*పెద్ద దిన్నె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించు కార్యక్రమాలు*
*జోగులాంబ గద్వాల్ జిల్లా,ఇటిక్యాల మండలం,పెద్దదిన్నే గ్రామము.*
తెలంగాణ రాష్ట్రం
*నేడు సాయంత్రం(22/01/2021, శుక్రవారం) పూజా కార్యక్రమాలు:* యాగశాల ప్రవేశం,అంకురార్పణ,
మృత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ట తో కార్యక్రమం ప్రారంభం.
*రేపు అనగా 23/01/2021, శనివారం:* ఉదయం ధ్వజారోహణం,బలిహరణ, హోమము పూజానంతరం అభిజిత్ లగ్నం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుకళ్యాణమహోత్సవం(11:23 నిమిషాల నుండి 12:23 నిమిషముల వరకు) కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం.
సాయంత్రం హోమము, స్వామివారికి కైంకర్యాలు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
*24/01/2021,ఆదివారం:* ఉదయం హోమనము లఘు పూర్ణాహుతి, స్వామి వారికి ఆరాధన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రాత్రి 09:00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాడవీధుల్లో ప్రభోత్సవం మీద భక్తులకు దర్శనం ఇస్తారు.
*25/01/2021,సోమవారం:* ఉదయం సుదర్శన హోమము స్వామి వారికి కైంకర్యాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సాయంత్రం 07:00 గంటల నుండి పుష్పయాగం, రాత్రి 10 గంటల నుండి రథోత్సవం (తేరు) భక్తులందరూ గోవింద నామాలను నామస్మరణం చేస్తూ భక్తిశ్రద్ధలతో స్వామి స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
*26/01/2021, మంగళవారము:*. ఉదయం విశేష హోమం, స్వామివారికి కైంకర్యాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
సాయంత్రం హోమము స్వామివారికి కైంకర్యాలు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరిఎరింగింపు(పల్లకిలో స్వామివారిని ఊరేగింపు(పారువేట) చేస్తారు,) అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
*27/01/2021, బుధవారం:* ఉదయం విశేష హోమాలు,మహా పూర్ణాహుతి ధ్వజాఆవరోహణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
సాయంత్రం నాలుగు గంటలకి చక్రస్నానం, తీర్థ వల్లి, నాగవల్లి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి.
ఈ కార్యక్రమాలన్నీ తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రాగలరని భగవత్ బంధువులందరిని పేరుపేరునా కోరడమైనది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
22, జనవరి 2021, శుక్రవారం
TTD NEWS
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి