〰〰〰〰〰〰〰〰
*1. ఆదిత్యను L1లోకే ఎందుకు పంపుతున్నారు?*
*ఆదిత్య ఎల్-1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రెజ్ పాయింట్-1లో నిలుపుతారు. ఇక్కడికి చేరితే ఒక వస్తువు ఇంధనం అవసరం లేకుండా కక్ష్యలో అలా తిరుగుతూనే ఉంటుంది. అది కూడా స్థిరంగా! ఎందుకంటే, దానిపై రెండు ఖగోళ వస్తువుల నుంచి వ్యతిరేక దిశల్లో సమాన బలం పని చేస్తుంది. అందుకే, ఇక్కడి నుంచి ఆదిత్యుడి ఫొటోలు తీయడానికి వీలవుతుంది.*
*2. ఆదిత్య L-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే?*
*సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. దీంతో సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఇస్రో తెలిపింది.*
*3. సూర్యుడిపై ఆదిత్య-L1 ల్యాండ్ అవుతుందా?*
*చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే సూర్యుడిపై ల్యాండింగ్ అంటూ ఉండబోదు. గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం NASAకు చెందిన ప్రోబ్ అనే రాకెట్ కరోనాలోనికి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.*
*4. ఆదిత్య-L1 విశేషాలివే..*
1. *సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే*
2. *రేపు ఉ.11.50 గంటలకు PSLV C-57 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.*
3. *శాటిలైట్ బరువు 1500 కేజీలు*
4. *మొత్తం 7 పేలోడ్లు ఉంటాయి.*
5. *సూర్యుని నుంచి వచ్చే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని ఈ పేలోడ్లు రీసెర్చ్ చేస్తాయి.*
*5. ఆదిత్య L-1తో ఆ దేశాల సరసన భారత్*
*ఇప్పటి వరకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరో స్పేస్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనానికి మిషన్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L-1 ప్రయోగంతో భారత్ ఆ దేశాల లిస్టులో చేరనుంది. 2018లో నాసా ₹లక్ష కోట్ల వ్యయంతో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారి సూర్యుడి వెలుపలి కక్ష్యలో ప్రవేశించింది. 2021లో సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని తాకింది. అయస్కాంత క్షేత్రాలు, ధూళి కణాల నమూనాలను సేకరించింది.*
*6. ఆదిత్య L-1: రోజుకు 1,440 ఫొటోలు*
*రేపు ఇస్రో ప్రయోగించే ఆదిత్య L-1లో 7 పేలోడ్స్ ఉన్నాయి. వీటిలో 4 సూర్యుడి కాంతిని, మరో 3 సూర్యుడి ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల గురించి పరిశోధిస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపలి పొరలు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఇందులోని కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్(VELC) పేలోడ్ రోజుకు 1,440 ఫొటోలను భూమికి పంపనుంది.*
*7. లాగ్రాంజ్-1 వద్దకు ఆదిత్య ఎల్-1 ఎలా చేరుకుంటుందంటే?*
*ఆదిత్య ఎల్-1 స్పేస్‌క్రాఫ్ట్‌ను మొదట దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెడతారు. అది భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ పయనిస్తుంది. అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలనుపయోగించి లాగ్‌రేంజ్-1 పాయింట్ వైపు ఆదిత్య ఎల్-1ను మళ్లిస్తారు. ఆ తర్వాత గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం నుంచి బయటపడి... చివరకు లాగ్రాంజ్-1 పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 చేరుకుంటుంది.*
*8. ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో*
*రేపు ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ల KM దూరంలో ఉండి, పరిశోధన సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% అని తెలిపింది. సూర్యుడు భారీ వాయుగోళం అని, దాని బాహ్య వాతావరణాన్ని ఆదిత్య-L1 అధ్యయనం చేస్తుందని వివరించింది. ఈ శాటిలైట్ సూర్యుడిపై ల్యాండ్ కాదని, సూర్యుడి దగ్గరకూ వెళ్లదని స్పష్టం చేసింది.*
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి