10, నవంబర్ 2023, శుక్రవారం

బైక్ రిపేరీలో శిక్షణ | సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం | ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

బైక్ రిపేరీలో శిక్షణ
అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 8: జిల్లాలోని నిరుద్యోగ యువ కులకు బైకు రిపేరీలో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఏఎఫ్
ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణకు 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 8, 9, పదోతరగతి, ఇంటర్,
ఐటీఐ చదివి వారు అర్హులన్నారు. శిక్షణ పొందిన ప్రతి అభ్యర్థికి టూల్ కిట్, సర్టిఫికెట్ అందజేస్తామని, అనంతరం నూరు శాతం ఉపాధి
కల్పిస్తామని అన్నారు. ప్రారంభించే ఈ శిక్షణకు త్వరలో సంబంధించి మరిన్ని వివరాలకు 9390505952, 77807 52418లను సంప్ర
దించాలన్నారు.

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ విశ్వనాథరెడ్డి తిరుపతి(విద్య), నవంబరు 8: జాతీయ స్థాయిలో సైనిక్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి డిసెంబరు 16వ తేదీ వరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2012 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2009 ఏప్రిల్1-2011 మార్చి 31 మధ్యజన్మించిన వారు అర్హులని తెలిపారు. దరఖాస్తు విధానం, నమూనా పరీక్షలు వంటి ఇతర సమాచారం కోసం తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు.ఇతర వివరాలకు
8688888802/03, 9399976999లను సంప్రదించాలని కోరారు.

ఫార్మసీ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన

అనంతపురం సెంట్రల్, నవంబరు 8: ఈఏపీసెట్లో అర్హత సాధించి ఫార్మసీ ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు గురువారం నుంచి శనివారం వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 

ఉంటుందని కౌన్సెలింగ్ కేంద్ర కో-ఆర్డినేటర్, అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ వెరిఫికేషన్ ఆన్లైన్ ద్వారా జరుగుతుందని, అప్లోడ్ ప్రక్రియలో ఏదేని సమస్యలు వస్తే కళాశా

లలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న విదార్థులకు శనివారం నుంచి వెబ్ ప్షన్లు ఉంటుందన్నారు. పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్ కేటగిరి విదార్థులకు వారి సర్టిఫికెట్స్ను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలిస్తారన్నారు. వివరాలకు

https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/Welcome.do

వెబ్సైట్ను సందర్శించాలన్నారు.



కామెంట్‌లు లేవు: