10, నవంబర్ 2023, శుక్రవారం

ఉన్నత విద్యకు ఓఎన్‌జీసీ చేయూత * యూజీ, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఎవరికి? ఎంపిక? స్కాలర్‌షిప్పు వ్యవధి? నిబంధనలు ..కొనసాగాలంటే...దరఖాస్తుకు చివరి తేదీ: వెబ్‌సైట్‌ వీటన్నిటి విషయాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఉన్నత విద్యకు ఓఎన్‌జీసీ చేయూత

* యూజీ, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు


దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఫౌండేషన్‌ విభాగం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..


ఓఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవ డానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి     రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ  ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. 

ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 

అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2023-2024 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది. 

ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు. 

స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

వయసు: అక్టోబరు 16, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. 


నిబంధనలు 

వేరే ఏ ఉపకార వేతనాలూ మంజూరు కానివాళ్లే ఓఎన్‌జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవాళ్లూ ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


కొనసాగాలంటే

స్కాలర్‌షిప్పు ఏటా కొనసాగడానికి వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్పు అందదు. 

దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ప్రవేశపత్రం, ఫొటో, కుల ధ్రువీకరణ పత్రం, కాలేజ్‌ ఐడీ కార్డు, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. వీటిని అప్‌లోడ్‌ చేయాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30 

వెబ్‌సైట్‌: https://ongcscholar.org/#/


కోర్సులు, కేటగిరీలవారీ...

ఇంజినీరింగ్‌: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్‌

ఎంబీబీఎస్‌: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌

జియాలజీ/ జియోఫిజిక్స్‌: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్‌. 

దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5 పరిధిలో ఉన్నాయి.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IAF: అగ్నివీర్‌ వాయు నియామక పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

IAF: అగ్నివీర్‌ వాయు నియామక పరీక్ష ఫలితాలు

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలు ఏటా చేపడుతోంది. ఇందులో భాగంగా అగ్నివీర్ వాయు(01/ 2024) ఖాళీల భర్తీకి అక్టోబర్‌లో ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించారు. తాజాగా పరీక్ష ఫలితాలను వాయుసేన విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్‌నేమ్‌/ ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



అగ్నివీర్‌ వాయు నియామక రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

బైక్ రిపేరీలో శిక్షణ | సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం | ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

బైక్ రిపేరీలో శిక్షణ
అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 8: జిల్లాలోని నిరుద్యోగ యువ కులకు బైకు రిపేరీలో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఏఎఫ్
ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణకు 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 8, 9, పదోతరగతి, ఇంటర్,
ఐటీఐ చదివి వారు అర్హులన్నారు. శిక్షణ పొందిన ప్రతి అభ్యర్థికి టూల్ కిట్, సర్టిఫికెట్ అందజేస్తామని, అనంతరం నూరు శాతం ఉపాధి
కల్పిస్తామని అన్నారు. ప్రారంభించే ఈ శిక్షణకు త్వరలో సంబంధించి మరిన్ని వివరాలకు 9390505952, 77807 52418లను సంప్ర
దించాలన్నారు.

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ విశ్వనాథరెడ్డి తిరుపతి(విద్య), నవంబరు 8: జాతీయ స్థాయిలో సైనిక్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి డిసెంబరు 16వ తేదీ వరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2012 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2009 ఏప్రిల్1-2011 మార్చి 31 మధ్యజన్మించిన వారు అర్హులని తెలిపారు. దరఖాస్తు విధానం, నమూనా పరీక్షలు వంటి ఇతర సమాచారం కోసం తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు.ఇతర వివరాలకు
8688888802/03, 9399976999లను సంప్రదించాలని కోరారు.

ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

అనంతపురం సెంట్రల్, నవంబరు 8: ఈఏపీసెట్లో అర్హత సాధించి ఫార్మసీ ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు గురువారం నుంచి శనివారం వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 

ఉంటుందని కౌన్సెలింగ్ కేంద్ర కో-ఆర్డినేటర్, అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ వెరిఫికేషన్ ఆన్లైన్ ద్వారా జరుగుతుందని, అప్లోడ్ ప్రక్రియలో ఏదేని సమస్యలు వస్తే కళాశా

లలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న విదార్థులకు శనివారం నుంచి వెబ్ ప్షన్లు ఉంటుందన్నారు. పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్ కేటగిరి విదార్థులకు వారి సర్టిఫికెట్స్ను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలిస్తారన్నారు. వివరాలకు

https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/Welcome.do

వెబ్సైట్ను సందర్శించాలన్నారు.



9, నవంబర్ 2023, గురువారం

UPSC: కేంద్ర విభాగాల్లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు/ శాఖల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

UPSC: కేంద్ర విభాగాల్లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 

దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు/ శాఖల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ)- 07

2. అసిస్టెంట్ డైరెక్టర్(మేనేజ్‌మెంట్)- 01

3. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(కెమికల్)- 04

4. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(గ్లాస్ అండ్ సెరిమిక్స్)- 04

5. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(ఫుడ్‌)- 12

6. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(హొసియరీ)- 04

7. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(లెదర్ అండ్‌ ఫుట్‌వేర్)- 05

8. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(మెటలర్జీ)- 05

9. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్‌)(మెటల్ ఫినిషింగ్)- 04

10. ప్రొఫెసర్(ఫార్మకాలజీ)- 01

11. సీనియర్ లెక్చరర్(రేడియో-డయాగ్నోసిస్)- 02

12. సీనియర్ లెక్చరర్ (సైకియాట్రీ)- 01

అర్హత:  సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-11-2023.



Important Links

Posted Date: 09-11-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

India Post Recruitment 2023: పోస్టల్ విభాగంలో 1899 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

India Post Recruitment 2023: పోస్టల్ విభాగంలో 1899 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; స్పోర్ట్స్ కోటాలో మాత్రమే..

India Post Recruitment 2023: పోస్టల్ విభాగంలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్ లో, వివిధ కేటగిరీల్లో మొత్తం 1899 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఈ నియామకాలు జరుపుతున్నారు.

India Post Recruitment 2023: ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1899 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. వాటిలో ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్ట్ లను స్పోర్ట్స్ కోటాలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ “https://dopsportsrecruitment.in” లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

లాస్ట్ డేట్

ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 9. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో నవంబర్ 10వ తేదీ నుంచి “https://dopsportsrecruitment.in” వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ల వారీగా వేతన శ్రేణి ఇలా ఉంది.

పోస్టల్ అసిస్టెంట్ లెవెల్ 4 - రూ. 25,500 - రూ.81,100

సార్టింగ్ అసిస్టెంట్ లెవల్ 4 - రూ. 25,500 - రూ.81,100

పోస్ట్‌మ్యాన్ లెవెల్ 3 - రూ. 21,700 - రూ.69,100

మెయిల్ గార్డ్ లెవెల్ 3 -రూ. 21,700 - రూ.69,100

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవల్ 1 - రూ. 18,000 - రూ.56,900

అర్హత, ఇతర వివరాలు..

పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్ కు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పై పనిచేయగలగాలి. పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ పోస్ట్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్కిల్ లోని స్థానిక భాషపై పట్టు ఉండాలి. 10వ తరగతిలో ఆ సబ్జెక్టు చదివి ఉండాలి. పోస్ట్ మాన్ పోస్ట్ కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఎంటీఎస్ పోస్ట్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

స్పోర్ట్స్ క్వాలిఫికేషన్

  • నోటిఫికేషన్‌లోని 7వ పేరాలో పేర్కొన్న ఏదైనా క్రీడలు / గేమ్‌లలో జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
  • నోటిఫికేషన్‌లోని పేరా 7లో పేర్కొన్న ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లలో తమ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
  • నోటిఫికేషన్‌లోని 7వ పేరాలో పేర్కొన్న ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పాఠశాలల కోసం జాతీయ క్రీడలు/గేమ్స్‌లో రాష్ట్ర పాఠశాల జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
  • నేషనల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ డ్రైవ్ కింద ఫిజికల్ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు.

వయో పరిమితి

పోస్టల్ అసిస్టెంట్ - 18-27 సంవత్సరాలు

సార్టింగ్ అసిస్టెంట్ - 18-27 సంవత్సరాలు

పోస్ట్‌మాన్ - 18-27 సంవత్సరాలు

మెయిల్ గార్డ్ - 18-27 సంవత్సరాలు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 18-25 సంవత్సరాలు


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

New Job Opening in Amazon for Bachelor's degree holders

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

New Job Opening in Amazon for Bachelor's degree holders

Amazon is looking for a Data Associate (DA) to undertake the task of foundational labelling functions, such as dialogue evaluation on speech & text data, to assess and improve Alexa’s performance in everyday situations

Job Role: ML Data Associate-I, Alexa Data Services (ADS)

Qualifications:

  • Bachelor's degree
  • Knowledge of Microsoft Office products and applications
  • Speak, write, and read fluently in English

Preferred Qualifications

  • Work a flexible schedule/ shift/ work area, including weekends, nights, and/or holidays

Key job responsibilities

  • Work with a range of text, speech and other types of data.
  • Deliver high-quality labelled data, using guidelines provided to meet our KPIs, and using in-house tools and software.
  • Report issues with tools and software as and when they occur.
  • Show Ownership and initiative when providing feedback for improvements to existing tooling that can increase the amount and quality of the data we process - we believe every ground-breaking change starts with a small idea!
  • Maintain strict confidentiality and follow all applicable Amazon policies for securing confidential information.

Location: Hyderabad

For more details, please visit: amazon.jobs/en/jobs/2493044/ml-data-associate-i-alexa-data-services-ads

Conclusion: Sakshi Education wishes you the best of luck. Keep up with our Sakshi Education website for the Latest Job Updates, Results, Education News, Online Test and many more. Thank You. If you like it, please share it with your friends.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Internship jobs ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

విశాఖపట్నం,హైదరాబాద్‌లలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: రాక్స్‌ట టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/34a381


విజయవాడలో

డిజిటల్‌ మార్కెటింగ్‌
సంస్థ: డిజిటల్‌ వెర్టొ
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: నవంబరు 9
అర్హతలు: డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ అనలిటిక్స్‌, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు
* internshala.com/i/9d2ceb


ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుషల్‌ స్పేసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/27709f


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html