28, మే 2020, గురువారం

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ వార్తలు 28-05-2020

హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని కరోనా నియంత్రణ లో తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నటువంటి 31 వార్డు వాలంటీర్లకు నిత్యవసర వస్తువులు కూరగాయలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సతీష్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ 31 వ వార్డు నాయకురాలు ఇందిరమ్మ ఆధ్వర్యంలో జరిగింది.

లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కథలు, కవితలు పోటీలు నిర్వహిస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. కథ అయితే మూడు పేజీలకు మించకుండా, కవిత అయితే 25 లైన్లకు మించకుండా 9848348759 లేదా 9390512345 నెంబర్లకు  వాట్సాప్ ద్వారా పంపవచ్చని, కథ, కవితలకు వేరువేరుగా ప్రథమ బహుమతిగా 20 వేలు, ద్వితీయ బహుమతిగా 10 వేలు, తృతీయ బహుమతిగా 5 మందికి నాలుగు వేల చొప్పున అందజేయడం జరుగుతుందని అన్నారు. వీటిని ఈ నెల 30 నుండి జూన్ 7 లోపు పంపాల్సి ఉంటుంది. విజేతలను జూన్ 15 తెలుపుతామన్నారు.

ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు జూన్ రెండవ వారంలో విడుదయలయ్యే అవకాశం ఉంది అయితే ఈ  ఏడాది మాత్రం ముందుగా సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది.

నేడు వై ఎస్ ఆర్ వాహన మిత్రకు గడువు పూర్తి కానుంది. ఈ పథకం ద్వారా యజమానే డ్రైవరుగా ఉన్న ఆటోలకు, టక్సీ క్యాబులకు ప్రతి ఏటా 10 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ  దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్లకు అందజేయాలి. దరఖాస్తు ఫారాలకు జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్డు నందు సంప్రదించవచ్చు.

ఇంటర్ తరువాత టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారికోసం ఎపి డిఇఇ సెట్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు కు చివరి తేది జూన్ 5, పరీక్ష తేది జూన్ 23. లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉండి అప్లికేషన్ చేయించుకోవాలనుకునే వారు జెమిని ఇంటర్ నెట్ వారికి 9640006015 కు ఫోన్ చేసి ఆన్ లైన్ సేవలను పొందవచ్చు.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన టైలరింగ్, డ్రాయింగ్, వీవింగ్ కోర్సు టెక్నికల్  సర్టిఫికేట్ కోర్సు (టిసిసి) 2020 ఫలితాలను విడుదల చేసినట్లు డి ఇ  ఓ శామ్యూల్ బుధవారం ప్రకటనలో తెలిపారు.

కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా  ఉన్న ఈస్టర్న్ రైల్వేని చెందిన హౌరా డివిజన్ లోని ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన 50 పోస్టుల భర్తీ
మెడికల్ ప్రాక్టీషనర్లు 10
నర్సింగ్ సూపరింటెండెంట్ స్టాఫ్ నర్స్ 40
అర్హత పోస్టును అనుసరించి జి ఎన్ ఎం / బి ఎస్సీ/ ఎం ఎస్సీ నర్సింగ్,  ఎంబిబిఎస్ / ఎండి ఉత్తీర్ణత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరిగే ఈ ఉద్యోగాలకు ఇ మెయిల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది మే 31 fightcorona.howrah@gmail.com





27, మే 2020, బుధవారం

GEMINI TIMES | హిందూపురం పట్టణ | విద్య | ఉద్యోగ సమాచారం 27-05-2020

హిందూపురంలో కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరిస్తోంది. కాంటాక్ట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు పంపిణీ లో పాల్గొన్నవారికి కరోనా పాజిటివ్ తేలడం కొన్ని కేసుల్లో సరైన లింకులు  దొరకక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ తరివాత కూడా హిందూపురానికి ప్రత్యేక జనతా కర్ఫ్యూ  అవసరం  పడవచ్చు. ఈ తరుణంలో ఎస్పీ సత్య యేసు బాబు లాక్ డౌన్ ను కఠినంగా అమలు జరిగేలా చూడాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. కాగా ముక్కడిపేటలో పోలీసులు బారికేడ్లు బిగించడానికి వెళ్ళగా రెండు నెలలుగా కట్టిపడేశారు ఇంకెన్నాళ్ళు ఇలా అని జనం వారి పై తిరగబడగా పోలీసులు బ్యారికేడ్లు వేయకుండానే వెనుదిరిగారు.

ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రకారం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలు తమ వివరాలను ఈ నెల 27 నుంచి జూన్ 9 వ తేదీలోపల www.apsermc.ap.gov.in  వెబ్ సైట్లో పొందుపరచాలని అలా కాని  పక్షంలో ఫీజు వసూలుకు అనుమతించమని ఛైర్మెన్ జస్టిస్ ఆర్ కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏ విద్యాసంస్థ అయినా ఫీజులు పెంచినట్లు తెలిస్తే తల్లిదండ్రులు లేదా ఇతర వ్యక్తులు ఇదే వెబ్ సైట్లో ఉంచిన గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. కాగా దేశంలో పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 9700 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రెండు  రోజుల్లో విడుదలయ్యే అవకాశం  ఉంది.

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీటం బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తు గడువు పెంపు
ఖాళీలు 16
బోధనేతర సిబ్బంది 8
బోధనా సిబ్బంది 8
ఉద్యోగాల వివరాలు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జానినేషన్ 1, సిస్టం అనలిస్ట్ 1, ప్రైవేట్ సెక్రటరీ 1, నర్సింగ్ ఆఫీసర్ 1, ప్రిజర్వేషన్ అసిస్టెంట్ 1, ఎల్ డి సి 1, లైబ్రరీ అంటెండెంట్స్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 4, ప్రొఫెసర్ 1, అసోసియేషన్ ప్రొఫెసర్లు 3.
దరఖాస్తుకు ఆఖరు తేది మే 31
వెబ్ సైట్ http://rsvidyapeetha.ac.in

కోవిడ్ 19 కారణంగా ఆదాయం చెదిరి సొంత ఊళ్ళకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రత్యేకంగా వారి కోసం  స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 18001213711 నెంబరుకు వలస కార్మికులు ఫోన్ చేస్తే వారి స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

ఇకనుంచి వాట్సాప్ ద్వారా కూడా భారత్ గ్యాస్ వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. దేశంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉన్న భారత్  పెట్రోలియం కార్పొరేషన్ వాట్సాప్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. కస్టమర్లు గ్యాస్ సిలిండర్ కోసం కంపెనీ వద్ద నమోదు చేసుకున్న మొబైల్ నెంబరు నుంచి 1800224344 అనే నెంబరుకు వాట్సాప్ చేయవచ్చు.

ఇండియ‌న్ ఆర్మీలో సోల్జ‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సోల్జ‌ర్ పోస్టులు: 06
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 23 ఏళ్లు మించ‌కూడ‌దు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌
https://joinindianarmy.nic.in/writereaddata/Portal/BRAVO_NotificationPDF/Kargil_Rally_26_Jun_to_30_Jun_20.pdf

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌
https://nr.indianrailways.gov.in/nr/recruitment/1589263147648_Refractionist.pdf

అంధ్రప్రదేశ్ సెట్ ల పరీక్షా తేదీల వివరాలు

పరీక్ష
తేదీ
ఈసెట్
జూలై 24
ఐసెట్
జూలై 25
ఎంసెట్
జూలై 27 - 31 వరకు
పీజీసెట్
ఆగస్టు 2 - 4 వరకు
ఎడ్‌సెట్
ఆగస్టు 5
లాసెట్
ఆగస్టు 6
పీఈసెట్
ఆగస్టు 7- 9 వరకు (ఫీల్డ్ టెస్టు మాత్రమే)


దేశవ్యాప్తంగా జులై 18 నుంచి జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా ఉదయం పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. పరీక్ష జరిగే తేదీకి 15 రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచుతామని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షా కేంద్రం ఎక్కడన్నది కూడా అప్పుడే తెలుస్తుంది. ఈ అప్లికేషన్లలో ఫోటో లేదా వివరాలలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి సంబంధించిన లింక్ అందుబాటులో ఉంది. https://jeemain.nta.nic.in/webinfo/public/home.aspx

Indian Army Jobs

ఇండియ‌న్ ఆర్మీలో సోల్జ‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సోల్జ‌ర్ పోస్టులు: 06
అర్హ‌త‌: 
ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 23 ఏళ్లు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు | Northern Railway Jobs

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు
అర్హ‌త‌:
బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌

AICTE FREE E LEARNING COURSES

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఉచితంగా ఈ-లెర్నింగ్ కోర్సులు అందిస్తోందని ఆ సంస్థ జాతీయ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచితంగా ఈ కోర్సులు అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని తమ వెబ్‌సైట్స్ వేదికగా వీటిని అందిస్తున్నామని చెప్పారు. మే 15లోపు రిజిస్టర్ చేసుకున్న విద్యార్ధులు వీటిని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం 26 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటా అనలిటిక్స్ టెస్టింగ్, బిగ్ డేటా, ఆర్ ప్రోగ్రామింగ్, జావా, డేటా సైన్స్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు. వెబ్‌సైట్ www.free.aicte-india.org .

JEE MAINS EXAM DETAILS

జూలై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న జేఈఈ మెరుున్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జూలై మొదటి వారంలో హాల్‌టికెట్లను జారీ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేస్తోంది.

ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో జూలైకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తేదీలను ఇదివరకే ప్రకటించిన ఎన్‌టీఏ తాజాగా దానిపై అధికారిక నోటీసు జారీ చేసింది.
పరీక్షలు నిర్వహించే నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల పరీక్ష కేంద్రాల వివరాలతో కూడిన హాల్‌టికెట్లను పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందుగా జారీ చేస్తామని వెల్లడించింది. జూలై 26వ తేదీన నిర్వహించనున్న నీట్ హాల్‌టికెట్లను కూడా 15 రోజుల ముందుగా వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
మాక్ టెస్టులకోసం యాప్జేఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో https://www.nta.ac.in/Abhyas కూడా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఏ సెట్ ఎప్పుడు | తేదీల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్-2020 ఆన్‌లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.
అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ మే 6న విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్‌డౌన్‌లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌కు 1,69,137, అగ్రి,మెడికల్‌కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి.

తాజా షెడ్యూళ్లు ఇలా

పరీక్ష

తేదీ

ఈసెట్

జూలై 24

ఐసెట్

జూలై 25

ఎంసెట్

జూలై 27 - 31 వరకు

పీజీసెట్

ఆగస్టు 2 - 4 వరకు

ఎడ్‌సెట్

ఆగస్టు 5

లాసెట్

ఆగస్టు 6

పీఈసెట్

ఆగస్టు 7- 9 వరకు (ఫీల్డ్ టెస్టు మాత్రమే)