పరిమితి: మల్టీ టాస్కాంగ్ పోస్టులకు అప్లై చయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

-ఇతర పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చారు.

వేతనాలు:
-పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 - రూ. 81,100 వరకు వేతనం ఉంటుంది.
-పోస్ట్ మాన్: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 21700-రూ.69100 వరకు వేతనం ఉంటుంది.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56900 వరకు వేతనం ఉంటుంది.
For Applications Visit  Gemini Internet, Dhanalakshmi  Road, Hindupur.
దరఖాస్తు ప్రక్రియ:  ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా https://dopsportsrecruitment.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, చిరునామా తదితర పూర్తి వివరాలు నమోదు చేయాలి.

Step 4: రిజిస్ట్రేషన్ అనంతరం ఫీజు పేమెంట్ కోసం https://dopsportsrecruitment.in/fee.aspx లింక్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
Step 5: అనంతరం Apply online లింక్ పై క్లిక్ చేసి అప్లిపేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కావాల్సిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

 

29, అక్టోబర్ 2021, శుక్రవారం

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు ఋణం పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి.

SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి. అటువంటి రైతు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుడైతే.. సాగు ఖర్చుల నిమిత్తం వ్యవసాయ ఋణం పొందడం ఈజీ..  రైతు వ్యవసాయం కోసం దేశీయ అతి పెద్ద బ్యాంక్ SBI అన్నదాతకు అండగా నిలవడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ను అందిస్తోంది.  ఈ కార్డు సహాయంతో రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం సులభంగా ఋణం పొందవచ్చు.. ఈ కార్డు గురించి వివరాలు తెలుసుకుందాం..

లక్షణాలు, ప్రయోజనాలు:
1. SBI కిసాన్ ఖాతా.. క్యాష్ క్రెడిట్ ఖాతాలా ఉంటుంది.
2. ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, సేవింగ్స్ బ్యాంక్ రేటు వద్ద వడ్డీని పొందుతారు.
3. వ్యవధి: 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్ష అనంతరం 10% వార్షిక పెంచుతారు
4. వడ్డీ రాయితీ: 3 లక్షల వరకూ సత్వర రుణం.. రుణ గ్రహీతలకు 3% వడ్డీ రాయితీ.
5. తిరిగి చెల్లింపు: పంట కాలం (స్వల్ప/దీర్ఘ), పంటకు మార్కెటింగ్ వ్యవధిపై తిరిగి చెల్లించే వ్యవధి ఆధారపడి ఉంటుంది.

భీమా:
70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న KCC రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద భీమా పథకం (PAIS) కింద కవర్ చేయబడతారు
అర్హత కలిగిన పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కవర్ చేయబడతాయి.

వడ్డీ రేటు:
1. రూ. 3లక్షల వరకూ రుణం తీసుకునే వారికి వడ్డీ రేటు 7 శాతం.
2. రూ.3 లక్షల పైన రుణం తీసుకునే వారికి ఎప్పటికప్పుడు వడ్డీ రేటు వర్తించే విధంగా

ఇతర ఫీచర్లు/ప్రయోజనాలు:
1. అర్హులైన KCC రుణగ్రహీతలందరూ SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.
2. Rupay కార్డులు హోల్డర్‌లకు ఒక లక్ష భీమా.. 45 రోజులకు ఒకసారి రెన్యువల్..

దరఖాస్తు చేసుకునే విధానం: 

నేరుగా ఎస్బిఐ బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు:

గుర్తింపు కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, తదితర గుర్తింపు కార్డులు
వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు
ధరఖాస్తుదారుడి ఫోటోలు
ఇంటి చిరునామా

 

TTD Updates 🕉 *శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
         శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అక్టోబ‌రు 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

★ ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.
 కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం
●జాతాశౌచం,
●మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.
అయినా
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

■ పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
■ రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు.

■ చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

★ పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
👉 అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల‌కు ఆల‌యంలో ఆస్థానం జ‌రుగ‌నుంది.


🕉 *న‌వంబ‌రు నెల‌లో తిరుప‌తిలోని టిటిడి స్థానిక ఆల‌యాల్లో విశేష ఉత్సవాలు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
          తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండరామాలయంలో న‌వంబ‌రు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

★ వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ★

🕉 శరీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం…..

■– న‌వంబ‌రు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

■– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం.

■– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర.

■– న‌వంబ‌రు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.

■– నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.

■– న‌వంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్‌ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– న‌వంబ‌రు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్ర‌వ‌చ‌నం నిర్వహిస్తారు.

■– నవంబరు 18న కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా కార్తీక దీప్పొత్స‌వం.

🕉 శ్రీ కోదండరామాలయంలో….

■– న‌వంబ‌రు 2న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

■– న‌వంబ‌రు 4న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం,
సాయంత్రం 6 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

■– న‌వంబ‌రు 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయంలో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 19న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 24న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.


Central Government: కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనిలో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.10 వేలు పొందొచ్చు.. వివరాలివే..

Gemini Internet

Central Government: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయి. మరికొన్ని సాధారణ పౌరులకు కూడా ఉపయోగపడేవి ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు చెప్పుకునే పథకం అటల్ పెన్షన్ యోజన. దీని ద్వారా నెలకు భార్యాభర్తలు రూ. 10 వేలు తీసుకోవచ్చు. ఎలా అంటే..

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎలా తీసుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ, అటోల్ పెన్షన్ పథకం (అటల్ పెన్షన్ యోజన) ప్రారంభించబడింది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరం. ఈ పథకం తర్వాత 60 సంవత్సరాల తరువాత డిపాజిటర్లు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. మీరు అందుకునే పెన్షన్ మొత్తం మీరు చేసే పెట్టుబడి మరియు మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

APY కింద.. ఒక వ్యక్తి కనీసం రూ. 1,000, రూ .2,000, రూ .3,000, రూ .4,000 మరియు రూ.5 వేల వరకు పెన్షన్ పెందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించబడిని విషయం తెలిసిందే. అయితే అటల్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మీరు ఈ పథకంలో ఎంత త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు.

ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతడు/ఆమె 60 సంవత్సరాల వయస్సు తరువాత నెలకు రూ. 5,000 పెన్షన్ కోసం నెలకు రూ. 210 జమ చేయాలి. అంటే ఈ పథకంలో రోజుకు కేవలం రూ .7ను జమ చేయడం ద్వారా నెలకు రూ .5 వేల పింఛను పొందవచ్చు.

నెలకు రూ. 3 వేలు పెన్షన్ కావాలంటే రూ.126, రూ. 4 వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ. 168, నెలకు రూ. 2 వేలు పెన్షన్ కావాలంటే రూ. 84 చెల్లించాల్సి ఉంటుంది. మీకు కేవలం రూ. వేయి పెన్షన్ కావాలంటే మాత్రం నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది.

APY మరియు NPS లైట్ యాప్ ద్వారా ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలను చూసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటూ.. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు. 

లేదా ప్రతీ ఒక్కిరికీ నెట్ బ్యాంకింగ్ ఉండే ఉంటుంది. అందులోకి వెళ్లి కూడా జాయిన్ అవ్వొచ్చు. ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెలా డబ్బుల కట్ అవుతూ ఉంటాయి. 40ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి.

18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయితే 20 ఏళ్లు వరుసగా కట్టాల్సి ఉంటుంది. ఇలా భార్యభర్తలు 40 ఏళ్ల లోపు జాయిన్ అయి నెలకు రూ.5000 వచ్చే స్కీంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు ఇద్దిరకి కలిపి రూ.10 వేలు తీసుకోవచ్చు. 

AP EAPCET 2021 పరీక్ష వ్రాసిన Bi.P.C. విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబరు 28, 29, 30 తేదీలలో

AP EAPCET 2021 Bi.P.C. విద్యార్థులకు గమనికః ఎవరైతే ANGRAU ద్వారా Agriculture, Animal Husbandry, Bachelor of Veterinary Science, Horticulture, Fisheries, Food Technology కొరకు Farmer కోటా లో అప్లై చేసి Form 1, Form 2 అప్లోడ్ చేశారో అలాంటి వారు 28, 29, 30 తేదీలలో క్రింద తెలుపబడిన లింక్ లో ని PDF File ను డౌన్ లోడ్ చేసుకుని అందులోని మీ ప్రాంతాలలోగల చిరునామాలో ఒరిజినల్ సర్టిఫికేట్ల తో వెళ్ళి Certificate Verification చేయించుకొనవలసినదిగా మనవి. Gemini Internet

to know for Certificate Verification Centers https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/adimissionpdfs.do?mode=downloadPDFFile&filename=Farmers%27quotaguidelines.pdf


to know Certificate verification notification

https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/adimissionpdfs.do?mode=downloadPDFFile&filename=Extension%20of%20last%20dates.pdf

28, అక్టోబర్ 2021, గురువారం

PM Kisan Tractor Yojana: రైతులకు శుభవార్త.. మీరు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు.. ఎలాగో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.

రైతుల ఆదాయాన్ని పెంచడానికి..ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలు తీసుకొచ్చింది.

PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని పెంచడానికి..ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలు తీసుకొచ్చింది. పీఎం కిసాన్ యోజన కింద అతని ఖాతాలో ఏటా 6000 రూపాయలు జమ అవుతుంది. విత్తనాలు, ఎరువులు, అనేక రకాల యంత్రాలపై రాయితీలు ఇస్తారు. రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇలా రైతులకు ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన.

పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అంటే..

రైతులకు వ్యవసాయానికి ట్రాక్టర్లు అవసరం. ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్లు కొనుగోలు చేయలేని రైతులు దేశంలో చాలా మంది ఉన్నారు. ట్రాక్టర్ అద్దెకు తీసుకుని లేదా ఎద్దుల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు చాలామంది రైతులు. అలాంటి రైతులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీఎం కిసాన్ ట్రాక్టర్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్ సగం ధరకే లభిస్తుంది.

50% సబ్సిడీ..

రైతులకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ (పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన) ఇస్తుంది. దీని కింద రైతులు ట్రాక్టర్లను కంపెనీ నుంచి సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. మిగతా డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. ఇది కాకుండా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత స్థాయిలో రైతులకు ట్రాక్టర్లపై 20 నుండి 50% సబ్సిడీని కూడా ఇస్తాయి.

ప్రయోజనాన్ని పొందండి

ప్రభుత్వం ఒక రైతుకు ఒక్క ట్రాక్టర్‌పై మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు కిసాన్ ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్, బ్యాంక్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి. ఈ పథకం కింద, రైతులు సమీపంలోని ఏదైనా సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Gemini Internet

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కొత్త రూల్స్!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ పథకానికి నమోదు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అవసరమైన పత్రాలలో మార్పులు చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు రిజిస్టర్ చేసే లబ్ధిదారుని రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, లబ్ధిదారులు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీని కూడా పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 

రేషన్ కార్డు తప్పనిసరి
ఇక నుంచి రేషన్ కార్డు లేకుండా పీఎం కిసాన్ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం లబ్ధిదారునికి లేదు. పీఎం కిసాన్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారుడు వారి రేషన్ కార్డు నంబర్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారంతో సహా ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టవచ్చు అని కేంద్రం భావిస్తుంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందించే 10వ వాయిదా తేదీని కూడా కేంద్రం నిర్ణయించింది. డిసెంబర్ 15, 2021 నాటికి లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కేంద్రం చేస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలనుకునే కొత్త రైతులు ఆ తేదీలోపు ముందస్తుగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా రూ.6,000 లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుని ఖాతాకు బదిలీ చేస్తుంది.

 

Gemini Internet

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...