21, ఫిబ్రవరి 2022, సోమవారం

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీసీఎస్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన జారీ చేసింది.

* టీసీఎస్‌ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. 2019/2020/2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే ఐటీ రంగంలో కనీసం 6 నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం అభ్యర్థులు టీసీఎస్‌ కెరీర్ పోర్టల్ లోకి వెళ్లి..  రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లి. వివరాలు నమోదు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిబ్రవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు.

* రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తివివరాలు, సందేహాల కోసం ilp.support@tcs.com మెయిల్‌, లేదా 1800 209 3111 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

 

Gemini Internet

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు

Bank Of Baroda Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీల వివరాలు:

పోస్ట్ఖాళీలు
ప్రొడక్ట్ హెడ్1
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్3
సీనియర్ మేనేజర్3
మేనేజర్3
మొత్తం: 10

 

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి.

* ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు అప్లై చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 07-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇలా దరఖాస్తు చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతంర కెరీర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత కరెంట్‌ ఆపర్చునిటిస్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అభ్యర్థులు అర్హులైన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై అప్లై నో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* చివరిగా అవసరమైన వివరాలను అందించి సబ్‌మిట్ నొక్కాలి.

 

Gemini Internet

NIN Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

NIN Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్యర, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ (01), ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (03), ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌ (04), ప్రాజెక్ట్‌ ల్యాబొరేటర్ఈ అటెండెంట్‌ (01), ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, డిప్లొమా, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డైరెక్టర్‌, ఐసీఎమ్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌, జమై ఉస్మానియా పోస్ట్‌, తార్నక, హైదరాబాద్‌ 50007, తెలంగాణ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత విద్యార్హతలు, అనుభవవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,800 నుంచి రూ. 47,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-03-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Gemini Internet

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

Railway Jobs: టెన్త్ పాస్ అయితే చాలు.. రైల్వేలో జాబ్.. ఎలాంటి రిజర్వేషన్లు లేవ్.. సోమవారమే లాస్ట్ డేట్

Rail Kaushal Vikas Yojana:  రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని యువత కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్ కౌశల్ వికాస్ యోజన’ పేరుతో వారిని స్వయం సాధికారత దిశగా అడుగులు వేయిస్తుంది. యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇది పూర్తిగా ఉచితం.  మెషినిస్టు, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో ట్రైనింగ్ ఇస్తారు. రైల్వేలకు పనికివచ్చే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఇలా కాకుండా కోర్సు నేర్చుకున్న తర్వాత ఎవరైనా సొంతంగా ఉపాధి పొందాలనుకుంటే వారికి సాయ సహకారాలు అందిస్తారు. అంటే మిషనరీ కొనుగోలులో డిస్కౌంట్‌ ఇప్పించడం.. లోన్లు వచ్చేలా చేయడం వంటివి. మూడేళ్లలో 50 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న  విడుదలైంది. అప్లై చేయడానికి చివరి తేదీ 21.2.22. ఈ పోస్టులకు సంబంధించి గొప్ప విషయం ఏంటంటే.. ఎలాంటి రిజర్వేషన్లు లేవు.

ఇందుకు అర్హతలు ఒకసారి చూద్దాం… 

  1.  18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు వారై ఉండాలి.
  2. భారతీయ పౌరులై ఉండాలి.
  3. టెన్త్ పాసై ఉండాలి
  4. టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు.
  5. ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు
  6. మంచి ఫిట్‌నెస్‌ ఉండాలి
  7. డాక్టర్ నుంచి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రంతో పాటు సిబ్మిట్ చేయాలి.
  8. అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ కూడా అవసరం.
  9. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ‘నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్’ సర్టిఫికేట్లను ఇస్తారు

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. శిక్షణలో భాగంగా స్టైపెండ్, ఇతర అలవెన్సుల లాంటివేమీ ఇవ్వరు. ఒక ట్రేడ్‌లో ఒకసారి మాత్రమే అభ్యర్థిని అనుమతిస్తారు.  సర్టిఫికేట్ పొందడానికి 75 శాతం హాజరు మస్ట్‌గా ఉండాలి. రైల్ కౌశల్ వికాస్ యోజన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును ట్రైనింగ్ సెంటర్లకు పోస్టు ద్వారా పంపచ్చు. అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/ చూడొచ్చు.

Gemini Internet

19, ఫిబ్రవరి 2022, శనివారం

SSC CHSL 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యమైన ప్రకటన

SSC CHSL 2021 Exam updates: ఎస్సెస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL 2021)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుక్రవారం (ఫిబ్రవరి 18) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఎస్సెస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7, 2022ను చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకుండా అంత కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు తాజాగా సూచించింది. చివరి తేదీనాటికి సర్వర్‌ బిజీగా ఉంటడం వల్ల సకాలంలో దరఖాస్తులు చేసుకోవడంలో వైఫల్యం ఎదుకావచ్చు. అందువల్ల ముగింపు తేదీవరకు వేచిచూడకుండా అభ్యర్ధులు వీలైనంత త్వరగా దరఖాస్తులు పూరించవల్సిందిగా కోరింది. అంతేకాకుండా అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అన్ని ముఖ్యమైన సూచనలను చదవాలని కూడా తెల్పింది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను ఎస్సెస్సీఅధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో సందర్శించవచ్చు.

SSC CHSL 2021 భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు, ఇతర ముఖ్యసమాచారం మీకోసం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్ష ద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను టైర్‌1, టైర్‌2, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో మొదటిది టైర్‌-1 పరీక్ష దీనిని 200 మార్కులకి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఇస్తారు. టైర్‌-2 పరీక్షను డిస్క్రిప్టివ్‌ పేపర్‌ రూపంలో నిర్వహిస్తారు. పేపర్‌ 1 200 మార్కులకు, పేపర్‌ 2 100 మార్కులకు ఉంటుంది. టైర్‌1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్‌2 తేదీని ఇంకా ప్రకటించలేదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లిండానికి చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

అప్లికేషన్ల కొరకు సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

IGNOU online programs: ఫారెన్‌ లాంగ్వేజుల్లో రెండు కొత్త ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించిన ఇగ్నో

IGNOU online Spanish and French language courses: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU ) జనవరి 2022 సెషన్‌కు సంబంధించి స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌ (School of Foreign Languages).. స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించింది. స్పానిష్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ (CSLCOL), ఫ్రెంచ్ లాంగ్వేజ్ (CFLOL)లో సర్టిఫికేట్ కోర్సులు అందించనుంది. ఈ భాషలను అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం, వినడం, మాట్లాడటంలో నైపుణ్యాలను పెంపొందించడంలో కొత్త కోర్సులు సహాయపడతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు నెలల వ్యవధికలిగిన ఈ సర్టిఫికేట్ కోర్సులకు ఫీజు రూ.4,500గా నిర్ణయించింది. భ్యాసకులు భాషా నైపుణ్యాలు (ఉచ్చారణ, వ్యాకరణం, పదజాలం, ప్రాథమిక సంభాషణ సామర్థ్యం) పెంపొందించడమే ఈ కోర్సుల ముఖ్య ఉద్ధేశ్యం. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి స్పానిష్ భాషలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక ఫ్రెంచ్ లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్‌.. ఇంటర్నేషనల్‌ స్టాండర్డైజేషన్ పెడగాజీ ఆధారంగా రూపొందించిన ఈ కోర్సు యూరోపియన్ భాషా నైపుణ్యాల పెంపుకు ఉపయోగపడేలా ఉంటుంది. ఈ కోర్సులో ప్రవేశం కోరే అభ్యర్ధులు రూ. 6,600 చెల్లించాల్సి ఉంటుందని కోఆర్డినేటర్‌ డాక్టర్ దీపన్విత శ్రీవాస్తవ తెలిపారు. స్పెయిన్, ఫ్రెంచ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.in ను సందర్శించాలని అభ్యర్ధులకు సూచించారు.

 

Gemini Internet

17, ఫిబ్రవరి 2022, గురువారం

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

RBI Assistant 2022 jobs: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 950

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు

హైదరాబాద్‌లో: 25

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు డిసెంబర్‌1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.450
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50

ఆన్‌లైన్‌ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

click here for official notification Gemini Internet