EPF Account: EPF మెంబర్ పేర్లు, పుట్టిన తేదీలు వంటి వివరాలను సరిచేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి EPFO కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, వృద్ధాప్యంలో సురక్షితమైన జీవితం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) స్కీమ్ లాంచ్ చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ స్కీమ్‌ను నిర్వహిస్తుంది. ప్రతి మెంబర్‌కి యూనిక్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తుంది.
ఉద్యోగి, యజమాని ప్రతి నెలా చేసే కాంట్రిబ్యూషన్స్ మేనేజ్ చేస్తుంది. అయితే కొన్ని కారణాలు వల్ల ఈపీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్స్ తరచూ రిజెక్ట్ అవుతుంటాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటోంది. ఇందుకు వివరాలు అప్‌డేట్ చేయాలని చందాదారులకు సూచిస్తోంది.
అయితే ఇప్పుడు EPF మెంబర్ పేర్లు, పుట్టిన తేదీలు వంటి వివరాలను సరిచేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి EPFO కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసింది. EPF మెంబర్స్ తమ సమాచారాన్ని సులువుగా అప్‌డేట్ చేసుకోవడానికి, క్లెయిమ్ రిజెక్షన్ రిస్కులను తగ్గించేందుకు, సమాచారంలో తేడాలతో మోసాలను నిరోధించేందుకు కొత్తగా స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)ను తీసుకొస్తోంది. ఐడెంటిటీ ట్యాంపరింగ్, వంచన, మోసానికి దారితీసే అన్‌రెగ్యులేటెడ్ ప్రక్రియలకు సంబంధించిన ఆందోళనలకు చెక్ పెట్టేందుకు EPFO తాజాగా 2023 ఆగస్టు 23న ఈ సర్క్యులర్ జారీ చేసింది.
అప్‌డేట్ చేసుకోగల వివరాలు : కొత్త స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద EPF మెంబర్స్ ఇప్పుడు చాలా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌లో పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, రిలేషన్‌షిప్ స్టేటస్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, ఎగ్జిట్ అవ్వడానికి కారణం, ఎగ్జిట్ అయిన డేట్, నేషనాలిటీ, ఆధార్ నంబర్ సహా మొత్తం 11 ప్రొఫైల్ రిలేటెడ్ విషయాలు ఉన్నాయి.
EPF విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్షన్‌లకి ప్రధాన కారణం.. క్లెయిమ్ చేస్తున్న వారు అందించిన వివరాలు, EPFO రికార్డులలో ఉన్న వివరాలకు మధ్య తేడాలు ఉండటం. ఈ సమస్యను పరిష్కరించడానికి, EPFO క్లెయిమ్ రిజెక్షన్‌లను తగ్గించడానికి, EPF మెంబర్స్‌కి ప్రాసెస్‌ని వీలైనంత ఈజీగా మార్చేందుకు SOPని జారీ చేసింది.
EPF మెంబర్స్ అకౌంట్‌లో మార్పుల కోసం ఎలా అప్లై చేయాలి? : తాజా సర్క్యులర్ ప్రకారం.. EPF అకౌంట్ హోల్డర్స్ తప్పనిసరిగా మెంబర్ సేవా పోర్టల్ ద్వారా కరెక్షన్ ప్రాసెస్ ప్రారంభించాలి. పోర్టల్‌లో అవసరమైన డాక్యుమెంట్‌లను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి భవిష్యత్తు అవసరాల కోసం స్టోర్ అవుతాయి. EPF మెంబర్స్ తమ అకౌంట్‌లలో చేసే ఏవైనా మార్పులను వారి యజమానులు వ్యాలిడేట్ చేయాలి.
EPF అకౌంట్ హోల్డర్ సమర్పించిన రిక్వెస్ట్ యజమాని లాగిన్‌లో కూడా డిస్‌ప్లే అవుతుంది. యజమాని రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి ఆటోమేటిక్ మెయిల్ వెళ్తుంది. ప్రస్తుత యజమాని జెనరేట్ చేసిన డేటాను మాత్రమే EPF మెంబర్స్ పొందగలరు.’ అని EPFO సర్క్యులర్‌లో పేర్కొంది.
ఈ కొత్త SOP, EPF అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేసే ప్రాసెస్‌ని సులభతరం చేయడమే కాకుండా భద్రతను మెరుగుపరుస్తుంది. EPF క్లెయిమ్‌లకు సంబంధించిన మోసపూరిత కార్యకలాపాలను తగ్గిస్తుంది. EPF సభ్యులకు తమ అకౌంట్‌లను మేనేజ్ చేస్తున్నప్పుడు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వివరాలు EPFO రికార్డులతో కచ్చితంగా మ్యాచ్ అయ్యేలా చూసుకోవడంలో సహాయపడుతుంది.
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి