4, డిసెంబర్ 2020, శుక్రవారం

T T D News



🕉  *డిసెంబ‌రు 14న విశాఖ‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం ఏర్పాట్ల‌పై టిటిడి జెఈవో స‌మీక్ష‌*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌ :  విశాఖ‌ప‌ట్ట‌ణంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌రు 14వ తేదీన శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ బుధ‌వారం సాయంత్రం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.

👉 ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను నాశ‌నం చేయాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ న‌వంబ‌రు 30వ తేదీ టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో కార్తీక మ‌హాదీపోత్స‌వ కార్య‌క్ర‌మం వైభ‌వంగా నిర్వ‌హించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇదే స్థాయిలో విశాఖ‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆయా శాఖల అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

       ◆  వేదిక మీద వెయ్యి దీపాల న‌డుమ శ్రీ‌వారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్తం యాగం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.
  అలాగే భ‌క్తుల‌కు విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామివారు అనుగ్ర‌హ భాష‌ణం ఇచ్చేందుకు స్వామిని కోర‌తామ‌న్నారు. భ‌క్తిగీతాలాప‌న‌, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్యం, సామూహిక ల‌క్ష్మీనీరాజ‌నం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హార‌తి, న‌క్ష‌త్ర హార‌తి, మంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించేలా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌న్నారు. అధికారుల బృందం విశాఖ‌కు వెళ్లి కార్య‌క్రమ నిర్వ‌హ‌ణ‌కు అనువైన ప్ర‌దేశాన్ని త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యించాల‌న్నారు.

👉 ఈ స‌మీక్ష‌లో జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య ద‌క్షిణామూర్తి, క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ గోపాల్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*
https://t.me/ttdnews  
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
    👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

కామెంట్‌లు లేవు: