జిల్లాలోని Grama Sachivalaya సిబ్బందికి జగనన్న అమ్మఒడి అనర్హుల జాబితా (IN ELIGIBILITY / With held )కు సంబంధించి గ్రీవెన్సు సవరించుటకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది
👉🏻పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు ఎలిజిబుల్ లిస్టు, ఇన్ ఎలిజిబుల్ లిస్టు మరియు విత్ హెల్డ్ లిస్టు పలు మూడు రకాల లిస్టులు డిస్ ప్లె చేయబడ్డవి.
👉🏻ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న తల్లులు ఆందోళన చెందకుండా మీకు సంబంధించిన గ్రామ సచివాలయముకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్స్ వెంటనే అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
👉🏻ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న పిల్లల తల్లులు సంబంధిత డాక్యుమెంట్లు ఆరు అంచెల వెరిఫికేషన్(six steps verification) కొరకు గ్రామ సచివాలయాల నందు జరుపబడు social audit లొ సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయించి అమ్మఒడి లబ్దిని పొందగలరు.
👉🏻గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు
👉🏻మీ ప్రాంత పరిధిలోని పాఠశాలలలోని అమ్మఒడి ఆనర్హుల జాబితాను సేకరించి ఆరు అంచేల వెరిఫికేషన్ (six steps verification) ప్రకారము సంబంధిత డాక్యుమెంట్స్ అందించిన తల్లిదండ్రులకు మీ లాగిన్ లో అప్లోడ్ చేసి వాటి పరిశిలన నిమిత్తం MPDO గారికి ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పంపించగలరు.
👉🏻మండల అభివృద్ధి అధికారులకు సూచనలు
• మీ లాగిన్ లో అమ్మఒడికి సంబంధించి వచ్చిన గ్రీవెన్సు ను ఎలాంటి ఆలసత్వం వహించకుండా వాటిని పరిశిలించి జాయింట్ కలెక్టరు డెవలప్మెంటు వారి లాగిన్ కు వెంటనే సంబంధిత డాక్యుమెంట్స్ తో forward చేయగలరు.
Note:జిల్లాలోని MPDO లు మరియు Grama Sachivalaya సిబ్బంది జగనన్న అమ్మఒడి కి సంబధించిన వివరములు ఎటువంటి ఆశ్రద్ద చేయకుండా తల్లులు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకోని వెంటనే అప్ లోడ్ చేయవలసినదిగా ప్రత్యేకముగా తెలియజేయడమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి