Alerts

Loading alerts...

16, మే 2020, శనివారం

DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ | జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు

డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.

‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ లిస్టులో ఉండి..  సెలెక్షన్‌ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్‌ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

🔳టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ సైన్స్‌ : ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-1లో 12, సెక్షన్‌-2లో 16, సెక్షన్‌-3లో 32, సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్‌ స్టడీస్‌: సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.

మ్యాథ్స్‌ పేపర్‌: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

🔳జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.



🔳కొలువు చూపే కొత్త డిగ్రీ, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ


పాఠ్యాంశాలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
ఈనాడు - అమరావతి

కొలువు చూపే కొత్త డిగ్రీ

కొత్త విద్యా సంవత్సరం(2020-21) నుంచి డిగ్రీ విద్యలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మూడేళ్ల కోర్సులో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి అప్రెంటిస్‌షిప్‌ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి చేర్చింది. ఆ మేరకు మార్చిన కొత్త పాఠ్యాంశాలు జూన్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

కొత్తగా ఇలా..


అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్యాల సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో ప్రతి సెమిస్టర్‌కు ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో ఏడాదిలో రెండేసి నెలలను ‘అప్రెంటిస్‌షిప్‌’గా పిలుస్తారు. ఇందుకు సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరు నెలల శిక్షణను ‘ఉద్యోగ నైపుణ్య శిక్షణ’గా పిలవనున్నారు.

నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు

* బీఏ: డేటా ఎనలిటిక్స్‌, పబ్లిక్‌ స్పీచ్‌, బడ్జెట్‌ తయారీ, కార్యాలయ ప్రాసెస్‌, పర్యాటక గైడెన్స్‌, సర్వే, రిపోర్టింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, జర్నలిజం.
* బీకాం: పర్యాటకం, చిల్లర వర్తకం, జీఎస్టీ, వాణిజ్య విశ్లేషణ.
* బీఎస్సీ: వైద్య ప్రయోగశాల సాంకేతికత, ఆక్వా, మత్స్య, బయోలజీ ప్రయోగశాల సాంకేతికత, ఫుడ్‌ అడల్‌ట్రేషన్‌.

Ad

జీవన నైపుణ్య సబ్జెక్టులు

* మానవ విలువలు, వృత్తి నైతికత,
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, * స్టాటిస్టిక్స్‌,
* ఇండియన్‌ కల్చర్‌, సైన్సు,
* ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ,
* ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌,
* ఎనటికల్‌ నైపుణ్యం, * పర్సనాలిటీ ఎన్‌హాన్స్‌, లీడర్‌షిప్‌, ‌* హెల్త్‌ ‌* పర్యావరణ విద్య.


* కొత్త పాఠ్యాంశాలపైఅధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వనున్నారు.

10th Class 2020 Marks Model Papers Download | పదవ తరగతి మార్కుల నమూనా పత్రాలు 2020

వార్తల్లో నేటి హిందూపురం


జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ఇందులో తనకల్లుకు చెందిన మహిళ, ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంట పల్లికి చెండిన మరో మహిళ, హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఒక మహిళ, మేళాపురానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కరోనా నియంత్రణ విషయమై ఎవ్వరు కూడా హిందూపురం వాసులను రానివ్వకూడదని హిందూపురానికి వెళ్ళకూడదని కర్ణాటక మరియు దాని సరహద్దు గ్రామాలలో చాటింపులు వేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు శాఖకు సూచనలిస్తూ మరింత అప్రమత్తం చేశారు ఎస్పీ సత్య యేసు బాబు. మన ఊరి పేరును నిలబెట్టాలి రా అని ఇంటిలో వారు చిన్నప్పుడు చెప్పుంటారు దానిని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్టున్నారు హిందూపురం వాసులు.

పాత పద్దతి ప్రకారం నేటి నుండి 4వ విడత ఉచిత రేషన్ ను ఈ నెల 27 వరకు ఇవ్వనున్నారు ఇందులో బియ్యం పప్పుశెనగ వంటి వస్తువులు ఉంటాయి. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

డి ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబరు 3 వ తేదీ నుండి ప్రారంభం అదే నెల 8వ తేదీవరకు వరుసగా ఆరు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

టెన్త్ పరీక్షలు మార్కుల నమూనా పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. 4 పేపర్ల నమూనాలను ఎస్సెస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. మిగిలిన పేపర్లని కూడా త్వరలో వెబ్ సైట్ లో చూడొచ్చు. మరింత సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్స్పాట్.కామ్ ను చూడొచ్చు.

వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3వ తేదీన. జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

2018-19 బ్యాచ్ కి చెందిన కన్వీనర్ కోటా అభ్యర్థులకు, ఒక సారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మార్కుల మెమోలకు బి ఎస్ ఇ ఎ పి.ఓ ఆర్జీ లో చూడొచ్చు.

జి ఎస్ టి ఆర్ 1 గడువు పెంపు ఏడాదికి 1.5 కోట్ల టర్నోవర్ కలిగిన వారు ఏప్రిల్ లో గా సమర్పించాల్సిన జి ఎస్ టి ఆర్ 1 ఫారాలను జూన్ లో, జులైలో సమర్పించాల్సిన ఫారాలను సెప్టెంబరులో సమర్పించవచ్చు.

యుజిసి నెట్ సి ఎస్ ఐ ఆర్ నెట్, జె ఎన్ యూ ఇ ఇ, ఐ సి ఎ ఆర్ నెట్ దరఖాస్తు గడువులను ఈ నెల 31 వరకు పెంచారు. 

2008 డి ఎస్సీ మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన అభ్యర్థులకు 21230 రూపాయలతో కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో 4579 మంది బి ఇడి 78 మంది డి ఇడి అభ్యర్థులు కలిపి 4657 మందికి ఉన్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి 641 మంది ఉన్నారు. అయితే వీరిలో కొంత మంది ఇప్పటికే తరువాతి డి ఎస్సీలో, మరి కొందరు ఇతర ప్రభుత్వోద్యోగాలను సంపాదించారు. మిగిలిన వారిలో ఎంత మంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోనున్నారు. అనంతపురం జిల్లా అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు తమ ఆసక్తిని డి ఇ ఓ అనంతపురం వెబ్ సైట్ లో తెలపాలన్నారు తెలియజేయాలని డి ఇ ఓ శామ్యూల్ శుక్రవారం తెలిపారు. ఎస్ జి టీ తెలుగు కామన్ మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు జిల్లా వెబ్ సైట్ లో ఉంచామన్నారు. 

ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్త్ పద్దతిలో సైకియాట్రిస్ట్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 19.

గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సైక్రియాటిట్స్ లేదా ఎం బి బి ఎస్ డాక్టర్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 20.





 

UGC NET దరఖాస్తు గడువు పెంపు | ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు | గుంటూరుజి జి హెచ్ లో ఖాళీలు


టెన్త్ నమూనా పత్రాలు వివరాలు | జూన్ 3వ తేదీన వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు | ఎల్ పి టి పరీక్షా ఫలితాలు విడుదల | జి ఎస్ టి ఆర్ 1 సమర్పణ గడువు పెంపు




డి ఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్ జి టీ ఉద్యోగాలకు రేపటి లోగా ఆసక్తిని ఆన్ లైన్ ద్వారా తెలపాలి | సెప్టెంబరు 3 నుండి డి ఎడ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు (వార్తా పత్రికల ద్వారా సేకరణ)





Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...