11, నవంబర్ 2023, శనివారం

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం | రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ | Driving License డీఎల్, Vehicle R C ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం | డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం 

షరతులు వర్తిస్తాయి
రెవెన్యూ శాఖ ఉత్తర్వుల జారీ

రాష్ట్రంలోని అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు కొన్ని షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని, మిగిలిన 40% జర్నలిస్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుతం అక్రెడిటేషన్‌ కలిగి ఉండి... మీడియాలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న/ నివాసం ఉంటున్న జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

షరతులు:

* స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది. 

* ఇల్లు కట్టుకుని ‘ఫిజికల్‌ పొజిషన్‌’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు.

దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్‌ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట) ఉండకూడదు.

గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు.

కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలలో పని చేస్తున్నా అనర్హులవుతారు.

సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

*అర్హులైన అక్రెడిటెడ్‌ జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.

రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ

ఆరోగ్య విశ్వవిద్యాలయం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 225 నర్సింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 4135 బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లకు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నిర్వహించిన కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ 3109 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1026 సీట్లు ఖాళీగా ఉన్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

All Qualified Candidates in APEAPCET- 2023 are Eligible for B.Sc(Nursing) Course. 

Provisional Allotment Order - Phase - II by clicking the below.

https://ugnursing.ysruhs.com/ugnu_allotment/index.php 

డీఎల్, ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం

అనంతపురం అర్బన్, నవంబరు 10: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించామని జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి వీర్రా జు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలో 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, 55 వేల ఆర్సీ కార్డులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పక్షం రోజులుగా ప్రింటింగ్ జరుగుతోందని, ఇప్పటిదాకా 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింట్ చేశామని తెలిపారు. మరో పదిరోజుల్లో పోస్టల్ ద్వారా వాహనదారుల ఇంటికే కార్డులను పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఆర్సీ కార్డుల ప్రింటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా కార్డులను వాహనదారుల ఇంటికి పంపుతామని పేర్కొన్నారు. 
డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన కల్పించండి

అనంతపురం విద్య, నవంబరు 10: డిజిటల్ లాకర్ సిస్టంను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని డీఈఓ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు, విశ్వవిద్యాలయాలు. విద్యాసంస్థలకు ఈ డీజీ లాకర్ను అమలు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. డీజీలాకర్లో 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జననధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, ఈబీసీ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు తదితర సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చునన్నారు. వీటిని ఎక్కడైనా పేపర్ లెన్గా డిజిటల్ రూపంలో వినియోగించుకోవచ్చునన్నారు. డీజీ లాకటర్ ఓపెన్ చేయడానికి ఎలాంటి రుసుం అవసరమూ లేదన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను చైతన్యపరిచి పిల్లల పేరుతో ఈ డీజీ లాకర్ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీజీ లాకర్ అనే యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. మరిన్ని వివరాలకు http://etgovernment.com/s/arzx6qr

సంప్రదించాలని సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Central Jobs: రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ * పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం * ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

గతేడాది 50,187 ఖాళీల భర్తీ

గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. 

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

10, నవంబర్ 2023, శుక్రవారం

*విద్య సమాచారం* *AISSEE 2024 నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం, పరీక్ష తేదీ, అర్హత

AISSEE 2024 నోటిఫికేషన్ 8 నవంబర్ 2023న విడుదల చేయబడింది 
AISSEE 2024 దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీ 16 డిసెంబర్ 2023లోపు పూరించండి
, ఆపై. 21 జనవరి 2024న జరిగే పరీక్ష కోసం సిద్ధం కండి.

 భారతదేశంలోని వివిధ సైనిక్ పాఠశాలల్లో అర్హత కలిగిన విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు NTA అధికారులు ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)ని నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ సైనిక్ పాఠశాలల్లో 6వ తరగతి మరియు 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను పొందడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు AISSEE ద్వారా ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడు, AISSEE 2024 నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివ్‌గా ఉంది.

AISSEE 2024 రిజిస్ట్రేషన్ ఫారమ్ 6వ తరగతి & 9వ తరగతి
AISSEE 2024 అర్హత 6వ తరగతి మరియు 9వ తరగతి గురించి తెలుసుకోవడానికి దిగువ పాయింట్‌లను తనిఖీ చేయండి .
6వ తరగతి అడ్మిషన్ కోసం, దరఖాస్తుదారులు భారతదేశంలో గుర్తింపు పొందిన పాఠశాల నుండి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
6వ తరగతిలో ప్రవేశానికి వయోపరిమితి 31 మార్చి 2024 నాటికి 10-12 సంవత్సరాలు.
9వ తరగతి అడ్మిషన్ కోసం, విద్యార్థులు అడ్మిషన్ సమయంలో 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అంతేకాకుండా, 9వ తరగతి ప్రవేశానికి వయో పరిమితి 31 మార్చి 2024 నాటికి 13-15 సంవత్సరాలు.

సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఫారం 2024
అర్హత ఉన్న విద్యార్థులు సెలక్షన్ టెస్ట్‌లో హాజరు కావడానికి సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఫారం 2024 నింపాలి .
AISSEE 2024 పరీక్ష కోసం దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 16 డిసెంబర్ 2024 .

 21 జనవరి 2024న షెడ్యూల్ చేయబడిన వ్రాత పరీక్ష జరుగుతుంది...

AISSEE 2024 నమోదు : అవసరమైన పత్రాలు

ఆసక్తి గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌లో AISSEE 2024 రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి . మీరు నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన పత్రాల జాబితాను తనిఖీ చేసి, ఆపై వాటిని సేకరించినట్లు నిర్ధారించుకోండి. ప్రతి పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి మీరు తప్పనిసరిగా సాఫ్ట్ కాపీ మరియు హార్డ్ కాపీని కలిగి ఉండాలి.

1విద్యార్థి ఉత్తీర్ణత సర్టిఫికేట్2.ఆధార్ కార్డ్.3 నివాసం ధృవీకరణ .4.జనన ధృవీకరణ పత్రం.5.సంతకం.6.ఫోటోగ్రాఫ్.7.మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్గదర్శి AISSEE 2024 @ aissee.nta.nic.in
ఆన్‌లైన్‌లో AISSEE 2024 @ aissee.nta.nic.in దరఖాస్తు చేసుకోవడానికి దిగువ సూచనలను అనుసరించండి .
ముందుగా, AISSEE @ aissee.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.
రెండవది, మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి కొనసాగండి.
మొబైల్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి మరియు పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
పేరు, తల్లి పేరు, తండ్రి పేరు మరియు ఇతర ప్రాథమిక వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
సంతకం, ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.దరఖాస్తు రుసుము చెల్లించండి .
AISSEE దరఖాస్తు రుసుము 2024

జనరల్ రూ. 650/-
డిఫెన్స్ పర్సనల్ వార్డులు రూ. 650/-
OBC రూ. 650/-
ఎస్సీ రూ. 500/-
ST రూ. 500/-
Aissee.nta.nic.in దరఖాస్తు ఫారమ్ 2024 లింక్
AISSEE 2024 నోటిఫికేషన్ లింక్‌ని తనిఖీ చేయండి

TCS Hiring Engineers Tata Consultancy Services Limited invites application for the following posts

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

Job Role: AI Cloud Drive

Qualification: BE/ B.Tech/ MCA/ M.Sc/ MS.

Experience: 2 - 10 years

Location: Bangalore

Job Role: AEM Technical Lead

Qualification: B.Tech

Experience: 8 - 12 years

Location: Hyderabad

Job Role: Service Now Architect

Qualification: BE

Experience: 5 - 7 years

Location: Bangalore

Job Role: Firewall SME

Qualification: BE

Experience: 3 - 8 years

Location: Bangalore

For more details, please visit: ibegin.tcs.com/iBegin/jobs/search

Conclusion: Sakshi Education wishes you the best of luck. Keep up with our Sakshi Education website for the Latest Job Updates, Results, Education News, Online Test and many more. Thank You. If you like it, please share it with your friends.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నిరుద్యోగ యువతకు శుభవార్త!! హిందూపురం, సేవామందిర్ సంస్థ ప్రాంగణం లో ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ కోర్స్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రారంభం అవుతున్నది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

నిరుద్యోగ యువతకు శుభవార్త!! హిందూపురం, సేవామందిర్ సంస్థ ప్రాంగణం లో ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ కోర్స్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రారంభం అవుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది మరియు జాబ్ / స్వయంఉపాధికి  అవసరమైన పెట్టుబడికి సహకారం ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన యువత సంప్రదించండి. 7989110294,7794050137రిజిస్టర్ చేసుకోవడానికి ఆఖరి తేది :13-11-2023.అర్హత :16 సంవత్సరాలు పైబడిన అబ్బాయిలు . చదువుతో పని  లేదు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్) లు తమ ఆన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ (లైఫ్ సర్టిఫికేట్) లను జనవరి 1 నుండి ఆన్లైన్ లో సమర్పించాలని ఉత్తర్వులు జారీ

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

1.1.2024 నుండి 29.2.2024 మెమో 14060 వరకు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్లు 2024

సర్. మెమో.నం. FIN02-14060/14/2020-DSEC-DTA(1131573) తేదీ.07/11/2023

1.1.2024 నుండి 29.2.2024 మెమో 14060 వరకు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్లు 2024

సబ్ : PS -T&A డిపార్ట్‌మెంట్.,-పెన్షన్‌లు–పెన్షనర్ల నుండి వార్షిక ధృవీకరణ ((ife) సర్టిఫికెట్‌లను పొందడం– జారీ చేసిన సూచనలు - ఉదా.

రిఫరెన్స్: సర్క్యులర్ మెమో No.FIN01-34021/125/2018-SO(He.3-Pen- I)Finanie(He.III -Pensions.I)Dept., Date.20.12.2018.

రాష్ట్రంలోని అన్ని DT & AOలు మరియు ATO, CeT, O/o DTA, AP, మంగళగిరి యొక్క దృష్టిని ఉదహరించిన విషయం మరియు సూచన (కాపీ జతచేయబడింది) వైపు ఆకర్షించబడింది. పెన్షనర్ల నుండి వార్షిక ధృవీకరణ ((ife) సర్టిఫికేట్‌లను ఉదహరించిన సూచనలో జారీ చేయబడిన సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో పొందాలని వారికి బాగా తెలుసు.

అందువల్ల వారు 01.01.2024 నుండి 29.02.2024 వరకు మాత్రమే అన్ని పింఛనుదారుల నుండి వార్షిక ధృవీకరణ ((ife) సర్టిఫికేట్‌లను పొందవలసిందిగా అభ్యర్థించబడ్డారు. ఉదహరించిన సూచనలో జారీ చేయబడిన మిగిలిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024 పరీక్ష వివరాలు...సీట్ల కేటాయింపు...అర్హతలు...ఎంపిక ప్రక్రియ...పరీక్ష విధానం...పరీక్ష కేంద్రాలు...దరఖాస్తు విధానం...

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. సంపూర్ణ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

పరీక్ష వివరాలు...

* అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

సీట్ల కేటాయింపు: ఆరో తరగతి(ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్‌ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

అర్హతలు:

* ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

* తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష విధానం: పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 

* ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.

* తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.

* తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.

సీట్ల కేటాయింపు: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.

పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా 186 కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.

దరఖాస్తు విధానం: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 7, 2023 నుంచి డిసెంబర్‌ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

Important Links

Posted Date: 10-11-2023