*పెద్ద దిన్నె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించు కార్యక్రమాలు* *జోగులాంబ గద్వాల్ జిల్లా,ఇటిక్యాల మండలం,పెద్దదిన్నే గ్రామము.* తెలంగాణ రాష్ట్రం *నేడు సాయంత్రం(22/01/2021, శుక్రవారం) పూజా కార్యక్రమాలు:* యాగశాల ప్రవేశం,అంకురార్పణ, మృత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ట తో కార్యక్రమం ప్రారంభం. *రేపు అనగా 23/01/2021, శనివారం:* ఉదయం ధ్వజారోహణం,బలిహరణ, హోమము పూజానంతరం అభిజిత్ లగ్నం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుకళ్యాణమహోత్సవం(11:23 నిమిషాల నుండి 12:23 నిమిషముల వరకు) కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం. సాయంత్రం హోమము, స్వామివారికి కైంకర్యాలు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. *24/01/2021,ఆదివారం:* ఉదయం హోమనము లఘు పూర్ణాహుతి, స్వామి వారికి ఆరాధన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి 09:00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాడవీధుల్లో ప్రభోత్సవం మీద భక్తులకు దర్శనం ఇస్తారు. *25/01/2021,సోమవారం:* ఉదయం సుదర్శన హోమము స్వామి వారికి కైంకర్యాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ...