19, నవంబర్ 2020, గురువారం

APSCO Marketing Federation Jobs 2020

ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఏపీ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్  లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైంది.

తెలుగు భాష మాట్లాడే ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. Latest Marketing Jobs -2020.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు కు చివరి తేదీనవంబర్ 25,2020,సాయంత్రం 5 గంటల వరకూ

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

రీజనల్ సేల్స్ మేనేజర్స్

ఏరియా సేల్స్ మేనేజర్స్

అడ్మిన్ ఎగ్జిక్యూటివ్స్

ఆపరేషన్ మేనేజర్స్

అర్హతలు :

రీజనల్ సేల్స్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సులో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

ఏరియా సేల్స్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏదైనా ప్రాంతంలో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసిన వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును. కంప్యూటర్ స్కిల్స్ అవసరం మరియు ఎం ఎస్ – ఆఫీస్ లో నాలెడ్జ్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందు పరిచారు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ మరియు విశాఖపట్నం లలో వృత్తి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

ఆపరేషన్ మేనేజర్ :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీ. టెక్ లేదా అగ్రికల్చర్ విభాగంలో బీ. ఎస్సీ డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి. మరియు ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం జీతభత్యాలను అందుకోనున్నారు.

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ కు రెస్యూమ్ లను పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

hrd. apmarkfed@yahoo.com

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడగలరు.

Website

Notification

 

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. School of Planning and architecture Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ17 నవంబర్ 2020
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ30 నవంబర్ 2020
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ6 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ మరియు PhD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

జీతం:

పోస్ట్ ని బట్టి 37400 నుండి 67000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు  చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD, ఉమెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1500 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 3000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

 

MSME Tool Room Hyderabad Job Recruitment 2020 |

MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు కలకత్తా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ30 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 16 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

అడ్మిన్ ఆఫీసర్4
అడ్మిన్ అసిస్టెంట్10
ఫ్రెంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్2

అర్హతలు:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ ద్వారా తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

recruitment@ citdindia.org

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification 

Apply Now

 

18, నవంబర్ 2020, బుధవారం

పారామెడికల్ ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ప్రముఖ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన అపోలో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది. Paramedical Institute Jobs 2020 Telugu

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.

ఉద్యోగాలు:

ఈ ప్రకటన ద్వారా అపోలో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అప్లైడ్ సైన్స్, విజయవాడ నగరంలో వివిధ విభాగాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ప్రిన్సిపాల్స్ / లెక్చరర్స్

టెలి కాలర్స్

అడ్మిన్ ఆఫీసర్స్

విద్యార్హతలు :

ప్రిన్సిపాల్స్ /లెక్చరర్స్ :

ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఎంబీబీఎస్ /పీపీటీ /ఎంపీటీ /బీఏఎంఎస్ /బీహెచ్ఎంఎస్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

టెలి కాలర్స్ / అడ్మిన్ ఆఫీసర్స్ :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉండవలెను.

ఎంపిక విధానం :

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

జీతభత్యాలు :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతభత్యాలను ఇవ్వనున్నారు.

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ  నిర్వహించు ప్రదేశం :

అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్,

విజయవాడ.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను.

ఫోన్ నెంబర్ :

6303504699

 

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

4 సంవత్సరాలకు గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ నందు పని చేయవలసి ఉంటుంది. Hindustan Aeronautics Limited Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ16 నవంబర్ 2020
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ6 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 17 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఫిట్టర్ మరియు ఎయిర్ ఫ్రేమ్ ఫిట్టర్ మరియు సెక్యూరిటీ గార్డ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

ఫిట్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ITI పూర్తి చేసి ఉండాలి మరియు ఎయిర్ ప్రేమ్  పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లమో పూర్తి చేసి ఉండాలి

మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు PUC లేదా ఇంటర్మీడియట్ లేదా SSLC పాస్ అయ్యి ఉండాలి మరియు సంబంధిత  విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయసు:

28 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

47790 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు  వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ16 నవంబర్ 2020
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ15 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 34 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసి ఉండాలి

లేదా చాటింగ్ అకౌంటెన్సీ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలో అయినా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి

లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

Kvic ఎంప్లాయిస్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మచిలీపట్నం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ3 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్  విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

ట్రైని OL ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో BE,B tech,BSc చేసి ఉండాలి

and ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో  MBA చేసి ఉండాలి

మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 33 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ని బట్టి 25000 నుండి 35000 వరకు జీతం ఇవ్వడం జరిగింది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీసియల్ వెబ్సైట్ సంప్రదించగలరు