Alerts

--------

30, డిసెంబర్ 2020, బుధవారం

ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాల భర్తీ (ప్రైవేట్| Private)

ముఖ్యమైన తేదీలు  :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిజనవరి 3,2021(ఆదివారం )
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:00 AM

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక  :

ABR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చినర్లపాడు (గ్రామం ), కనిగిరి (మండలం ), ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్ – 523254. AP Engineering College Jobs 2020 Telugu

విభాగాల వారీగా ఖాళీలు :

టీచింగ్ పోస్టులు :

ప్రొఫెసర్లు

అసోసియేట్ ప్రొఫెసర్లు

అసిస్టెంట్ ప్రొఫెసర్లు

బోధన విభాగాలు :

సివిల్ /ఈఈఈ /మెకానికల్/ఈసీఈ/సీఎస్ఈ/సీఎస్ఈ (డేటా సైన్స్ ), సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) /మైనింగ్ /అగ్రికల్చర్ /ఎంబీఏ/మాథ్స్/ఫిజిక్స్ /కెమిస్ట్రీ /ఇంగ్లీష్ విభాగాలలో  టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నాన్ – టీచింగ్ విభాగం :

ల్యాబ్ టెక్నీషియన్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఎం. టెక్  మరియు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు AICTE నార్మ్స్ ప్రకారం జీతములు అందనున్నాయి.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట రెస్యూమ్స్, విద్యార్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9849497834

7780455788.

ఇండియన్ కోస్టు గార్డు ఉద్యోగాలు

దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన భారతీయ తీర గస్తీ దళం(ఇండియన్ కోస్టు గార్డు).. భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. సముద్ర మార్గంలో స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ.. దేశ తీర ప్రాంత రక్షణ కోసం కోస్ట్‌గార్డ్‌ను ఏర్పాటు చేశారు.Jobs భారత రక్షణ దళంలో పనిచేయాలని కలలు కనే సాహసవంతుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), నావిక్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 358
పోస్టుల వివరాలు:
నావిక్(జనరల్ డ్యూటీ)-260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-50, యాంత్రిక్(మెకా నికల్)-31, యాంత్రిక్ (ఎలక్ట్రికల్)-07, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)-10.
విద్యార్హతలు:
నావిక్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలనుకునే విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉం డాలి. దీనికి వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల వయసు కలిగినవారై ఉండాలి.
యా్రంతిక్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 5, 2021.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 19, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ/ఎస్టీలకు ఫీజు మినహయింపు ఉంది)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://joinindiancostguard.cdac.in/

29, డిసెంబర్ 2020, మంగళవారం

జగన్న అమ్మవొడి తరచుగా అడిగే ప్రశ్నలు


* 1. అనర్హమైనది (ఆధార్ వివరాలు చెల్లవు) *
* కారణం *: 20-12-2020కి ముందు కుటుంబానికి / పిల్లలకు హెచ్‌హెచ్ మ్యాపింగ్ చేయకపోవడం దీనికి కారణం
* పరిష్కారం *: కుటుంబ సభ్యులందరినీ HH మ్యాప్ చేయండి

* 2. HH మ్యాపింగ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి *
GSWS పోర్టల్ తెరవండి -> * WEDS * కు లాగిన్ అవ్వండి * -> * GSWS విభాగం * -> * ఆరు దశల ధ్రువీకరణ దిద్దుబాటు అప్లికేషన్ * పై క్లిక్ చేయండి * -> పేరు / మొబైల్ / ఆధార్ -> ఎంటర్ చేసి ఆరు దశల ధ్రువీకరణ దిద్దుబాటు అప్లికేషన్ మరొక ట్యాబ్‌లో తెరుచుకుంటుంది -> కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా నమోదు చేయండి ఆధార్ -> ఆపై వివరాలను పొందండి -> పై క్లిక్ చేయండి, అప్పుడు కుటుంబ సభ్యులను ఎవరు హౌస్‌హోల్డ్‌గా మ్యాప్ చేసారో చూపిస్తుంది

* 3. ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉంది *

* కారణం *: ప్రవేశం సమయంలో HM యొక్క లాగిన్‌లో అందించబడిన చైల్డ్ & మదర్ / గార్డియన్ ఆధార్స్ మరియు HH మ్యాపింగ్ చైల్డ్ & మదర్ / గార్డియన్ ఆధార్‌లు భిన్నంగా ఉంటాయి
* పరిష్కారం *: ఆబ్జెక్షన్ రైజింగ్ ఎంపికకు ధృవీకరణల కోసం గ్రామ / వార్డ్ సచివలయం ఇవ్వబడుతుంది

* 4. అనర్హమైన (డ్యూ 6 స్టెప్ ధ్రువీకరణ) *
* పరిష్కారం *: పథకం వారీగా అమ్మవోడి @ Gsws పోర్టల్‌గా ఎంచుకోవడం ద్వారా ఆందోళన సహాయక రుజువులతో ధ్రువీకరణ దిద్దుబాటు అనువర్తనాన్ని పెంచండి.

* 5. అనర్హులు (అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కారణంగా) *

* పరిష్కారం *: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఆదాయ మూలం <12,000 (యు) & <10,000 (ఆర్) జీతం సర్టిఫికేట్ / బ్యాంక్ స్టేట్మెంట్ క్రెడిట్ ఆదాయం యొక్క చెల్లుబాటు అయ్యే రుజువులతో మాత్రమే అభ్యంతరాలను పెంచగలదు <12,000 (యు) & <10,000 (ఆర్)

* 6. అర్హత కానీ బ్యాంక్ A / C & IFSC తప్పు *
* పరిష్కారం *: బ్యాంక్ A / C & IFSC దిద్దుబాట్ల సవరణ రెస్పెక్టివ్ స్కూల్ HM యొక్క లాగిన్‌లో ప్రారంభించబడింది.


* గమనిక: మార్పు విద్యార్థి స్టూడెంట్ ఐడితో ఒక్కసారి మాత్రమే చేయవచ్చు ..

Niab Jobs Recruitment 2020 Telugu || హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

 

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు :

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వాశాఖలో బయో టెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (NIAB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 4,2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిజనవరి 5,2021

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ,   సర్వే నెంబర్ : 37, జర్నలిస్ట్ కాలనీ ప్రక్కన, గౌలిదొడ్డి దగ్గర, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500032.

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసోసియేట్ – II1
ప్రాజెక్ట్ అసోసియేట్ -I3
ఫీల్డ్ అసిస్టెంట్4

అర్హతలు :

ప్రాజెక్ట్ అసోసియేట్ II ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ డిగ్రీ (ఎంబీఏ)/వెటర్నరీ సైన్స్ (ఎంవిఎస్సీ )/ఎంఎస్సీ (లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ /బయో కెమిస్ట్రీ /మైక్రో బయాలజీ) కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రాజెక్ట్ అసోసియేట్ I ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెటర్నరీ సైన్స్ లో  పోస్టు గ్రాడ్యుయేషన్ /ఎంవిఎస్సీ ( డిగ్రీ )/ ఎం. ఎస్సీ (లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ /బయో కెమిస్ట్రీ /మైక్రో బయాలజీ ) కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ అర్హతను సాధించాలి.

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్, యానిమల్ హస్బెండరీ /వెటర్నరీ సైన్స్ లో డిప్లొమా /బీ. ఎస్సీ (అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ ) కోర్సులను పూర్తి చేయవలెను. సంబంధిత రంగాలలో అనుభవం అవసరం. ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు మాట్లాడడం వచ్చిన వారికీ ప్రాధాన్యత ఇస్తారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల వయసు ఉండవలెను.ఓబీసీ అభ్యర్థులకు 3సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30,000 రూపాయలు నుండి 55,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలను ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ కు చేయవలెను.

pankajsuman@niab.org.in

Website 

 

ఇంటి నివాస స్థలం లేని నిరుపేదలకు ఉండాల్సిన అర్హతలు

1. తెల్ల  రేషన్ కార్డ్ ఉండాలి

2.  ఆధార్ కార్డ్ ఉండాలి

3. సొంత  ఇంటి స్థలం ఉండరాదు.

4. సొంత  ఇల్లు ఉండరాదు.

5. ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.

6. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.

7. మాగాణి 2.50, మెట్ట 5 ఎకరాల లోపు ఉండవచ్చు.

8. గతంలో  ప్రభుత్వం వారు ఇంటి స్థలం  మంజూరు చేసి ఉండరాదు.

9. గతంలో ప్రభుత్వం వారు Housing లోన్ మంజూరు చేసి ఉండరాదు.

10. గతంలో ప్రభుత్వం వారు LA లో లబ్దిదారుడై ఉండరాదు.

11. గతంలో ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికెట్ పొంది ఉండరాదు.

12. లబ్దిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉన్నచో లబ్దిదారుడు ఒక్కడే వారసుడు ఉన్నచో తదనంతరం సదరు ఇల్లు గాని ఇంటి స్థలం గాని అతనికే చెందును. కాబట్టి లబ్ది దారునికి ఇంటి స్థలం ఇవ్వవలసిన అవసరం లేదు

13. ఒక కుటుంబం నకు సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబం లో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకొనరాదు.

14. ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలంలను కొని అందులో నివాసం ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకొనరాదు.

పైన పేర్కొన్న అర్హతలు అన్నీ ఉండి మీరు ఇంకా ఇళ్ల స్థలం కొరకు అప్లై చేయకపోతే మీ యొక్క గ్రామ వాలంటీర్ ను వెంటనే సంప్రదించి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ మరియు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ వారికి ఇచ్చి 'మేము ఇళ్ల పట్టా పొందడానికి అర్హులు గా ఉన్నాం సచివాలయం నందు మాకు ఇళ్ల పట్టా  కొరకు అప్లై చేయండి' అని చెప్పాలి, అప్పుడు వాళ్ళు మీ దగ్గరకు ఒక అప్లికేషన్ ఫోరం తీసుకొని వస్తారు అప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి వారు ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకొని వెళ్ళి సచివాలయం నందు అప్లై చేస్తారు


జనవరి 1 నుంచి కొత్త రూల్స్

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో చాలా అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2021, జనవరి 1న మారే ఈ నియమనిబంధనల్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఏఏ అంశాల్లో ఎలాంటి రూల్స్ రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.


సరళ్ జీవన్ బీమా:
ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ 'సరళ్ జీవన్ బీమా' పాలసీని ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ 2021 జనవరి 1 నుంచి అందించనున్నాయి.

వాట్సాప్ : కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓల్డ్ వర్షన్ ఉపయోగిస్తున్నవారికి ఇక వాట్సాప్ సేవలు అందవు. వారి ఫోన్లలో 2021 జనవరి 1న వాట్సాప్ నిలిచిపోతుంది.

యూపీఐ పేమెంట్:
ఈ సర్వీస్ కోసం అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్‌ పే లాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్ ఛార్జీలు వసూలు చేయనున్నాయి. జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

గూగుల్ పే వెబ్ యాప్:
గూగుల్ పే వెబ్ యాప్ ఇక పనిచేయదు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పేమెంట్స్ చేసినట్టే వెబ్ యాప్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చన్న సంగతి తెలిసిందే. జనవరిలో వెబ్ యాప్‌ ను గూగుల్ నిలిపివేయనుంది.

చెక్ పేమెంట్స్:
మీరు ఏవైనా పేమెంట్స్ చేసేందుకు చెక్స్ ఇస్తున్నారా? చెక్ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్స్ వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటీవ్ పే సిస్టమ్‌ను అమలు చేస్తోంది. అంటే రీకన్ఫర్మేషన్ పద్ధతి ఇది. రూ.50,000 పైన పేమెంట్స్‌కి ఇది వర్తిస్తుంది. మీరు ఓ వ్యక్తికి చెక్ రూ.50,000 పైన చెక్ ఇస్తే ఆ చెక్ క్లియర్ చేసే ముందు బ్యాంకు నుంచి మీకు సమాచారం అందుతుంది. 2021 జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.

కాంటాక్ట్ ‌లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్: మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీల గురించి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.2,000 మాత్రమే ఉంది. 2021 జనవరి 1 నుంచి ఆర్బీఐ ఈ లిమిట్ ను రూ.5000 చేయనుంది.

కార్లు, బైకుల ధరలు:
2021 జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ కార్ల ధరల్ని పెంచుతున్నాయి. ఇన్‌పుట్ ధరలు పెరగడంతో కార్లు, బైకుల ధరల్ని పెంచక తప్పట్లేదు.

ఫోన్ కాల్స్: మీరు ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేస్తుంటారా? జనవరి 1 నుంచి ఫోన్ నెంబర్ ముందు 0 తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. లేకపోతే కాల్స్ వెళ్లవు. ఈ మేరకు కొత్త సిస్టమ్‌ ను 2021 జనవరి 1న ట్రాయ్ మార్చబోతోంది.

ఫాస్ట్‌ట్యాగ్: మీ ఫోర్ వీలర్‌కు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? 2021 జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది కేంద్ర రోడ్జు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. ఈసారి గడువు పొడిగించే అవకాశం లేదు.

ఎల్పీజీ సిలిండర్ ధరలు: ఆయిల్ కంపెనీలు జనవరి 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అయితే జనవరి నుంచి వారంవారం సిలిండర్ల ధరల్ని మార్చే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి.

జీఎస్టీ:
రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారులు నాలుగు జీఎస్‌టీ సేల్స్ రిటర్న్స్ లేదా జీఎస్టీఆర్-3బీ ఫైల్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం 12 ఫైల్ చేయాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.

మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై మల్టీ క్యాప్ ఫండ్‌లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో 25 శాతం తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. 2021 జనవరిలో ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాంఛ్ చేయనున్నాయి.

📌మూడు డీఎస్సీలు📌రెగ్యులర్‌ డీఎస్సీకి సంబంధించి టెట్‌ సిలబస్‌ రూపకల్పన పూర్తి



🎯సాక్షి, అనంతపురం విద్య: 2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతర చేయనుంది. ముచ్చటగా స్పెషల్‌ డీఎస్సీ, లిమిటెడ్‌ డీఎస్సీ, రెగ్యులర్‌ డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్‌ డీఎస్సీ, స్పెషల్‌ డీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ) అనంతరం రెగ్యులర్‌ డీఎస్సీ జారీ చేయనుంది. స్పెషల్‌ డీఎస్సీ, లిమిటెడ్‌ డీఎస్సీల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. 

🎯టెట్‌ సిలబస్‌ రూపకల్పన పూర్తి.. 

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) అర్హత తప్పనిసరి. ఒక సారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. గతంలో 20 శాతం టెట్‌కు, 80 శాతం వెయిటెజీ డీఎస్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తోంది. ఈక్రమంలో ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ టెట్‌ సిలబస్‌ రూపకల్పన పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సిలబస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. టెట్‌లో ఈ దఫా ఇంగ్లిష్‌కు అధికంగా వెయిటేజీ కల్పించనున్నారు. దీంతో నూతన సిలబస్‌ను రూపకల్పన చేశారు. 

🎯ఫిబ్రవరిలోపు లిమిటెడ్‌ డీఎస్సీ.. 
గత డీఎస్సీలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులభర్తీకి లిమిటెడ్‌ డీఎస్సీ పేరుతో ఫిబ్రవరిలోపు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నా రు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకోని దివ్యాంగ, ఓసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో పోస్టులను జిల్లాలో భర్తీ చేస్తున్నారు. లిమిటెడ్‌ డీఎస్సీకి సంబంధించి మోడల్‌ స్కూల్‌లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. మోడల్‌ స్కూల్‌లో జోన్‌ వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగో జోన్‌లో టీజీటీలో 4, పీజీటీలో 68 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రోస్టర్‌ పాయింట్లు రెండు రోజుల్లో నిర్ధారించనున్నారు. మోడల్‌ స్కూళ్లలో మొత్తం 72 పోస్టులు భర్తీ చేయనున్నారు.

🎯స్పెషల్‌ డీఎస్సీ.. 
దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్‌ బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్‌ డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ నేపథ్యంలో గతేడాది స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించారు. ఇందులో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు స్పెషల్‌ డీఎస్సీలో భర్తీ చేస్తారు. గతేడాది నిర్వహించిన స్పెషల్‌ డీఎస్సీలో 10 పోస్టులు భర్తీ కాలేదు. ఈ 10 పోస్టులకు స్పెషల్‌ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. స్పెషల్‌ బీఈడీ/స్పెషల్‌ డీఈడీ చేసిన వారు మాత్రమే స్పెషల్‌ డీఎస్సీ రాయడానికి అర్హులు.

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...