15, మార్చి 2021, సోమవారం

BECIL లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2021

 

పరీక్ష / ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీలుమార్చి 29, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ కన్సల్టెంట్ /కన్సల్టెంట్(హాస్పిటల్ మేనేజ్ మెంట్)

కన్సల్టెంట్ /కన్సల్టెంట్ (ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ )

సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్ (ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ )

సీనియర్ కన్సల్టెంట్ /కన్సల్టెంట్ (ప్రొక్యూర్ మెంట్ )

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 7 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /ఎండీ /ఎంబీఏ/బీఈ /బీ. టెక్ /సీఏ/CWA/డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో 10సంవత్సరాల అనుభవం ఉండి, కంప్యూటర్ కు సంబంధించిన  ఎంఎస్ ఎక్సెల్ /పవర్ పాయింట్ మొదలైన విషయాలపై అవగాహన ఉండాలని ప్రకటన లో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు  నోటిఫికేషన్ ను చూడవచ్చు.

వయసు :

62 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 750 రూపాయలు ను మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

పరీక్ష / ఇంటర్వ్యూ ల విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 జీతం మరియు కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

ఈమెయిల్ అడ్రస్ :

khuswindersingh@becil.com

maheshchand@becil.com

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :

01204177850

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: