27, నవంబర్ 2023, సోమవారం

IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు | IB: 995 Assistant Central Intelligence Officer Posts in Intelligence Bureau

IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు 

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు (యూఆర్‌- 377, ఈడబ్ల్యూఎస్‌- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.

వయోపరిమితి: 15-12-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.

ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/ లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసిస్‌ రైటింగ్‌ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

దరఖాస్తు రుసుము: రూ.550.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 25.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 19.12.2023.



Important Links

Posted Date: 26-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JNTUH: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు | ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా సీటు కేటాయిస్తారు | కోర్సులు: 1. సైబర్‌ సెక్యూరిటీ 2. డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ 3. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్

JNTUH: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు 

కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌- నవంబర్‌ 2023 విద్యా సంవత్సరానికి కింది ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు:

1. సైబర్‌ సెక్యూరిటీ

సబ్జెక్టులు: సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్‌ లాస్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌.

2. డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌

సబ్జెక్టులు: ప్రోగ్రామింగ్ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్ లెర్నింగ్.

3. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్

సబ్జెక్టులు: పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్.

అర్హత: డిప్లొమా/ యూజీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: 6 నెలలు.

క్లాస్‌ వర్క్‌ టైమింగ్స్‌(ఆన్‌లైన్‌): ఉదయం 6.30 గం. నుంచి 8.30 గం. వరకు.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా సీటు కేటాయిస్తారు.

ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్‌ రూ.500; అడ్మిషన్‌ రూ.1,000; కోర్సు రూ.25,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.

అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 26-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట..మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత | లోహపు వ్యర్థాలతో రామాలయం! | అయ్యప్ప భక్తుల కోసం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో 'అయ్యన్' యాప్ 2,500 kg heavy bell for Ayodhya Ram..Its special feature is the omkara sound when it is rung. Ram temple with metal waste! | 'Aiyan' app available in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi languages for Ayyappa devotees

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట
అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం. ఇందు కోసం రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని నిర్వాహకులు వెల్లడించారు.



లోహపు వ్యర్థాలతో రామాలయం!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరాన్ని నిర్మించారు కొందరు శిల్పకారులు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది మూడు నెలల పాటు శ్రమించి.. ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలతో రామమందిర నమూనాను తయారు చేశారు. ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పకారులు తెలిపారు.


అయ్యప్ప భక్తుల కోసం 'అయ్యన్' యాప్ 
• అందుబాటులోకి తెచ్చిన కేరళ అటవీ శాఖ శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ 'అయ్యన్' యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పనిచేసేలా దీన్ని  పొందించారు. గూగుల్ ప్లేస్టోర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్ పోలీస్ ఎయిడ్ పోస్ట్లు, తాగునీటి కేంద్రాల వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ ఈ దాడి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు చేసినట్లయితే.. ఈ యాప్ను ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీ శాఖ అధికారులు తెలిపారు. 



ప్రభుత్వ ఉద్యోగాలు | స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు | బెంగళూరులో టీచింగ్‌ ఉద్యోగాలు | జూనియర్‌ రెసిడెంట్లు - ఉద్యోగాలు | Government Jobs | 26,146 posts in armed forces by Staff Selection Commission Teaching Jobs in Bangalore | Junior Residents - Jobs

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

1. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌): 6,174  (పురుషులు- 5,211; మహిళలు- 963)

2. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌): 11,025 (పురుషులు- 9,913; మహిళలు- 1,112)

3. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌): 3,337  (పురుషులు- 3,266; మహిళలు- 71)

4. సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ): 635 (పురుషులు- 593; మహిళలు- 42)

5. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ): 3,189  (పురుషులు- 2,694; మహిళలు- 495)

6. అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌): 1,490 (పురుషులు- 1,448; మహిళలు- 42)

7. సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌): 296 (పురుషులు- 222; మహిళలు- 74)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయసు: జనవరి 01, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


వాక్‌-ఇన్స్‌

బెంగళూరులో టీచింగ్‌ ఉద్యోగాలు

బెంగళూరు, రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 7 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌: 01  
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01  

విభాగాలు: ఆర్థోపెడిక్స్‌, రేడియో-డయాగ్నోసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ.

అర్హత: మెడికల్‌ పీజీ.

వయసు: 67 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,39,607, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,59,334, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,36,889

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 01-12-2023.

వేదిక: న్యూ అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.


జూనియర్‌ రెసిడెంట్లు

బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 6 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌. వయసు: 30 ఏళ్లు మించకుడదు.

వేతనం: నెలకు రూ.1,10,741  

ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IDBI - ఉద్యోగాలకు ఆహ్వానం | 2100 కొలువులు | ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీవిద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

ఉద్యోగార్థులకు ఐడీబీఐ ఆహ్వానం!

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీవిద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!


2100 కొలువులు


ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ
విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

డీబీఐ పోస్టులకు జనరల్‌ అభ్యర్థులు పోటీ పడటానికి గరిష్ఠ వయసు 25 ఏళ్లు మాత్రమే. ఐబీపీఎస్‌ ద్వారా జరిగే బ్యాంకు పీవో పోస్టులకు మాత్రం అన్‌ రిజర్వ్‌డ్‌ వర్గాలకు 30 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పరీక్షకు పోటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్‌ పరీక్ష కూడా లేకపోవడం కలిసొచ్చే అంశమే. ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అయితే వీరి పనితీరు ప్రకారం రెండేళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవచ్చు. రెండు పోస్టులకూ.. ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రి రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు మాత్రం ఇంటర్వ్యూ అదనం.

ఆన్‌లైన్‌ పరీక్ష

రెండు పోస్టులకూ పరీక్ష విధానం ఒక్కటే. మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌లో 60, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ విభాగంలో 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు.

ఇంటర్వ్యూ, తుది ఎంపిక

ఆన్‌లైన్‌ పరీక్షలో సెక్షన్లవారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందాలి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది.

ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులు పొందినవారు పరీక్షలో సాధించిన మార్కుల్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు మార్కులు కలిపి మెరిట్‌ జాబితా రూపొందించి, ఉద్యోగానికి తీసుకుంటారు.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు మాత్రం పరీక్షలో చూపిన ప్రతిభతో ధ్రువ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.  

వేతనం

జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’కు ఎంపికైనవారికి క్లాస్‌ ఏ సిటీలో అయితే ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు అందుతుంది. వీరు ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. మూడేళ్ల సర్వీస్‌తో గ్రేడ్‌ ‘ఏ’ హోదా పొందుతారు. అదే ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో చేరినవారికి మొదటి ఏడాది ప్రతి నెలా రూ.29,000, రెండో ఏట రూ.31,000 చొప్పున చెల్లిస్తారు. అయితే రెండేళ్ల సేవలు అనంతరం వీరిని కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’ పోస్టులకు ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. బ్యాంకు నిర్వహించే ఎంపిక పరీక్షలో విజయవంతమైతే వీరినీ శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్య వివరాలు  

ఖాళీలు: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ 800. (అన్‌ రిజర్వ్‌డ్‌ 324, ఓబీసీ 216, ఎస్సీ 120, ఎస్టీ 60, ఈడబ్ల్యుఎస్‌ 80). ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ 1300. (అన్‌ రిజర్వ్‌డ్‌ 558, ఓబీసీ 326, ఎస్సీ 200, ఎస్టీ 86, ఈడబ్ల్యుఎస్‌ 130).

విద్యార్హత: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు 60 (ఎస్సీ, ఎస్టీలైతే 55) శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

వయసు: నవంబరు 1, 2023 నాటికి 20 - 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నవంబరు 2, 1998 - నవంబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 6  

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు డిసెంబరు 31. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిసెంబరు 30.

ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000

వెబ్‌సైట్‌ : https://ibpsonline.ibps.in/idbiesonov23/

ఇదీ సిలబస్‌

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మన్‌ అవుట్‌, క్లాక్‌, క్యాలెండర్‌, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్‌, డైస్‌, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్‌, పజిల్స్‌, సిలాజిజమ్‌, ర్యాంకింగ్‌, సీక్వెన్స్‌, సింబాలిక్‌ ఆపరేషన్స్‌, నెంబర్‌ ఎనాలజీ, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ క్లాసిఫికేషన్‌, సిరీస్‌, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్‌బీఐ, బ్యాంక్‌ పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుËగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో ప్రాథమికాంశాలు చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్‌/ఐటీలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. బ్యాంకు కార్యకలాపాలకు అవసరమయ్యే కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలిస్తారు.  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్‌, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి కొన్ని, వ్యాకరణాంశాల నుంచి వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు.

సన్నద్ధత ఇలా..

  • పరీక్షకు సుమారు 33 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ సమయం ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి అవకాశం.  
  • ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తాజా అభ్యర్థులు ముందుగా పరీక్షలో పేర్కొన్న విభాగాలకు సంబంధించి ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన అంశాలను పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేయాలి.
  • పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • విభాగాల వారీ ఉన్న అంశాలను 23 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. చివరి పది రోజులు మాక్‌ టెస్టులకు కేటాయించాలి. ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలనూ బాగా సాధన చేయాలి.  
  • 200 ప్రశ్నలకు 120 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకూ కేవలం 36 సెకన్ల వ్యవధే ఉంటుంది. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసి, అక్కడ మిగుల్చుకున్న సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితేనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు.
  • మాక్‌ టెస్టులతో పరీక్ష విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి.
  • సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే విభాగం/ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే ఎక్కడ తప్పులు చేస్తున్నారో గుర్తించి, వాటిని తర్వాత పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు.
  • రుణాత్మక మార్కులు ఉన్నందున ఏ మాత్రం తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

26, నవంబర్ 2023, ఆదివారం

MPC తో కూడా డాక్టర్ కావచ్చు.... Can also be a doctor with MPC….

MPC తో కూడా  డాక్టర్ అర్హత...

  నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన నూతన  గైడ్ లైన్స్ ... 
ఎంపీసీ(MPC)ని కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. 
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది
కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఇంగ్లీషుతో పాటు, ఇంటర్ పాసైన తరువాత అదనపు సబ్జెక్టులు రాసి నీట్-యూజీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించవచ్చు. ఆ అభ్యర్థులకు ఎన్ఎంసీ అర్హత సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తుంది. ఎన్ఎంసీ మంజూరు చేసిన ధ్రువపత్రం సదరు విద్యార్థి విదేశాల్లో సైతం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి అర్హుల్ని చేస్తుంది.

ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొందేందుకు  ఇంగ్లీషు ప్రాక్టికల్స్ తో పాటు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ / బయో టెక్నాలజీ రెండు సంవత్సరాలపాటు చదివి ఉండాలి. కాలేజ్ నుంచి రెగ్యులర్ విధానంలో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయాలజీ / బయోటెక్నాలజీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్ట్ ని 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత అదనపు సబ్జెక్ట్ గా పూర్తి చేయడం సాధ్యం కాదని పాత నిబంధనల్లో ఉన్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధనలు వీటిని మార్చింది. దీంతో ఇంటర్ లో జీవశాస్త్రం / బయో టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండకపోయినా, వైద్య విద్య చదువుకోవాలనుకునే విద్యార్థుల కు ఇది మంచి అవకాశం
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

1వ తేదీ నుంచి రైళ్ల రద్దు | హిందూపురం అర్బన్ | Cancellation of trains from 1st Hindupuram Urban

1 నుంచి రైళ్ల రద్దు 
హిందూపురం అర్బన్, నవంబరు  25: 
పుట్టపర్తి వద్ద ఉన్న టన్నెల్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను డిసెంబరు ఒకటో తేదీ నుంచి దాదాపు రెండు నెలలపాటు రద్దు చేస్తున్నామని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని వారు కోరారు. హిందూపురం-గుంతకల్లు డెమో రైలు, కాచిగూడ-యలహం, లక్నో-యశ్వంతపురం, జబల్పూర్-యశ్వంతపురం, కోర్బాయశ్వంతపురం, కొంగో ఎక్సప్రెస్, దీన్ దయాల్-యశ్వంతపురం ఎక్స్ప్రెస్, సత్యసాయి ప్రశాంతి నిలయం సికింద్రాబాద్, ధర్మవరం - బెంగళూరు ప్యాసింజర్, సత్యసాయి ప్రశాంతి నిలయం-మచిలీపట్నం, గుంతకల్లు-హిందూపురం తదితర రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html