25, అక్టోబర్ 2023, బుధవారం

బీటెక్‌తో పాటు లెఫ్టినెంట్‌ కొలువు | ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది.

బీటెక్‌తో పాటు లెఫ్టినెంట్‌ కొలువు

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది.

పురుష అభ్యర్థులకు మాత్రమే 

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు.. ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది. జేఈఈ మెయిన్‌ స్కోరుతో నియామకాలుంటాయి.

ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను వారి స్కోరు ప్రకారం వడపోస్తారు. వీరికి రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఈ అవకాశం వచ్చినవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. జులై, 2024 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ పట్టా, ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి లెవెల్‌-10 ప్రకారం నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.  

ఎంపిక

జేఈఈ మెయిన్‌ స్కోరుతో విద్యార్థులను కుదిస్తారు. ఇందులో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ

మొత్తం శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్‌. ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మొదటి మూడేళ్లు బేసిక్‌ మిలటరీ ట్రైనింగ్‌, బీటెక్‌ టెక్నికల్‌ శిక్షణను.. పుణె, సికింద్రాబాద్‌, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. తర్వాత ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - దేహ్రాదూన్‌ లేదా ఏదైనా కేంద్రంలో ఈ శిక్షణ కొనసాగుతుంది. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది.

శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే వీరు అన్ని ప్రోత్సాహకాలూ కలిపి సీటీసీ రూపంలో నెలకు లక్ష రూపాయలకు పైగా అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్‌, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్‌, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను చేరుకోవచ్చు. ఇవి శాశ్వత పోస్టులు. అందువల్ల పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. అనంతరం పింఛనూ అందుకోవచ్చు.  


ఖాళీలు: 90

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌-2023 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2005 - జనవరి 1, 2008 మధ్య జన్మించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబరు 12
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/index.htm

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

తాజా ఇంటర్న్ షిప్‌లు work from home

హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ b సంస్థ: సినోహబ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.6,000

హైదరాబాద్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సినోహబ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 26
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/2cada6


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: జబొ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-25,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 27
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌,ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు
internshala.com/i/20a69e


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: సిద్ధివినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 27
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, జూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డెవలప్‌మెంట్‌ యూఎక్స్‌ రిసెర్చ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/69a91b


బిజినెస్‌ జర్నలిజం

సంస్థ: సీడ్‌ ఫండ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 30
అర్హతలు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌ కంటెంట్‌ రైటింగ్‌, ఇన్వెస్టింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/7efed0


మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/cf0674


మెషిన్‌ లెర్నింగ్‌

సంస్థ: సన్‌బేస్‌ డేటా
స్టైపెండ్‌: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: డాకర్‌, హడూప్‌, క్యూబర్‌నెట్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/11444b


- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

నోటిఫికెషన్స్ | దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)- 51 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | మహబూబ్‌నగర్‌లోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. | తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. | భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రిఫైనరీస్‌ డివిజన్‌- కింద పేర్కొన్న విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికెషన్స్

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)- 51 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ప్రభుత్వ ఉద్యోగాలు

డీఆర్‌డీవో- ఆర్‌ఏసీలో సైంటిస్ట్‌ పోస్టులు

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)- 51 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  సైంటిస్ట్‌-ఎఫ్‌: 02 బీ సైంటిస్ట్‌-ఇ: 14  
  • సైంటిస్ట్‌-డి: 08 బీ సైంటిస్ట్‌-సి: 27  

విభాగాలు: నేవల్‌ ఆర్కిటెక్చర్‌, మెరైన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌, మెకానికల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం.  
వయసు: సైంటిస్ట్‌ డి/ ఇ/ ఎఫ్‌ పోస్టులకు 50 ఏళ్లు. సైంటిస్ట్‌ సి కోసం 40 ఏళ్లు మించకూడదు.
బేసిక్‌ పే స్కేల్‌: సైంటిస్ట్‌ ఎఫ్‌- రూ.1,31,100. సైంటిస్ట్‌ ఇ- రూ.1,23,100. సైంటిస్ట్‌ డి- రూ.78,800. సైంటిస్ట్‌ సి- రూ.67,700.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.
వెబ్‌సైట్‌:  www.drdo.gov.in/ceptm-advertise


వాక్‌-ఇన్స్‌

మహబూబ్‌నగర్‌ కాటన్‌ కార్పొరేషన్‌లో ..

మహబూబ్‌నగర్‌లోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్‌ స్టాఫ్‌     2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 26, 27
వాక్‌ ఇన్‌ స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, మహబూబ్‌నగర్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌.
వెబ్‌సైట్‌: https://cotcorp.org.in/Recruitment.aspx


గుంటూరు కాటన్‌ కార్పొరేషన్‌లో ...

గుంటూరులోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌

తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్‌ స్టాఫ్‌    2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 02, 03
వాక్‌ ఇన్‌ స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, గుంటూరు బ్రాంచ్‌ ఆఫీస్‌, కాపస్‌ భవన్‌, అశోక్‌నగర్‌, గుంటూరు.
వెబ్‌సైట్‌:  https://cotcorp.org.in/Recruitment.aspx


అప్రెంటిస్‌షిప్‌

ఐవోసీఎల్‌లో 1,720 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రిఫైనరీస్‌ డివిజన్‌- కింద పేర్కొన్న విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలున్న రిఫైనరీలు: గువాహటి, బరౌని, గుజరాత్‌, హల్దియా, మధుర, పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, దిగ్బోయి, బొంగైగావ్‌, పారాదీప్‌.
1. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 869 ఖాళీలు
విభాగాలు: అటెండెంట్‌ ఆపరేటర్‌, ఫిట్టర్‌, మెకానికల్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌.
2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 851 ఖాళీలు
విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
మొత్తం ఖాళీల సంఖ్య: 1,720.
అర్హత: ఖాళీని అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌/ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ.
వయసు: 31-10-2023 నాటికి 18- 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 27-11-2023 నుంచి 02-12-2023 వరకు.
రాత పరీక్ష తేదీ: 03-12-2023.
రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 08-12-2023.
ధ్రవపత్రాల పరీశీలన: 13-12-2023 నుంచి 21-12-2023 వరకు.
వెబ్‌సైట్‌: https://iocl.com/apprenticeships

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

24, అక్టోబర్ 2023, మంగళవారం

SBI Recruitment: త్వరలో ఎస్‌బీఐ క్లర్క్‌ నోటిఫికేషన్‌ * ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం * ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక

SBI Recruitment: త్వరలో ఎస్‌బీఐ క్లర్క్‌ నోటిఫికేషన్‌

* ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం

* ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక 



ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి త్వరలో క్లర్క్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ రాబోతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. బేసిక్‌ పే నెలకు రూ.19,900 అందుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గతేడాది 5008 జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులకు ప్రకటన విడుదల కాగా నియామక ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. 

వెబ్‌సైట్‌

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

BARC: నవంబర్‌ 18-24 తేదీల్లో బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ నియామక పరీక్షలు * మొత్తం 4374 పోస్టుల భర్తీ

BARC: నవంబర్‌ 18-24 తేదీల్లో బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ నియామక పరీక్షలు

* మొత్తం 4374 పోస్టుల భర్తీ

భాభా అణు పరిశోధనా కేంద్రం(బార్క్‌)లో టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ తదితర ఖాళీల ప్రాథమిక నియామక రాత పరీక్షలు(కంప్యూటర్‌ ఆధారిత) నవంబర్‌ 18 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బార్క్‌- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో 4374 పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


పరీక్షల షెడ్యూల్‌



వెబ్‌సైట్‌

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

SSC : ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ 2023 టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు * అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో పరీక్షలు

SSC : ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ 2023 టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు

* అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో పరీక్షలు

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. టైర్‌-2 పరీక్షలు అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో జరగనున్నాయి. జులైలో నిర్వహించిన టైర్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్‌-2 పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. 




సీజీఎల్‌ఈ టైర్‌-2 సదరన్‌ రీజియన్‌ అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు…

* అసిస్టెంట్ (సెక్యూరిటీ): 436 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.10.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్,

రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, దేహ్రాదూన్, పుణె, ఇందౌర్, సూరత్.

జీత భత్యాలు: నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.

Notification Information

Posted Date: 20-10-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -