RBI Assistant: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కాల్‌లెటర్లు
* మొత్తం 450 ఖాళీల భర్తీ
* నవంబర్ 18, 19 తేదీల్లో పరీక్ష
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్ష కాల్‌లెటర్లు (Call Letter) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షను (Prelimis) నవంబర్ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను (Mainis) డిసెంబర్ 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు.. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి