Alerts

--------

25, నవంబర్ 2023, శనివారం

స్కిల్ హబ్ లో కోర్సులకు అవకాశం | మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ | Opportunity for courses in Skill Hub | This course training is free for three months

స్కిల్ హబ్లో కోర్సులకు అవకాశం
పెనుకొండ, సోమందేపల్లి, న్యూస్టుడే: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిల్క్ హబ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ పేరును నమోదు చేయించు కోవాలని పెనుకొండ, సోమందేపల్లి ఎంపీడీవోలు శివశంకరప్ప, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందడానికి పది, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 18 ఏళ్ల నుంచి 29 లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఈనెల 30 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సమన్వయకర్త శివప్రసాద్ (96767 06976) సంప్రదించాలని కోరారు.

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు | APMSRB: 150 Civil Assistant Surgeon Specialist Posts in AP

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 

మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. 

ఖాళీల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 150 పోస్టులు

స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,50,000; గ్రామీణ ప్రాంతమైతే రూ.2,00,000; పట్టణ ప్రాంతమైతే రూ.1,30,000.

ఎంపిక ప్రక్రియ: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీలు: 11.12.2023, 13.12.2023, 15.12.2023.

స్థలం: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్‌, ఇ.నెం.77-21 జి, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.



 

Important Links

Posted Date: 24-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు | అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత | PGCIL: 203 Junior Technician Trainee Posts in PGCIL | Eligibility: ITI (Electrical) Pass in Electrician Trade from a recognized Technical Board/Institute.

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు 

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.18,500 స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్‌ టెక్నీషియన్‌ డబ్ల్యూ-3 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌.

ఖాళీల వివరాలు:

* జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ: 203 పోస్టులు (యూఆర్‌- 89, ఓబీసీ- 47, ఎస్సీ- 39, ఎస్టీ- 10, ఈడబ్ల్యూఎస్‌- 18, పీహెచ్‌- 08, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 19, డీఎక్స్‌ ఎస్‌ఎం- 5)

విభాగం: ఎలక్ట్రీషియన్‌.

అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 12.12.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.21,500- రూ.74,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12-12-2023

రాత పరీక్ష తేదీ: జనవరి-2024.



Important Links

Posted Date: 24-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

* పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.


 వెబ్‌సైట్‌ 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

హిందూపురానికి అయోధ్య రామయ్య పాదుకలు | Ayodhya Ramaya's Footsteps to Hindupuram

పురానికి అయోధ్య రామయ్య పాదుకలు
హిందూపురం అర్బన్, న వంబరు 24: ఆదర్శ ప్రాయుడు సీతారామచంద్రమూర్తి పాదుకలు హిందూపురానికి శుక్రవారం చేరాయి. రామజన్మభూమి అయోధ్యలోని శ్రీరామునికి కర్ణాటక రాష్ట్రం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మఠం ఆధ్వర్యంలో శారదా పాదుకలు అందజేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి తెలిపారు. అలాగే 16 నదుల నుంచి గంగా జలాన్ని సేకరించి కర్ణాటకలో కోటి ఇళ్లలో పూజలు చేయించి జనవరి 22వ తేదీన  మాలయానికి అందజేస్తారన్నారు. ఎంఎఫ్ రోడ్డులోని హయగ్రీవ ఆలయానికి పాదుకలు చేరుకున్నాయి. భక్తులు పాదుక లను దర్శించుకున్నారు. భగవత్ కార్యక్రమానికి ప్రతి హిందువు పాల్గొనాల న్నారు. పూజలు చేయించాలనుకునేవారు రామాంజనేయ బేకరి జనార్ధన్ 9030443900, 9182079188లను సంప్రదించాలన్నారు.






నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం | విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ | Free training for unemployed, followed by job with certificate Free training and job placement training in Health Counselor and Coordinator Course at Keats Trust, Vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
అనంతపురం క్లాక్వర్, నవంబరు 24: విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ చదివి 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 1 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు 90004 87423ను సంప్రదించాలన్నారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు | Results of Town planning overseer on APPSC website

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టు భర్తీ నియామక ఫలితాలను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...