న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వా రా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ.10 వేలు లేదా 12 వేలకు.. మిగతా రైతులకు రూ.8 వేలు లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ పథకం కోసం ఈ ఏడాది రూ.60 వేల కోట్లు కేటాయించారు. ఈ నెల 31వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. New Delhi, January 13: As the Lok Sabha elections are approaching, the Narendra Modi government at the Center is working to increase PM Kisan assistance to farmers. This scheme, which was introduced before the 2019 elections, is currently providing Rs. 6 thousand per year to 11...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు