APPSC Jobs: టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల భర్తీ కోసం 22న ధ్రువపత్రాల పరిశీలన
టౌన్ ప్లానింగ్ అండ్ ఓవర్‌సీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రాథమికంగా ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపికచేసింది. నవంబరు 22న విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కార్యదర్శి నవంబరు 7న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే శాంపిల్ టేకర్స్ ఉద్యోగాల భర్తీ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎంపికచేసిన అభ్యర్థులు నవంబరు 22న ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి