Alerts

26, నవంబర్ 2023, ఆదివారం

MPC తో కూడా డాక్టర్ కావచ్చు.... Can also be a doctor with MPC….

MPC తో కూడా  డాక్టర్ అర్హత...

  నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన నూతన  గైడ్ లైన్స్ ... 
ఎంపీసీ(MPC)ని కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. 
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది
కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఇంగ్లీషుతో పాటు, ఇంటర్ పాసైన తరువాత అదనపు సబ్జెక్టులు రాసి నీట్-యూజీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించవచ్చు. ఆ అభ్యర్థులకు ఎన్ఎంసీ అర్హత సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తుంది. ఎన్ఎంసీ మంజూరు చేసిన ధ్రువపత్రం సదరు విద్యార్థి విదేశాల్లో సైతం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి అర్హుల్ని చేస్తుంది.

ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొందేందుకు  ఇంగ్లీషు ప్రాక్టికల్స్ తో పాటు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ / బయో టెక్నాలజీ రెండు సంవత్సరాలపాటు చదివి ఉండాలి. కాలేజ్ నుంచి రెగ్యులర్ విధానంలో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయాలజీ / బయోటెక్నాలజీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్ట్ ని 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత అదనపు సబ్జెక్ట్ గా పూర్తి చేయడం సాధ్యం కాదని పాత నిబంధనల్లో ఉన్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధనలు వీటిని మార్చింది. దీంతో ఇంటర్ లో జీవశాస్త్రం / బయో టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండకపోయినా, వైద్య విద్య చదువుకోవాలనుకునే విద్యార్థుల కు ఇది మంచి అవకాశం
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

1వ తేదీ నుంచి రైళ్ల రద్దు | హిందూపురం అర్బన్ | Cancellation of trains from 1st Hindupuram Urban

1 నుంచి రైళ్ల రద్దు 
హిందూపురం అర్బన్, నవంబరు  25: 
పుట్టపర్తి వద్ద ఉన్న టన్నెల్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను డిసెంబరు ఒకటో తేదీ నుంచి దాదాపు రెండు నెలలపాటు రద్దు చేస్తున్నామని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని వారు కోరారు. హిందూపురం-గుంతకల్లు డెమో రైలు, కాచిగూడ-యలహం, లక్నో-యశ్వంతపురం, జబల్పూర్-యశ్వంతపురం, కోర్బాయశ్వంతపురం, కొంగో ఎక్సప్రెస్, దీన్ దయాల్-యశ్వంతపురం ఎక్స్ప్రెస్, సత్యసాయి ప్రశాంతి నిలయం సికింద్రాబాద్, ధర్మవరం - బెంగళూరు ప్యాసింజర్, సత్యసాయి ప్రశాంతి నిలయం-మచిలీపట్నం, గుంతకల్లు-హిందూపురం తదితర రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

25, నవంబర్ 2023, శనివారం

GMC/SSH, GGH మరియు GCON, అనంతపురంకు సంబంధించిన కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఆఖరి తేది 04/12/2023 | combined recruitment notification filling up of posts on contract/outsourcing basis pertaining to GMC/SSH, GGH and GCON, Anantapuramu

ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం(వైద్యం), న్యూస్ టుడే: ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన వైద్యశాల, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు సంబంధించి ఏడాదిపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసేందుకు ఆసక్తిగల ర్డులు డిసెంబరు 4 తేది సాయంత్రం 5 లోపు తమ దరఖాస్తులను అనంతపురంలోని వైద్యకఅందజేయాలని కళాశాలలో. https://ananthapuramu.ap.gov.in వివరాలు వెబ్సైట్లో పోస్టుల
ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు లను అభ్యర్థులు సదరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి అభ్య ర్థులు దరఖాస్తులు వైద్యకళాశాలలో అందజేయవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు ప్రకటనలో తెలిపారు వెల్లడించారు.అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ 


















-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ESIC: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులో జూనియర్‌ రెసిడెంట్లు | ESIC: Junior Residents at ESIC Medical College, Bangalore

ESIC: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులో జూనియర్‌ రెసిడెంట్లు 

బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు...

జూనియర్‌ రెసిడెంట్: 06 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుడదు.

జీతం: నెలకు రూ.1,10,741 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.


 

Important Links

Posted Date: 25-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ] | ఏ ఏ కుల వృత్తుల పై శిక్షణ ఉంటుంది.. అర్హతలు..వయసు.. తదితర వివరాలు

పలు దఫాలుగా విశ్వకర్మ శిక్షణ, శిక్షణ అనంతరం లోన్ పొందే అవకాశం. online లో అప్లై చేసుకోవడానికి సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మిరోడ్, హిందూపురం-9640006015 |

కుల వృత్తులను పాటించే వారు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గతంలో బ్యాంకులో లోన్ సరిగాకట్టని వారికి అర్హత లేదు. 

అప్లై చేసుకోవడానికి కావలసినవి:-

1) ఆధార్ 

2) ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు 

3) రేషన్ కార్డు 

4) బ్యాంకు పాసు పుస్తకము. 

శిక్షణ విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వారికి శిక్షణ సమయంలో రోజుకు రూ.500లతో అనంతరం రూ.15 వేల ఆర్థిక సాయం. 

శిక్షణ పూర్తయిన తరువాత అవసరమయిన వారికి రూ.2 లక్షల లోన్ కు ప్రభుత్వంచే రికమెండ్ చేయడం జరుగుతుంది.

PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ]

దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాన్ని రూపొందించడం జరిగింది. చేతులతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారి ని విశ్వకర్మ అని పిలుస్తారు.

వీరి కోసం తొలిసారి సహాయ ప్యాకేజీని ప్రత్యేకంగా ప్రకటించారు. సహాయ ప్యాకేజీని PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనే పథకం రూపంలో అమలు చేస్తారు. కొత్త పథకం ద్వారా సంపద్రాయ వృత్తులపై ఆధారపడే విశ్వకర్మ వర్గాల వారిని MSME వాల్యూ చైన్తో అనుసంధానం చేస్తారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు , అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

Benefits: అర్హులైన వారికి విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు మరియు ఆర్థిక సహాయం

పిఎం విశ్వకర్మ పథకం లో భాగంగా, చేతివృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు కింది ప్రయోజనాలు ఉంటాయి.

పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను ఇస్తారు

ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీ తో ఇస్తారు.

పథకం లో భాగం గా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలను కూడా అందజేయడం జరుగుతుంది.

పీఎం విశ్వకర్మ లో రెండు రకాల నైపుణ్య శిక్షణలో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బేసిక్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మరియు అడ్వాన్స్డ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉంటాయని తెలిపింది. లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

అలాగే ఆధునిక యంత్రాలు, కొనుక్కోవడానికి
పరికరాలు రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి ఏడాది 5లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గురు-శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. తొలుత 18 రకాల సం
ప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు.

కులాల వారికి పథకం వర్తిస్తుంది?

పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే

(1) వడ్రంగులు;

(2) పడవల తయారీదారులు;

(3) ఆయుధ /కవచ తయారీదారులు;

(4) కమ్మరులు;

(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;

(6) తాళాల తయారీదారులు;

(7) బంగారం పని ని చేసే వారు;

(8) కుమ్మరులు;

(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;

(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;

(11) తాపీ పనివారు;

(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;

(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);

(14) నాయి బ్రాహ్మణులు;

(15) మాలలు అల్లే వారు;

(16) రజకులు;

(17) దర్జీలు మరియు;

(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు

2) Pm Viswa karma Yojana Official Website 

PM విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైటు

          CLICK HERE  


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Sangam Dairy: సంగం డెయిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి...👉దరఖాస్తు చివరితేది: 05.12.2023 | Sangam Dairy: Sangam Dairy Jobs Notification Released..Apply through Email

Sangam Dairy: సంగం డెయిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి...
Sangam Dairy Recruitment Notification 2023: గుంటూరు(Guntur) జిల్లా వడ్లమూడిలోని సంగం మిల్క్ ప్రొడ్యుసర్ కంపెనీ లిమిటెడ్ (SMPCL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టుల వివరాలు:

1.మేనేజర్/ యూనిట్ హెడ్
▪️అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీఈ/బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/కెమికల్)
▪️అనుభవం: సంబంధిత విభాగంలో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో 8 సంవత్సరాలు మేనేజర్ స్థాయిలో పనిచేసి ఉండాలి.
▪️వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.

2.జూనియర్ అసోసియేట్
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

3.షిఫ్ట్ ఇన్ఛార్జ్
▪️అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ) లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్).
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

4.ఆపరేటర్
▪️అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్)
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

5.మైక్రోబయాలజిస్ట్
▪️అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ).
▪️అనుభవం: 3-8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

6.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్యూఏ)
▪️అర్హత: బీఎస్సీ/ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/కెమిస్ట్రీ)
▪️అనుభవం: 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

7.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్)
▪️అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

8.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (రిఫ్రిజిరేట్ & బూస్టర్)
▪️అర్హత: ఐటీఐ(రిఫ్రిజిరేషన్ & ఏసీ).
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

9.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బాయిలర్స్/వాటర్ వర్క్స్/ ఈటీపీ)
▪️అర్హత: బాయిలర్స్ (గ్రేడ్-1, గ్రేడ్-2) సర్టిఫికేషన్ ఉండాలి.
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

10.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)
▪️అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

11.జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ప్యాకింగ్/మెయింటెనెన్స్)
▪️అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్).
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

12.జూనియర్ అసోసియేట్ (స్టోర్స్)
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

13.జూనియర్ అసోసియేట్ (ఐటీ)
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

14.జూనియర్ అసోసియేట్ (F & A)
▪️అర్హత: బీకామ్/ఎంకామ్ డిగ్రీ ఉండాలి.
▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

15.జూనియర్ అసోసియేట్ (HR)
▪️అర్హత: ఎంబీఏ(HR) లేదా డిగ్రీ అర్హత ఉండాలి.
▪️అనుభవం: 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

16.జేఎం/ఏఎం
▪️అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
▪️అనుభవం: 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

17.జూనియర్ ఎగ్జిక్యూటివ్
▪️అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
▪️అనుభవం: 0-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

18.ఏఎం (మార్కెటింగ్)
▪️అర్హత: ఎంబీఏ మార్కెటింగ్.
▪️అనుభవం: 7-8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

19.జేఎం (మార్కెటింగ్)
▪️అర్హత: ఎంబీఏ మార్కెటింగ్.
▪️అనుభవం: 5-7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.

20.ఎగ్జిక్యూటివ్ (మార్కెటింగ్)
▪️అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్)/ ఏదైనా పీజీ/ ఏదైనా డిగ్రీ ఉండాలి.
2అనుభవం: డిగ్రీతో 4 సంవత్సరాలు, పీజీతో 2 సంవత్సరాలు, ఎంబీఏతో 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

21.ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

22.సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ప్రొక్యూర్మెంట్)
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 5 అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.

23.ఎగ్జిక్యూటివ్ (ప్రొక్యూర్మెంట్)
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

24.జూనియర్ ఎగ్జిక్యూటివ్
▪️అర్హత: ఐటీఐ.
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

25.జూనియర్ ఎగ్జిక్యూటివ్
▪️అర్హత: ఏదైనా డిగ్రీ.
▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.

👉విభాగాలు: ప్లాంట్ ఆపరేటర్స్, ప్రొడక్షన్, క్వాలిటీ అస్యూరెన్స్, ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్పుట్స్.

👉దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాలి. రెజ్యూమ్తో అన్ని సర్టిఫికేట్ కాపీలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రెండు నెలల పే స్లిప్స్ పంపాల్సి ఉంటుంది.


👉ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు చివరితేది: 05.12.2023

👉దరఖాస్తు పంపాల్సిన ఈ- మెయిల్ అడ్రస్ :

స్కిల్ హబ్ లో కోర్సులకు అవకాశం | మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ | Opportunity for courses in Skill Hub | This course training is free for three months

స్కిల్ హబ్లో కోర్సులకు అవకాశం
పెనుకొండ, సోమందేపల్లి, న్యూస్టుడే: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిల్క్ హబ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ పేరును నమోదు చేయించు కోవాలని పెనుకొండ, సోమందేపల్లి ఎంపీడీవోలు శివశంకరప్ప, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందడానికి పది, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 18 ఏళ్ల నుంచి 29 లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఈనెల 30 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సమన్వయకర్త శివప్రసాద్ (96767 06976) సంప్రదించాలని కోరారు.

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...