🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
🕉 *డిసెంబరు 14న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం ఏర్పాట్లపై టిటిడి జెఈవో సమీక్ష*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల : విశాఖపట్టణంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 14వ తేదీన శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ బుధవారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు.
👉 ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను నాశనం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నవంబరు 30వ తేదీ టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే స్థాయిలో విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.
◆ వేదిక మీద వెయ్యి దీపాల నడుమ శ్రీవారి ఉయ్యాల సేవ, స్వామివారికి అభిముఖంగా శ్రీ సూక్తం యాగం నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
అలాగే భక్తులకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామివారు అనుగ్రహ భాషణం ఇచ్చేందుకు స్వామిని కోరతామన్నారు. భక్తిగీతాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్యం, సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు కుంభ హారతి, నక్షత్ర హారతి, మంగళహారతి నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. అధికారుల బృందం విశాఖకు వెళ్లి కార్యక్రమ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని త్వరితగతిన నిర్ణయించాలన్నారు.
👉 ఈ సమీక్షలో జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ గోపాల్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
3, డిసెంబర్ 2020, గురువారం
TTD News
నిరుద్యోగులకు శుభవార్త, డిసెంబర్ 4న జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం నగరంలో డిసెంబర్ 4వ తేదీన వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు.
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిడాప్ ) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన సమాచారం :
| జాబ్ మేళా నిర్వహణ తేదీ | డిసెంబర్ 4,2020 |
| జాబ్ మేళా నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
| జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం | TTDC ట్రైనింగ్ సెంటర్, బాలయోగీ ఘాట్ ప్రక్కన,నల్ల వంతెన, అమలాపురం,తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్. |
సంస్థల వారీగా ఉద్యోగ అవకాశాలు :
న్యూ ల్యాండ్స్ లేబరేటరీ సంస్థ (హైదరాబాద్ ):
ఈ సంస్థలో ఖాళీగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపీసీ /బైపీసి విభాగాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి ఉన్న మరియు B.Sc ను మధ్యలో వదిలివేసిన పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చు.
శ్రీ సిటీ, తడ :
ఈ సంస్థలో హ్యుందాయ్ మోటార్ ఆపరేషన్స్, హీరో క్రాప్ మోటార్స్ ప్రొడక్షన్స్ ఆపరేటర్స్ ఉద్యోగాలను కల్పించనున్నారు.
ఫ్లెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ :
ఈ జాబ్ మేళా ద్వారా ఫ్లెక్ ఇండియా సంస్థలో ఆపరేటర్ /లైన్ లీడర్ ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిప్లొమా /డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీలు మాత్రమే అర్హులు.
వేతనాలు :
ఈ జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు నుండి 14,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Junior Lecturer Jobs 2020 || గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది. అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన విభాగాలకు గాను అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 5,2020 సాయంత్రం 4 గంటల లోపు. |
బోధన విభాగాల వారీగా అధ్యాపక పోస్టులు :
బోటనీ
సివిక్స్
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలను నేరుగా సంప్రదించవచ్చును.
South Western Railway Jobs Recruitment 2020 || భారతీయ రైల్వే స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వే బోర్డు నుంచి మరో మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలకు ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేదీ | నవంబర్ 30,2020 |
| దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 28,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
| అథ్లెటిక్స్ ( మెన్ ) | 3 |
| అథ్లెటిక్స్ ( ఉమెన్ ) | 2 |
| బాడ్మింటన్ (మెన్ ) | 2 |
| క్రికెట్ ( మెన్ ) | 3 |
| వెయిట్ లిఫ్టింగ్ ( మెన్ ) | 2 |
| టేబుల్ టెన్నిస్ (మెన్ ) | 1 |
| హాకీ ( మెన్ ) | 4 |
| స్విమ్మింగ్ ( మెన్ ) | 2 |
| గోల్ఫ్ ( మెన్ ) | 2 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 21 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యా కోర్సులను గుర్తింపు పొందిన బోర్డుల నుండి పూర్తి చేసి ఉండాలి. క్రీడా సంబంధిత విభాగాల్లో ప్రత్యేకమైన కోర్సులు చేసి ఉండవలెను.జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడ అంశాలలో ప్రావీణ్యత అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 1-1-2021 నాటికీ 18 – 25 సంవత్సరాల మధ్యన ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఫీల్డ్ ట్రయిల్స్, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో విజయాల మదింపు మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు VII సీపీసి విధానంలో జీతములు లభించనున్నాయి.
ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.400 రూపాయలు రిఫండ్ వస్తాయి. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటులను మరియు నోటిఫికేషన్ ను చూడగలరు.
Website
website 2
Notification
2, డిసెంబర్ 2020, బుధవారం
జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాల కోసం..
- మొదట యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లింక్ మీద క్లిక్ చేయండి.
- హోమ్ పేజ్‌లో UGC NET June 2020 Result లింక్ మీద క్లిక్ చేయండి.
- లాగ్ఇన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- యూజీసీ పరీక్ష ఫలితాలు స్రీన్ మీద కనిపిస్తాయి.
- ఈ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవాలి.
డైరక్ట్ లింక్ కోసం: ntaresults.nic.in/resultservices/UGCNet&auth&June&2020
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...