23, నవంబర్ 2021, మంగళవారం

నేటి సమాచారం | Today Updates

NTR ట్రస్ట్ స్కాలర్ షిప్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేది డిసెంబరు 8 https://speedjobalerts.blogspot.com/p/ntr-8.html

అనంతపురంలో టూ వీలర్, మోటార్ మెకానిజమ్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికారం, ప్రథమ చికిత్స ల పైన నిరుద్యోగులకు శిక్షణ మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page_23.html

 

అనంతపురంలో ఉచిత సెల్ ఫోన్ రిపేరి ట్రైనింగ్ మరిన్ని వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page.html

అనంతపురంలో APS RTC Heavy Motor Vehicle Driving School లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/aps-rtc-heavy-motor-vehicle-driving.html


Alert for pensioners: పెన్షనర్లకు అలెర్ట్‌.. ఈ నెలాఖరుకల్లా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పెన్షన్‌ రాదు.. https://speedjobalerts.blogspot.com/p/alert-for-pensioners.html

Gemini Internet

DMHO, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్ ..– 76 పోస్టులకు చివరి తేదీ 29-11-2021

DMHO, Ananthapuramu Recruitment 2021 Radiographer, Pharmacist ..– 76 Posts Last Date 29-11-2021

Name of Organization Or Company Name : District Medical & Health Officer,Ananthapuram

Total No of vacancies:– 76 Posts

Job Role Or Post Name:Radiographer, Pharmacist...

Educational Qualification: SSC, ITI, D.Pharm, DMLT, Degree (Relevant Disciplines)

Who Can Apply:Andhra Pradesh

Last Date:29-11-2021

Click here for Official Notification


శ్రీ క్రిష్ణ దేవరాయ యూనివర్సిటీ కింద చదువుతూ, 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ లో BA., B.Sc., B.Com and BBA లకు ఆగస్టు/సెప్టెంబరు 2021లో జరిగిన పరీక్షలో కేవలం ఒక పేపరులో ఫెయిల్ అయినవారు Instant పరీక్ష వ్రాయడానికి అవకాశం వివరాలకు ఈ లింక్ ను చూడవచ్చు.




 

Gemini Internet

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగం మారినా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేదు

ఉగ్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగి ఉద్యోగాలు మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు (PF Account Number) అదే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో (PF Accounts) ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO)కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కేంద్రీయ వ్యవస్థను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆమోదించింది. దీంతో ఉద్యోగి ఉద్యోగాలు(Jobs) మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు అదే కొనసాగుతుంది. ఈపీఎఫ్ నిర్ణయంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో ఫండ్ బదిలీ (PF Funds Transfer) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సెంట్రల్ డేటాబేస్ ద్వారా కార్యక్రమాలు సాఫీగా సాగించడం, మెరుగైన సేవలను ఈపీఎఫ్‌ఓ అందించనుంది. ఈ వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాల డూప్లికేషన్ నివారించడం, ఖాతాల విలీనాన్ని సులభతరం చేస్తుంది.

ఈపీఎఫ్ తాజా నిర్ణయం ఏంటి?

సీ-డాక్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ కేంద్రీకృత వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ ఆమోదించినట్లు సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘సెంట్రల్ డేటాబేస్‌ ఆధారంగా ఈ విధానంలో పనులు దశల వారీగా ముందుకు సాగుతాయి. కార్యక్రమాలు సులభతరం చేయడంతోపాటు, మెరుగైన సేవలు పొందవచ్చు. ఒక వ్యక్తి రెండు మూడు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉండటం (Duplication), ఉద్యోగం మారినప్పుడు ఖాతాల్లో ఫండ్స్ బదిలీ అవసరాన్ని ఈ నూతన విధానం తొలగిస్తుందని’’రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్స్ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకునేలా తన సలహా సంస్థ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (Finance Investment and Audit Committee)కి అధికారం కల్పించాలని ఈపీఎఫ్ఓ ( Employees Provident Fund Office) నిర్ణయించింది. భారత ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కేస్ టు కేస్ ఆధారంగా పెట్టుబడుల పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (FIAC)కి అధికారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది

ఈపీఎఫ్ఓ అదనంగా నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల బోర్డు సభ్యులు, యజమానుల పక్షాల సభ్యులతోపాటు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. సంస్థలకు సంబంధించిన విషయాలపై కమిటీలు, సామాజిక భద్రతా అమలు కార్మిక,ఉపాధి మంత్రి అధీనంలో ఉంటుంది. డిజిటల్ బిల్డింగ్, పెన్షన్ సంబంధిత సమస్యలను యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు. ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) 229వ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

EPFO తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. 

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్రీకృత IT-ఎనేబుల్డ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆమోదించింది. ఈ చర్యతో, ఉద్యోగం మారిన తర్వాత కూడా ఉద్యోగి యొక్క PF ఖాతా సంఖ్య శాశ్వతంగా ఒకటే ఉండే వీలు కలిగింది.  EPFO తీసుకున్న ఈ  నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. కేంద్రీకృత వ్యవస్థ సహాయంతో, ఉద్యోగి యొక్క ఖాతా విలీనం అవుతుంది. కేంద్రీకృత వ్యవస్థ PF ఖాతాదారుల వివిధ ఖాతాలను విలీనం చేయడం ద్వారా ఒక ఖాతాను సృష్టిస్తుంది.

ఒక ఉద్యోగి ఒక కంపెనీని విడిచిపెట్టి మరొక కంపెనీకి వెళ్లినప్పుడు, అతను PF డబ్బును విత్‌డ్రా చేయడం లేదా మరొక కంపెనీకి బదిలీ చేయాలనేది ప్రస్తుతం నియమంగా ఉంది. ఖాతాను బదిలీ చేసే పనిని ఉద్యోగి స్వయంగా చేయాల్సి ఉంటుంది.

శనివారం జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈపీఎఫ్‌ఓ వార్షిక డిపాజిట్లలో 5 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇన్‌విట్‌లతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్‌వో సమావేశంలో నిర్ణయించారు.

 

DMHO అనంతపురం జిల్లాలో 129 ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేది డిసెంబరు 5, 2021

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖస్తులు కోరుతోంది.

ఉద్యోగాలుః-   

1) లాబ్ టెక్నీషియన్, 2) ఎఫ్ ఎన్ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్స్లీ) 86, 3) శానిటరీ అంటెండర్ కమ్ వాచ్ మెన్ 30

ఖాళీలుః-        

129 

అర్హతః-         

పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి లేదా తత్సమాన / డిప్లొమా (ఎం ఎల్ టి) ఎపి

మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉన్నవారు అర్హులు

వయస్సుః-   

పోస్టును అనుసరించి 42 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది

వేతనం:-    

పోస్టుని అనుసరించి నెలకు 12,000/- నుండి 50,000/- వరకు

ఎంపిక విధానం:-   

పోస్టుల్ని అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు ఫీజుః-   

జనరల్ 300/- చెల్లించాలి, SC/ST 200/- చెల్లించాలి.

ప్రారంభ తేదిః-   

నవంబర్ 22, 2021

చివరి తేదిః

డిసెంబర్ 5, 2021

చిరునామాః   

డిఎంహెచ్ఓ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

అదికారిక వెబ్ సైట్ః  | అధికారిక నోటిఫికేషన్ః    | అప్లికేషన్ Click here for Application

Scholarship: కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నారా..? అయితే ఈ స్కాల‌ర్‌షిప్ మీ కోస‌మే

Gemini Internet

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.

అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..
- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.

- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.

- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.

- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.

Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.

Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.

Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

AISSEE -2022: సైనిక్ స్కూల్‌లో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేశారా.. ప‌రీక్ష విధానం గురించి తెలుసుకోండి

AISSEE -2022: దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 9, 2022న జ‌ర‌గే ప‌రీక్ష‌కు సంబంధించిన ప‌రీక్ష విధానం మార్కుల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగిసింది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.


ముఖ్య స‌మాచారం ..

ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in

 అర్హ‌త‌లు..

- ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.


- వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.


ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125
300

తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150
500

విద్యాప్రమాణాలు మెరుగుప‌డ్డాయి: యూనిసెఫ్‌
ద్యాప్ర‌మాణాలు పాటించ‌డంలో భార‌త్‌ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేష‌న్స్ చిల్డ్ర‌న్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్న‌ట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్ల‌డించారు.

ఈ స‌ర్వేలో 21000 మంది పాల్గ‌న్నారు. భార‌త్‌లో విద్యా ప్ర‌మాణాలు పెర‌గ‌డంపై యూనిసెఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక యువ జ‌నాభా ఉన్న భార‌త్‌లో ఈ మార్పు ఆహ్వ‌నించ‌ద‌గ్గ‌ద‌ని పేర్కొన్నారు. కోవిడ్ (Covid 19) కార‌ణంగా కొద్ది మంది బాలికలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. తిరిగా మ‌ళ్లీ వారు వారిని పాఠ‌శాల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించింది.