15, మార్చి 2021, సోమవారం

DRDO సంస్థ హైదరాబాద్ విభాగంలో ఉద్యోగాల భర్తీ | DRDO Jobs Recruitment 2021

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమార్చి 24 , 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)19
రీసెర్చ్ అసిస్టెంట్ ( RA )1

విభాగాల వారీగా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఖాళీలు :

ఈసీఈ5
ఈఈఈ4
మెకానికల్5
సీఎస్ఈ3
కెమికల్ ఇంజనీరింగ్2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాల విభాగాలను అనుసరించి సంబంధిత స్పెషలైజషన్ లలో బీఈ /బీ. టెక్ /ఎంఈ /ఎం. టెక్/ఎంఎస్సీ (కెమిస్ట్రీ ) / ఎంఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు 28 సంవత్సరాలు మరియు రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

కామెంట్‌లు లేవు: