Alerts

Loading alerts...

8, నవంబర్ 2023, బుధవారం

CAT 2023: క్యాట్-2023 అడ్మిట్‌ కార్డులు విడుదల * నవంబర్‌ 26న పరీక్ష * జనవరి రెండో వారంలో ఫలితాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

CAT 2023: క్యాట్-2023 అడ్మిట్‌ కార్డులు విడుదల

* నవంబర్‌ 26న పరీక్ష

* జనవరి రెండో వారంలో ఫలితాలు

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) 2023 అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 న‌గ‌రాల్లో నవంబర్‌ 26న పరీక్ష నిర్వహించ‌నున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.

 క్యాట్-2023 అడ్మిట్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. సంపూర్ణ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ జెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

పరీక్ష వివరాలు...

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

సీట్ల కేటాయింపు: ఆరో తరగతి(ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్‌ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

అర్హతలు:

* ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

* తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష విధానం: పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 

ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.

* తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.

* తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.

సీట్ల కేటాయింపు: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.

పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా 186 కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.

దరఖాస్తు విధానం: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 7, 2023 నుంచి డిసెంబర్‌ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

Important Links

Posted Date: 08-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APPSC Jobs: టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగాల భర్తీ కోసం 22న ధ్రువపత్రాల పరిశీలన

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

APPSC Jobs: టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగాల భర్తీ కోసం 22న ధ్రువపత్రాల పరిశీలన

టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ ఓవర్‌సీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రాథమికంగా ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపికచేసింది. నవంబరు 22న విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కార్యదర్శి నవంబరు 7న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే శాంపిల్‌ టేకర్స్‌ ఉద్యోగాల భర్తీ (ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌)లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎంపికచేసిన అభ్యర్థులు నవంబరు 22న ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు ‣ నవంబర్‌ 20 దరఖాస్తుకు గడువు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

నవంబర్‌ 20 దరఖాస్తుకు గడువు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికచేస్తారు. అవసరమైన వారికి మాత్రమే స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ టెస్ట్‌ తేదీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీ, వివరాలను ఎయిమ్స్‌ భోపాల్‌ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.  

ఏయే ఉద్యోగాలు?

హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ) - 106 

ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌ 2 - 41 

మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌ - 38 

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2 - 27

వైర్‌మేన్‌ - 20 

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌ 2 - 18

ప్లంబర్‌ - 15 

ఆర్టిస్ట్‌- 14 

క్యాషియర్‌ - 13

ఆపరేటర్‌/ లిఫ్ట్‌ ఆపరేటర్‌ - 12 

జూనియర్‌ మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌ (రిసెప్షనిస్ట్స్‌) - 05 

మ్యానిఫోల్డ్‌ టెక్నీషియన్‌ (గ్యాస్‌ స్టివార్డ్‌/ గ్యాస్‌ కీపర్‌) - 06 

ఎలక్ట్రీషియన్‌ - 06 

మెకానిక్‌ - 06 

డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2 - 05 

అసిస్టెంట్‌ లాండ్రీ సూపర్‌వైజర్‌ - 04 

డిస్పెన్సింగ్‌ అటెండెంట్స్‌ - 04 

మెకానిక్‌ (ఈ అండ్‌ ఎం) - 04 

లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్‌ 2 - 03 

గ్యాస్‌/పంప్‌ మెకానిక్‌ - 02 

లైన్‌మెన్‌(ఎలక్ట్రికల్‌) - 02 

టైలర్‌ గ్రేడ్‌ 3 - 02 

ల్యాబ్‌ టెక్నీషియన్‌ - 01 

ఫార్మా కెమిస్ట్‌/ కెమికల్‌ ఎగ్జామినర్‌ - 01

కోడింగ్‌ క్లర్క్‌ - 01 

మ్యానిఫోల్డ్‌ రూమ్‌ అటెండెంట్‌ - 01

మొత్తం పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 177, ఓబీసీలకు 89, ఎస్సీలకు 42, ఎస్టీలకు 20, ఈడబ్ల్యూఎస్‌లకు 29 కేటాయించారు. 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 

అర్హతలు 

హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ): మెట్రిక్యులేషన్‌ పాసై హాస్పిటల్‌ సర్వీసెస్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 

ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2: సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవడంతోపాటు.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్‌లో రెండేళ్లు పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌: బీఎస్సీ (మెడికల్‌ రికార్డ్స్‌) పాసై కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఆఫీస్‌ అప్లికేషన్స్, స్ప్రెడ్‌షీట్స్, ప్రజెంటేషన్స్‌లో అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి. లేదా సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసై, మెడికల్‌ రికార్డ్‌ కీపింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌ చేయాలి. రెండేళ్లు హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: ఫార్మసీ డిప్లొమా చేసి, రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌ అయివుండాలి. ఫ్లూయిడ్‌ తయారీ/ స్టోరేజ్‌/ టెస్టింగ్‌లో హాస్పిటల్‌ లేదా పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2: ఇంటర్మీడియట్, ఏడాది వ్యవధిగల హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు పాసవ్వాలి. 200 పడకల హాస్పిటల్‌లో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

గరిష్ఠ వయసులో.. ఓబీసీ - ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌

మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో పార్ట్‌-ఎ 25 మార్కులకు, పార్ట్‌-బి 75 మార్కులకు ఉంటాయి. రెండు పార్టుల్లోనూ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే ఉంటాయి. ఉద్యోగాన్ని అనుసరించి సిలబస్‌ వేర్వేరుగా ఉంటుంది. పోస్టులవారీగా సిలబస్‌ వివరాలు వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. టెస్ట్‌ సెంటర్లను అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేస్తారు. సీబీటీకి ముందు దీన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, పోస్టులో పంపరు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరీవారిగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు. 

గమనించాల్సినవి..

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టుల ప్రాధమ్యాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. ప్రతిపోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి. 

పరీక్ష తేదీ, ఇతర సమాచారాన్ని అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2023

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

-----------------------------------------------------------------------------------------------------------

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

RBI Assistant: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్‌ కాల్‌లెటర్లు * మొత్తం 450 ఖాళీల భర్తీ * నవంబర్‌ 18, 19 తేదీల్లో పరీక్ష

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

RBI Assistant: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్‌ కాల్‌లెటర్లు

* మొత్తం 450 ఖాళీల భర్తీ

* నవంబర్‌ 18, 19 తేదీల్లో పరీక్ష

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్ష కాల్‌లెటర్లు (Call Letter) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ సాయంతో కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షను (Prelimis) నవంబర్‌ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను (Mainis) డిసెంబర్‌ 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు.. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

SSC Exams: ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల * ఏప్రిల్‌ 2న సీహెచ్‌ఎస్‌ఎల్‌, జూన్‌ 11న సీజీఎల్‌ నోటిఫికేషన్లు విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

SSC Exams: ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల

* ఏప్రిల్‌ 2న సీహెచ్‌ఎస్‌ఎల్‌, జూన్‌ 11న సీజీఎల్‌ నోటిఫికేషన్లు విడుదల
 
దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది (2024-25)లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్‌ 2024 వివరాలు

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

తాజా ఇంటర్న్‌షిప్‌లు Jobs ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు ఒకవేళ కట్టమని ఎవరైనా అడిగితే కట్టకండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌ నైపుణ్యాలు

Published : 08 Nov 2023 00:52 IST

హైదరాబాద్‌లో

స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌

1. క్వాలిటీ అనలిటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: నవంబరు 15

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌ నైపుణ్యాలు

 internshala.com/i/427a28

2. లీడ్‌ జనరేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 16

అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, లీడ్‌ జనరేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/e79a57

టెలికాలింగ్‌

సంస్థ: డెరైడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 13

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/4fca4f

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కొడెఫ్ట్‌ డిజిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 13

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/91a67f

ఆపరేషన్స్‌

సంస్థ: టెర్రాబ్లూ ఎక్స్‌టీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 15

అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం

internshala.com/i/cc79d8

మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: కనెక్షన్స్‌ ఐమేగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 14

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/0f14b9

మార్కెటింగ్‌

సంస్థ: రిజల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 14

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

internshala.com/i/46a5d7

విజయవాడ, గుంటుపల్లిలలో

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎకంప్‌సిస్‌ ఇండియా

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 15

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జెక్వెరీ, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

inte-rn-shala.-com/-i/-09-c8df-

గుంటూరు, గువాహటి, వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడలలో

అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌కీపింగ్‌

సంస్థ: నిధి ఎస్‌ జైన్‌ అండ్‌ కంపెనీ

స్టైపెండ్‌: నెలకు రూ.7,500

దరఖాస్తు గడువు: నవంబరు 15

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

inte-rn-shala.-com/-i/-38fd-cd

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...