1, జులై 2021, గురువారం

ఇగ్నోలో జులై సెషన్‌–2021 దూరవిద్య ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021


న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో).. జులైæ 2021 సెషన్‌కు సంబంధించి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Adminissions  
మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు..
మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, ఎంసీఏ, మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్‌ డిగ్రీ/హయ్యర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా నాలుగేళ్ల వరకు ఉంటుంది.

బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌వర్క్, బీఎస్సీ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఆరేళ్ల వరకు ఉంటుంది.

డిప్లొమా ప్రోగ్రామ్‌లు..
న్యూట్రిషన్‌–హెల్త్‌ ఎడ్యుకేషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డెయిరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, హార్టికల్చర్, ఆక్వాకల్చర్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం ఒక ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు
పీజీ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
కోర్సు వ్యవధి: కనీసం ఒక ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది.

సర్టిఫికేట్‌ కోర్సులు..
కోర్సులు: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఇన్విరాన్‌మెంట్‌ స్టడీస్, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం 6 నెలలు నుంచి గరిష్టంగా 2 ఏళ్ల వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in

కామెంట్‌లు లేవు: