26, నవంబర్ 2021, శుక్రవారం

SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా

SBI Pre-approved Personal Loan | ఎస్బీఐలో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేవలం 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్బీఐ.

కరోనా వైరస్ సంక్షోభంతో కష్టకాలంలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అద్భుతమైన లోన్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో కస్టమర్లు లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి, లోన్ దరఖాస్తు చేసి, రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ... టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకులు వీలైనంత తక్కువ సమయంలోనే రుణాలు ఇస్తున్నాయి. ఎస్బీఐ కూడా పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తోంది. అది కూడా తక్కువ వడ్డీకే. కేవలం 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్బీఐ.

గతంలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 16 శాతం మధ్య ఉండేవి. కానీ ఇటీవల వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. గతంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లతో సమానంగా ఇప్పుడు పర్సనల్ వడ్డీ రేట్లు ఉన్నాయి. 10 శాతం లోపే పర్సనల్ లోన్ లభిస్తోంది. అయితే ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్. అంటే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. ముందుగానే రుణాలు మంజూరు చేసి కస్టమర్లకు సమాచారం ఇస్తాయి. వీటినే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు. కస్టమర్లు తమకు అవసరమైతే రుణాలను సులువుగా తీసుకోవచ్చు.

ఎస్బీఐ కస్టమర్లు తమకు ప్రీ అప్రూవ్డ్ లోన్ మంజూరైందా? లేదా? అన్న విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ అకౌంట్ నెంబర్ చివర్లో 7890 అని ఉంది అనుకుంటే మీరు PAPL 7890 అని టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తిస్తుందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది. అందరికీ రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్ రాకపోవచ్చు. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇది మారుతుంది.
 
Image

All it takes is an SMS, to begin with your personal loan process. SMS <PERSONAL> on 7208933145. To know more: bit.ly/37fnHhp
 

ఇదొక్కటే కాదు... 7208933142 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చినా పర్సనల్ లోన్డిపార్ట్మెంట్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. లేదా SMS PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. మరిన్ని వివరాలకు 1800112211 నెంబర్కు కాల్ చేయొచ్చు. లేదా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఎస్బీఐ యోనో యాప్లో కూడా ప్రీఅప్రూవ్డ్ లోన్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. యాప్లో Pre-approved Loan పైన క్లిక్ చేస్తే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత మంజూరైందో తెలుస్తుంది. అక్కడే మరిన్ని వివరాలు ఎంటర్ చేసి క్షణాల్లో రుణాలు పొందొచ్చు.

 Gemini Internet

TTD Ticket Booking: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్న టీటీడీ

TTD Online Ticket Booking: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు కల. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. ప్రతి రోజూ వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఆన్ లైన్ లోనే దర్శనం టికెట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ డిసెంబర్ నెలకు సంబందించిన కోటాని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను కూడా ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

Gemini Internet

25, నవంబర్ 2021, గురువారం

NIA రిక్రూట్‌మెంట్ 2021 జూనియర్ స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, MTS & ఇతర - 18 పోస్టులు www.nia.nic.in చివరి తేదీ 60 & 70 రోజుల్లోపు

Name of Organization Or Company Name :National Institute of Ayurveda

Total No of vacancies: 18 Posts

Job Role Or Post Name:Junior Stenographer, Library Assistant, Lower Division Clerk, MTS & Other –

Educational Qualification:10th, 12th Class, MD (Ayurveda)

Who Can Apply:All India

Last Date:Within 60 & 70 days from the date of advertisement (refer Noification) 

Website: www.nia.nic.in

Click here for Official Notification


HPCL Recruitment 2021: ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త.. HPCLలో రూ. 25 వేతనంతో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను (Graduate Apprentice Trainee Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మార్కెటింగ్ (Marketing) విభాగంలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంకా వారు ఏడాది పాటు తత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. నేషనల్ అప్రంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని అప్రూవల్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టం చేయలేదు. ఈ కింది విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ని పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.
1. సివిల్ ఇంజనీరింగ్ (Civil engineering)
2.మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical engineering)
3.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical engineering)
4.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (Electrical and electronics engineering)
5.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and telecommunication engineering)
6.ఇన్ట్ర్సుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation engineering)
7.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Computer science engineering or information technology)

వయో పరిమితి:  18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, PwD అభ్యర్థులకు పదేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల చొప్పను స్టైఫండ్ చెల్లించనున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన తేదీ: నవంబర్ 22.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే తేదీ: డిసెంబర్ 6.

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదట NATS పోర్టల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి.
Step 2: అనంతరం USER lD/Email lD ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Step 3: లాగిన్ అనంతరం హోమ్ పేజీలో ‘‘ESTABLISHMENT REQUESTS’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తార్వాత ‘‘Find Establishment’’ ను ఎంచుకోవాలి.

Step 4: తర్వాత Establishment Name ఆప్షన్ ను ఎంచుకుని ‘‘Hindustan Petroleum Corporation Limited’’ ను నైప్ చేసి Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: అనంతరం "Hindustan Petroleum Corporation Limited' కనిపిస్తుంది. సెలక్ట్ చేసి ‘‘Apply’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6: అనంతరం మీకు "Successfully applied for the training position" అనే మెసేజ్ కనిపిస్తుంది. దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Gemini Internet

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్. కస్టమర్లకు అనేక లోన్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఎస్‌బీఐ. షాపింగ్ కోసం డబ్బులు కావాలనుకునేవారికి క్షణాల్లో లోన్ ఇచ్చే ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఈఎంఐ ఫెసిలిటీ కోసం ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు. క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఎలాగూ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ లేనివాళ్లు కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటే చాలు. షాపింగ్ చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇలా రూ.8,000 నుంచి రూ.1,00,000 మధ్య ఎంతైనా షాపింగ్ చేయొచ్చు.


ప్రీ-అప్రూవ్డ్ పద్ధతి ద్వారా ఈ లోన్ ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే కస్టమర్లకు ముందుగానే లోన్ అప్రూవ్ చేస్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునే కస్టమర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా బయట వ్యాపారుల దగ్గర షాపింగ్ చేసిన తర్వాత ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ ఆఫర్ పొందొచ్చు. మరి మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీకు ఎంత వరకు లోన్ వస్తుందో తెలుసుకోవడానికి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు.

Gemini Internet

click here for official tweet https://twitter.com/i/status/1458343629680832514

Step 1- ఏదైనా షాపులో మీ షాపింగ్ పూర్తైన తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌లో మీ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.


Step 2- ఆ తర్వాత బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 3- ఆ తర్వాత బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 4- మీరు ఎంత మొత్తం వాడుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.

Step 5- ఆ తర్వాత ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి.

Step 6- 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలల ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Step 7- ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేయాలి.

ఆన్‌లైన్‌లో కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి 14.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతోంది బ్యాంకు. డాక్యుమెంటేషన్ కూడా లేదు. ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరవుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కూడా బ్లాక్ చేయమని చెబుతోంది బ్యాంకు.