6, ఏప్రిల్ 2021, మంగళవారం

ఈ స్కూల్స్‌లో టీచర్‌ కొలువులు...దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌)లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..
  • ప్రిన్సిపల్‌–175
  • వైస్‌ ప్రిన్సిపల్‌–116
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1244
  • ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1944.

రాష్ట్రాల వారీగా ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్‌–117(ప్రిన్సిపల్‌ 14, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్‌11, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్‌గఢ్‌–514, గుజరాత్‌–161, హిమాచల్‌ప్రదేశ్‌–08, జార్ఖండ్‌–208, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌–14, మధ్యప్రదేశ్‌–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్‌–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్‌–316, ఉత్తరప్రదేశ్‌–79, ఉత్తరాఖండ్‌–09, సిక్కిం–44, త్రిపుర–58.

ఈఎంఆర్‌ఎస్‌..
గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది.

విద్యార్హతలు..
ప్రిన్సిపల్‌ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్‌ డిగ్రీ, బీఎడ్‌ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వైస్‌ ప్రిన్సిపల్‌: వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడ్‌ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.
టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్‌/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్‌ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021
పరీక్ష తేదీ: జూన్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: https://tribal.nic.in   
Published on 4/3/2021 4:47:00 PM

Ananthapuramu District Classfieds 06-04-2021




 

5, ఏప్రిల్ 2021, సోమవారం

Ananthapuramu District Classifieds 05-04-2021





 


తిరుపతి లో ఇంటర్వ్యూలు, పేర్మినెంట్ ఉద్యోగాలు | Tirupati Jobs Latest Update

 

మల్లాది డ్రగ్స్ & ఫార్మా సూటికల్స్ లో  ట్రైనీ పోస్టులకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రేణిగుంట నగరంలో ఉన్న ప్రముఖ మల్లాది డ్రగ్స్ & ఫార్మా సూటికల్స్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), చిత్తూరు జిల్లా ఒక ప్రకటన ద్వారా తెలిపినది. Tirupati Jobs Latest Update

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

APSSDC ద్వారా పెర్మనెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.పెర్మనెంట్ గా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంట నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 5 , 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

SIEMENS సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, SVU కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, గేట్ నంబర్ -4, SV యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు జిల్లా – 517501.

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీస్20

అర్హతలు :

కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ మరియు ఎం. ఎస్సీ కోర్సులను 2017 -2019 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,667 రూపాయలు చొప్పున సంవత్సరానికి 2 లక్షల వరకూ జీతం లభించనుంది.

అభ్యర్థులకు ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్, భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

NOTE :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ అప్డేట్ రెస్యూమ్, ఆధార్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు 10వ తరగతి మరియు 12వ తరగతి, డిగ్రీ మార్క్స్ షీట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లాలని ప్రకటనలో పొందుపరిచారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

88860 86072

1800-425-2422

Registration Link

Website 

 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1515 ఉద్యోగాలు | IAF Recruitment 1515 Jobs

IAF గ్రూప్ సీ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన విడుదల :

10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ గల విద్యా అర్హతలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో గ్రూప్ – సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ఈ ప్రకటన ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో     విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 1515  గ్రూప్ సీ సివిలియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. IAF Recruitment 1515 Jobs

వ్రాత పరీక్షల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజెన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిప్రకటన వచ్చిన 30 రోజులలోపు

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్2
సూపరింటెండెంట్ (స్టోర్ )66
స్టేనో GDE -||39
LDC53
హిందీ టైపిస్ట్12
స్టోర్ కీపర్15
సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్49
కుక్ (ఆర్డినరీ గ్రేడ్స్ )124
పెయింటర్ (స్కిల్స్ )27
కార్పెంటర్31
ఆయా /వార్డ్ సహాయక24
హౌస్ కీపింగ్ స్టాఫ్345
లాండ్రి మెన్24
మెస్ స్టాఫ్190
ఎంటీఎస్404
వాల్కనైజర్7
టైలర్ (స్కిల్డ్)7
టిన్ స్మిత్1
కాపర్ స్మిత్ &స్టీల్ మెటల్ వర్కర్3
ఫైర్ మెన్42
ఫైర్ ఇంజన్ డ్రైవర్4
FMT (స్కిల్డ్ )12
ట్రేడ్స్ మాన్ మేట్23
లేథెర్ వర్కర్ టర్నర్ (స్కిల్డ్ )1
వైర్ లెస్ ఆపరేటర్ మెకానిక్  (HSW Gd-II)1

మొత్తం ఉద్యోగాలు :

సుమారుగా 1515 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి 10వ తరగతి /10+2/ఐటీఐ /డిగ్రీ మొదలైన విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకి 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ / ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్షలు మరియు మెరిట్ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు 7th CPC విధానంలో జీతములు లభించనున్నాయి.

Website 

Notification

 

3, ఏప్రిల్ 2021, శనివారం

ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ రిక్రూట్మెంట్ , బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Govt Jobs Recruitment AP 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా నుండి విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు ) కు సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా రిజర్వేషన్స్ మరియు మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల స్థానిక దివ్యాంగుల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Govt Jobs Recruitment AP 2021

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నంద్యాల మరియు కర్నూల్ జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 30 , 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ల్యాబ్ టెక్నీషియన్1
ఫార్మసీస్ట్1
ఎంపీహెచ్ఏ (పురుషులు )2
ఎంపీహెచ్ఏ ( స్త్రీలు )2

అర్హతలు :

10వ తరగతి  మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో రెండు సంవత్సరాల డిప్లొమా అర్హతలు గా కలిగిన అభ్యర్థులు అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డీ. ఫార్మసీ / బీ. ఫార్మసీ కోర్సులు పూర్తి చేసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయినా  అభ్యర్థులు ఫార్మసిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి /ఇంటర్ విద్యా అర్హతలతో పాటు ఏడాది ఎంపీహెచ్ఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎంపీహెచ్ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ చూడవచ్చును.

వయసు :

18 నుండి 52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్ మరియు వెయిటేజ్ ప్రాతిపదికన ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు పైన జీతం లభించనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభా వంతులు , హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ , కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూల్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :

08518-277864

Website 

Notification and Apply Now