భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయినది. NTPC Jobs Recruitment 2020 Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అర్హతలను బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 1,2020 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 15,2020 |
ఉద్యోగాలు – వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్టీపీసీ లో ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విభాగాలవారీగా ఉద్యోగాలు :
జనరల్ మేనేజర్ ( మైనింగ్ ) | 1 |
జనరల్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ) | 1 |
జనరల్ మేనేజర్ (కార్పొరేషన్ కమ్యూనికేషన్ ) | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ మైనింగ్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ కోర్సులను పూర్తి చేయాలి. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 57 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు చేయు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 5,00,000 వరకూ జీత భత్యాలు లభించనున్నాయి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
కామెంట్‌లు