IAF: అగ్నివీర్ వాయు నియామక పరీక్ష ఫలితాలు
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలు ఏటా చేపడుతోంది. ఇందులో భాగంగా అగ్నివీర్ వాయు(01/ 2024) ఖాళీల భర్తీకి అక్టోబర్‌లో ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించారు. తాజాగా పరీక్ష ఫలితాలను వాయుసేన విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్‌నేమ్/ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి