14, జనవరి 2024, ఆదివారం

మహిళలకు ‘పీఎం కిసాన్‌’ సాయం డబుల్‌! 'PM Kisan' aid to women is doubled!

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వా రా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ.10 వేలు లేదా 12 వేలకు.. మిగతా రైతులకు రూ.8 వేలు లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్‌ పథకం కోసం ఈ ఏడాది రూ.60 వేల కోట్లు కేటాయించారు. ఈ నెల 31వ తేదీన బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది.

New Delhi, January 13: As the Lok Sabha elections are approaching, the Narendra Modi government at the Center is working to increase PM Kisan assistance to farmers. This scheme, which was introduced before the 2019 elections, is currently providing Rs. 6 thousand per year to 11 crore farmers across the country. This amount is deposited in the accounts of farmers in three installments. But it seems that women farmers have the opportunity to double this amount. To this extent, it is planned to increase to Rs. 10 thousand or 12 thousand. For other farmers, it will be increased to Rs. 8 thousand or Rs. 9 thousand. In this regard, proposals will be made in the interim budget to be presented on February 1. Rs.60 thousand crores have been allocated for PM Kisan scheme this year. Budget meetings are likely to start on 31st of this month.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

13, జనవరి 2024, శనివారం

ECIL: ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

ECIL: ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు 

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2): 1,100 పోస్టులు

ట్రేడుల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275, ఎలక్ట్రీషియన్- 275, ఫిట్టర్- 550.

అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.22,528.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16/01/2024.

Important Links

Posted Date: 12-01-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ

ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

9, జనవరి 2024, మంగళవారం

KCET 2024: జనవరి 10 నుండి దరఖాస్తు చేసుకోండి, NEET వైద్య విద్యార్థులు కూడా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి

ఇంజనీర్ మరియు NEET UG మెడికల్ స్టూడెంట్స్ కోసం KCET కామన్ అప్లికేషన్: 2024-25లో వివిధ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్ష - KCET కోసం అప్లికేషన్ లింక్ జనవరి 10 నుండి 15 మధ్య విడుదల చేయబడుతుంది. ఈసారి ఇంజినీరింగ్ మరియు వైద్య విద్యార్థులు ఇద్దరూ సాధారణ దరఖాస్తును పూరించాలి.

ముఖ్యాంశాలు:

  • NEET రాసే మెడికల్ కోర్సు ఆశించేవారు కూడా ఇప్పుడు KCETకి దరఖాస్తు చేసుకోవాలి.
  • జనవరి 10 నుండి 15వ తేదీ మధ్య అప్లికేషన్ లింక్ విడుదల.
  • దరఖాస్తు ప్రక్రియ యొక్క వీడియో లింక్ ఇక్కడ ఉంది.
KCET 2024: దరఖాస్తుదారులకు ప్రత్యేక నోటీసు..!
కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ జనవరి 10 నుండి 15 వరకు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - KCET 2024 కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుంది. అధికారం ఇప్పటికే KCET 2024 పరీక్ష తేదీని కూడా విడుదల చేసింది. KCET కోసం దరఖాస్తు చేయడానికి KEA ఒక శిక్షణ వీడియోను విడుదల చేసింది, దీనిలో వైద్య కోర్సు అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి.

ఇంజినీరింగ్ విద్యార్థులు కేఈఏ వెబ్‌సైట్‌లో విడిగా దరఖాస్తు చేసుకునే బదులు, కేసీఈటీకి దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఉమ్మడి దరఖాస్తును సమర్పించాలని కేఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రమ్య సూచించారు.

JEE, NEET, KCET కోసం ఉచిత కోచింగ్ కోసం GetSetGoలో ఎలా నమోదు చేసుకోవాలి?

గతంలో కేసీఈటీ పరీక్ష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేవారు. NEET అభ్యర్థులు ఫలితాల తర్వాత వైద్య కోర్సులకు KEA కౌన్సెలింగ్‌కు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు. కానీ ఈసారి సాధారణ అప్లికేషన్ ఉంటుంది. సీటు అలాట్‌మెంట్ కోసం మీరు నీట్ ఫలితాల తర్వాత దరఖాస్తు చేసుకునే బదులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి. మరియు ఇది అప్లికేషన్ మరియు వెరిఫికేషన్ మోడ్‌లో ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్.రమ్య తెలిపారు.

వైద్య విద్యార్థులు NTA NEET UG కోసం దరఖాస్తు చేసి పరీక్ష రాయాలి. సీట్ల కేటాయింపు కోసం పరీక్ష ఫలితాల తర్వాత దరఖాస్తు ప్రక్రియ ఇకపై ఉండదు. ఇప్పుడు KCET కోసం దరఖాస్తు చేసుకోండి. NEET UG ఫలితం తర్వాత, NEET అభ్యర్థులకు ఒక చిన్న ఇంటర్‌ఫేస్ ఎంపిక ఇవ్వబడుతుంది, అక్కడ వారు NEET UG అప్లికేషన్ నంబర్, ఫలితాన్ని పూరించాలి మరియు అంతే.

ఈసారి కర్నాటక ఎగ్జామినేషన్ అథారిటీ ద్వారా కామన్ అప్లికేషన్ మరియు వెరిఫికేషన్ మోడ్ యొక్క దరఖాస్తు విధానం ఎలా ఆమోదించబడుతుందో తెలుసుకోవడానికి మరియు ఇతర మరింత సమాచారం కోసం, మీరు క్రింది లింక్‌పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

KCET కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిజర్వేషన్ వివరాలను అందించవచ్చు, ఏ కోర్సు కోసం ఎంచుకోండి, KCET / NEET ఎంచుకోండి. దరఖాస్తు రుసుము ఒకే విధంగా ఉంటుంది మరియు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దరఖాస్తు చేసిన తర్వాత సమాచారాన్ని సరిదిద్దాల్సి వస్తే, పాత సమాచారాన్ని తొలగించి, కొత్త సమాచారాన్ని అందించవచ్చు. చివరగా అభ్యర్థులు దరఖాస్తు ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
SSLC మార్కుల జాబితా
పుట్టిన తేదీ రికార్డు
రెండవ పీయూసీ మార్కుల జాబితా
రిజర్వేషన్ కోరేవారికి సంబంధించిన పత్రం
కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం
వ్యవసాయ కోటా కింద రిజర్వేషన్ కోసం దరఖాస్తుదారులు పత్రాన్ని సమర్పించాలి.
ఇతర అవసరమైన పత్రాలు

UG CET లేదా KCET 2024 ఎందుకు వ్రాయాలి?
ఇంజినీరింగ్, వెటర్నరీ, అగ్రికల్చరల్ సైన్స్, మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, పారామెడికల్ కోర్సులు, బిపిఓ, బిపిటి, ఎహెచ్‌ఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు అన్‌ఎయిడెడ్‌లో అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనడానికి కెసిఇటి పరీక్ష రాయాలి. కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు / విశ్వవిద్యాలయాలు. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

5, జనవరి 2024, శుక్రవారం

Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 

భాతర నౌకాదళం… ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.

వివరాలు:

10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్‌ కమిషన్)

బ్రాంచ్: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్

కోర్సు ప్రారంభం: 2024 జులైలో.

ఖాళీలు: 35 (మహిళలకు 10 ఖాళీలు కేటాయించారు)

వయోపరిమితి: 02 జనవరి 2005 నుంచి 01 జులై 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.

అర్హత: కనీసం 70% మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్) పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్) ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాంరంభం: 06-01-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024.

Important Links

Posted Date: 05-01-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

SSC JE ఉద్యోగాలు: ఎస్‌ఎస్‌సీ జేఈ నియామక తుది ఫలితాలు * మొత్తం 1,324 ఖాళీల భర్తీ

జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) 1,324 జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేస్తోంది. పేపర్‌-1 పరీక్షలు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీల్లో; పేపర్‌-2 పరీక్ష డిసెంబర్ 12వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా పొందినవారు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

-| ఇలాంటి
విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

CBSE: సీబీఐ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు * పోటీ పరీక్షల దృష్ట్యా కొత్త టైంటేబుల్

సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్‌ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టైం టేబుల్‌ (Time Table)లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. 10వ తరగతి షెడ్యూల్‌లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ గతంలో వెల్లడించారు.

   సీబీఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్‌ టైం టేబుల్   
 
  సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

4, జనవరి 2024, గురువారం

DLATO – NHM – NTEP – 01- మెడికల్ ఆఫీసర్, 01-జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, 01- DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్, 01-PPM కోఆర్డినేటర్ మరియు 01-అకౌంటెంట్ కింద NTEP – NHM (కాంట్రాక్ట్ బేసిస్) ఫైనల్ మెరిట్ లిస్ట్ నియామకం

దీనికి సంబంధించి, అభ్యర్థులు 08.01.2024న 08.01.2024న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జిల్లా TB కార్యాలయంలో, అనంతపురంలో స్పీకింగ్ ఆర్డర్‌ల కోసం పిలుపునిస్తారు.

DLATO – NHM – NTEP – 01- Medical Officer, 01-District Program Coordinator, 01- DOTS plus TB-HIV Supervisor, 01-PPM Coordinator and 01-Accountant under NTEP – NHM (Contract Basis) Final Merit List Appointment

In this regard, candidates will be called for speaking orders on 08.01.2024 from 10.30 AM to 1.00 PM at District TB Office, Anantapur.