18, మార్చి 2021, గురువారం

ఎంజీ యూనివర్శిటీలో ఉద్యోగాలు | MG University Jobs


నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో పార్ట్‌ టైం టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
పోస్టుల వివరాలు:
ఎంఏ తెలుగు: అర్హత:
కనీసం 55శాతం మార్కులతో తెలుగు సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డ్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ/ఎంఫిల్‌/నెట్‌/ సెట్‌/స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.

ఎంఏ హిస్టరీ అండ్‌ టూరిజం: అర్హత: కనీసం 55శాతం మార్కులతో హిస్టరీ సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డ్‌తో పాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ/ఎంఫిల్‌/నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.

ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌: అర్హత: కనీసం 55శాతం మార్కులతో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/ఎకనామిక్స్‌ సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డ్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ/ఎంఫిల్‌/నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 19.03.2021

వెబ్‌సైట్‌: www.mguniversity.ac.in

మిధానీ, హైదరాబాద్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు | Midhani Non Executive Jobs

హైదరాబాద్‌లోని భారత ప్రభు త్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రోలింగ్‌ మిల్‌ ఆపరేటర్‌–02, వాకింగ్‌/రోలర్‌ హెర్త్‌ పర్నెస్‌ ఆపరేటర్‌–02, హాట్‌/కోల్డ్‌ లెవలర్‌ ఆపరేటర్‌–01, ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌–02.
రోలింగ్‌ మిల్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్‌/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.

వాకింగ్‌/రోలర్‌ హెర్త్‌ పర్నెస్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్‌/మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.

హాట్‌/కోల్డ్‌ లెవలర్‌ ఆపరేటర్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్‌/ మెటలర్జీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.21,900 చెల్లిస్తారు.

ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌: అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఈఓటీ క్రేన్స్‌ ఆపరేషన్‌లో కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు,అనుభవం,రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. విద్యార్హతలు–15 మార్కులు,అనుభవం–15 మార్కులు, రాతపరీక్ష–70 మార్కులు, ట్రేడ్‌ టెస్ట్‌–పాస్‌/ఫెయిల్‌ ఉంటాయి.
మొదటి స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్షకు పిలుస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని ట్రేడ్‌టెస్టుకి ఎంపిక చేస్తారు. రాతపరీక్షకు/ట్రేడ్‌ టెస్ట్‌కి ఎంపికైన అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా సమాచారం అందజేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

వెబ్‌సైట్‌: www.midhani-india.in

జీఐసీలో ఉద్యోగాలు | GIC Jobs General Insurance


భారత ప్రభుత్వానికి చెందిన జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీఐ)..సేల్స్‌ ఆఫీసర్‌(అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44Jobs
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.02.2021 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం– గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.32,975 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.03.2021

వెబ్‌సైట్‌: https://gicofindia.in.

ఎఫ్‌సీఐలో 89 ఉద్యోగాలు | FCI Jobs


భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ).. దేశవ్యాప్తంగా అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు–87, మెడికల్‌ ఆఫీసర్‌–02.
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు: జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌: 30:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

టెక్నికల్‌: 27: అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో అగ్రికల్చరల్‌ బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
అకౌంట్స్‌: 22: అర్హత: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియాలో మెంబర్‌షిప్‌ ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
లా: 08: అర్హత:ఫుల్‌టైం లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 33 ఏళ్లు మించకూడదు.

మెడికల్‌ ఆఫీసర్‌: అర్హత:ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రి య ఉంటుంది. రాతపరీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతుంది. ఇది 180 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం రెండున్నర గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా రీజనింగ్, డేటాఅనాలసిస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎథిక్స్, అగ్రికల్చర్, అగ్రికల్చర్‌ ఎకానమీ అండ్‌ కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

వెబ్‌సైట్‌: www.fci.gov.in

ఎన్‌ఎండీసీలో 304 ఉద్యోగాలు | NMDC Jobs

 


హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 304
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ)–81, బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ)–09.

ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌–35, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–30.
అర్హత: మిడిల్‌ పాస్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) (ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –76, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–72.
అర్హత: వెల్డింగ్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌/మోటార్‌ మెకానిక్‌/డీజిల్‌ మెకానిక్‌/ఆటో ఎలక్ట్రీషియన్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –49,బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–32.
అర్హత: ఎలక్ట్రికల్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్‌ ట్రేడులో మెట్రిక్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్‌(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.1383, పోస్ట్‌ ఆఫీస్, హుమాయూన్‌ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్‌–500028 చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021

వెబ్‌సైట్‌: www.nmdc.co.in

17, మార్చి 2021, బుధవారం

UPSC Combined Medical CMS Final Result Reserve List 2021

 

Union Public Service Commission UPSC Are Recently Uploaded Final Results with Reserve List for the Combined Medical Service Examination 2019 CMS Under Recruitment 2019. UPSC Those Candidates Are Appeared in the Interview Can Check the Final Results and Reserve List

Some Useful Important Links

Download Reserve List

Click Here

Download Final Result

Click Here

Download Interview Schedule

Click Here

Apply Online (DAF)

Click Here

Download DAF Notification

Click Here

Download Result

Roll No. Wise | Roll No. Wise

Download Admit Card

Click Here

Download Exam Notice

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Re Print Form

Click Here

Download Notification

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here