స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపట్టే బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్కీ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు నవంబరు 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233, 7337585959, 9000797789ని సంప్రదించవచ్చు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
14, నవంబర్ 2023, మంగళవారం
Job Notifiction: 10 రోజుల్లో 80 వేల ఖాళీలకు నోటిఫికేషన్ * ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, భోజనం, స్టడీ మెటీరియల్ * డిసెంబరు 2న శిక్షణ ప్రారంభం
11.5 కోట్ల పాన్ కార్డ్స్ రద్దు – అందులో మీ పాన్ కార్డ్ ఉందా.... చెక్ చేసుకోండి...
పాన్-ఆధార్ లింక్ లేటెస్ట్ అప్డేట్: పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. లేదంటే డీయాక్టివేట్ చేయక తప్పదని హెచ్చరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లింక్ చేయడానికి గడువు ఇచ్చింది. ఇది కూడా చాలా సార్లు పొడిగించబడింది. చివరి గడువు ముగియడంతో, CBDT ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డ్‌లను డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి.
11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసిన CBDT : దేశవ్యాప్తంగా 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లు ఉండగా, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెల్లడించింది. దాదాపు 12 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఆధార్‌తో లింక్ చేయలేదని, వారిలో 11.5 కోట్ల మంది కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై సీబీడీటీ స్పందించింది. 2017 జూలై 1కి ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం కేంద్రం పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తోంది. ఆధార్-పాన్ అనుసంధానానికి మార్చి 30 వరకు గడువు ఇచ్చినప్పటికీ జూన్ 30 వరకు చివరి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
గడువు తప్పిన వారికి మరో అవకాశం… కార్డులు డీయాక్టివేట్ అయిన వారి కార్డులను రెన్యూవల్ చేసుకునేందుకు సీబీడీటీ మరో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30, 2023 గడువును ఎవరు మిస్ చేసుకున్నారో వారు పెనాల్టీని చెల్లించడం ద్వారా తమ పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే.. కార్డు యాక్టివేట్ కావడానికి 30 రోజులు పడుతుంది. పాన్ కార్డ్ నిరుపయోగంగా మారడంతో లావాదేవీలకు ఉపయోగించలేరు. దీనికి ముందు మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? కనిపెట్టండి. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
How to check PAN card status?
మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి, ముందుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
ఆ తర్వాత అక్కడ ‘వెరిఫై యువర్ పాన్‘ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత ‘కొనసాగించు‘పై క్లిక్ చేయండి.
అంతే మీ పాన్ కార్డ్ స్టేటస్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
ఎయిర్పోర్ట్ అథారిటీలో..496 జేఈ కొలువులు!
ఎయిర్పోర్ట్ అథారిటీలో..496 జేఈ కొలువులు!
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు
వార్షిక వేతనం రూ.13 లక్షలు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చినవారు ఏడాదికి రూ.13 లక్షల వేతనం అందుకోవచ్చు. పదోన్నతులతో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.
ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి. ఎయిర్ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
ముందుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్టు, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్టు, మెడికల్ టెస్టు, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి. శిక్షణలో ఉన్నప్పుడు ఐసీఏవో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లెవెల్ 4 (ఆపరేషనల్)లో ఉత్తీర్ణత సాధించాలి.
పరీక్ష ఇలా
ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఏలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ 15, జనరల్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ 15, జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ నుంచి కాన్సెప్ట్, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ, బీ ఒక్కో దానికీ 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. రుణాత్మక మార్కులు లేవు.
సన్నద్ధత
- పార్ట్ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్, ఫిజిక్స్ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి.
- పార్ట్ ఏలో ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. బ్యాంక్ క్లర్క్ పరీక్ష స్థాయిలో వీటిని అడుగుతారు.
- ఐబీపీఎస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్ అభ్యర్థులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను సులువుగానే
- ఎదుర్కోవచ్చు.
- ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
- గతంలో నిర్వహించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏటీసీ ప్రశ్నపత్రాలు పలు వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. పరీక్ష, ప్రశ్నల తీరు, సన్నద్ధతపై అవగాహన వస్తుంది.
- జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ విభాగంలో వర్తమానాంశాలతోపాటు విమానయానం, ఎయిర్ పోర్టులకు సంబంధించిన ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
- సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షలోపు కనీసం పది మాక్ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు తగ్గించుకోగలిగితే విజయానికి అవకాశం ఉంటుంది.
- రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలను సైతం ఆలోచించి, ఏదో ఒక జవాబు గుర్తించుకోవచ్చు.
ముఖ్య వివరాలు
ఖాళీలు: 496. వీటిలో విభాగాల వారీ అన్ రిజర్వ్డ్ 199, ఓబీసీ
ఎన్సీఎల్ 140, ఈడబ్ల్యుఎస్ 49, ఎస్సీ 75, ఎస్టీ 33 ఉన్నాయి. వీటిలోనే
దివ్యాంగులకు 5 కేటాయించారు.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్ (ఏదైనా
సెమిస్టర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి) కనీసం 60 శాతం
మార్కులు ఉండాలి. ఆంగ్ల భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు అవసరం.
వయసు: నవంబరు 30, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు,
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు
చెల్లించనవసరం లేదు. ఏఏఐలో ఏడాది అప్రెంటీస్ పూర్తిచేసినవారికీ ఫీజు
మినహాయించారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్సైట్: https://www.aai.aero/en/careers/recruitment
సైనిక్ స్కూళ్ల మార్గం రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.
రక్షణ కొలువుకు దారి
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవచ్చు.
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.
దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పరీక్ష తప్పనిసరి. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. అలాగే కొత్తగా ప్రారంభమైన 19 సంస్థల్లో ఆరో తరగతిలోనే విద్యార్థులను చేర్చుకుంటారు. వీటికి సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలు జారీ చేస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రతి పాఠశాల కనీసం 40 శాతం సీట్లను ఆల్ ఇండియా మెరిట్ లిస్టు ప్రకారం భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం... ఇలా పలు విభాగాల్లో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఫీజు ఒకేలా ఉండదు.
ప్రయోజనాలెన్నో
పరీక్ష ఇలా
తొమ్మిదో తరగతికి: 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి సిలబస్ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది.
రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
సీట్లు.. ఫీజు
మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరో తరగతిలో 78, తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్ స్కూల్లో ఆరో తరగతిలో 105, తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు మినహాయించడం చేస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన ఆదానీ వరల్డ్ స్కూల్ నెల్లూరులో ఆరో తరగతిలోకి 80 సీట్లు కేటాయించారు.
ఏయే అర్హతలు?
ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2024 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2012 - మార్చి 31, 2014 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2009 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారు అర్హులు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.
పరీక్ష తేదీ: జనవరి 21
పరీక్ష కేంద్రాలు: ఏపీలో..అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్.
వెబ్సైట్: https://exams.nta.ac.in/AISSEE/
తాజా ఇంటర్న్‌షిప్‌లు Internship Jobs Do not pay money for these jobs
ప్రదేశం: గుంటూరు, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ
స్టైపెండ్: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
విజయవాడలో
ఆపరేషన్స్
సంస్థ: ఐకుశల్ స్పేసెస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: ఆపరేషన్స్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: డిజిటల్ వెర్టొ
స్టైపెండ్: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్, ఎస్ఈఎం, ఎస్ఈఓ నైపుణ్యాలు
ఫీల్డ్ సేల్స్
సంస్థ: వల్లూరి నాగవెంకటసాయి అవినాష్ చౌదరి
స్టైపెండ్: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: నవంబరు 20
అర్హతలు: ఫీల్డ్ సేల్స్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
గుంటుపల్లి, విజయవాడల్లో
వెబ్ డెవలప్మెంట్
సంస్థ: ఈకంప్సిస్ ఇండియా
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: బూట్‌స్ట్రాప్, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, జేెక్వెరీ, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్ నైపుణ్యాలు
విశాఖపట్నంలో
వెబ్ డెవలప్మెంట్
సంస్థ: డిజిటల్ వర్డ్ ఆఫ్ మౌత్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: బూట్‌స్ట్రాప్, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్, వర్డ్‌ప్రెస్ నైపుణ్యాలు
వర్క్ ఫ్రమ్ హోమ్
ఆపరేషన్స్
సంస్థ: సొల్యూషన్ గ్రాఫ్
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 22
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్
ప్రభుత్వ ఉద్యోగాలు Govt Jobs
నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో..
మేఘాలయలోని నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ (ఎన్ఈహెచ్యూ) 154 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- సెక్షన్ ఆఫీసర్- 07
- అసిస్టెంట్- 06
- ప్రొఫెషనల్ అసిస్టెంట్- 06
- ప్రైవేట్ సెక్రటరీ- 07
- లోయర్ డివిజన్ క్లర్క్- 02
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 01
- స్టాటిస్టికల్ అసిస్టెంట్- 05
- స్టెనోగ్రాఫర్- 6
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 26
- జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్- 1
- లైబ్రరీ అటెండెంట్- 11
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 12.12.2023.
వెబ్సైట్: https://nehu.ac.in/
హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ రీజనల్ సంస్థలో..
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 85 గ్రూప్ ‘బి’, ‘సి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ డైటీషియన్, రేడియోగ్రాఫర్, మెడికల్ సోషల్ వర్కర్, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజినీర్ (సివిల్), ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, వార్డెన్/ లేడీ వార్డెన్, టెక్నీషియన్ (ఎండోస్కోపీ/ కొలనోస్కోపీ), లోయర్ డివిజన్ క్లర్క్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత/ ఆన్లైన్ పరీక్ష తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2023.
వెబ్సైట్: https://nehu.ac.in/https://nehu.ac.in/
ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ పోస్టులు
పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పార్వతీపురం మన్యం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
1. ప్రొటెక్షన్ ఆఫీసర్
2. లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి
3. కౌన్సెలర్
4. సోషల్ వర్కర్
5. అకౌంటెంట్
6. డేటా అనలిస్ట్
7. ఔట్రీచ్ వర్కర్స్
8. మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ)
9. నర్సు (మహిళ)
10. సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ)
11. డాక్టర్ (పార్ట్ టైమ్) 11. ఆయా (మహిళ)
12. చౌకీదార్ (మహిళ)
13. అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్)
14. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్
15. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్
16. ఎడ్యుకేటర్
17. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్
18. కుక్
19. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్
20. హౌస్ కీపర్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2023.
వెబ్సైట్: https://parvathipurammanyam.ap.gov.in/
కృష్ణా జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర
మచిలీపట్నంలోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో 8 సాగర మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హతలు: బీఎఫ్ఎస్సీ లేదా బీఎస్సీ (ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ).
వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, మచిలీపట్నం, కృష్ణా జిలా’్ల చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.
వెబ్సైట్: https://krishna.ap.gov.in/
మహిళ, శిశు సంక్షేమంలో..
ఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
2. ప్రొటెక్షన్ ఆఫీసర్
3. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్
4. సోషల్ వర్కర్ (మేల్)
5. డేటా అనలిస్ట్
6. అవుట్‌రీచ్ వర్కర్ (మహిళ)
7. నర్సు
8. డాక్టర్ (పార్ట్ టైమ్)
9. చౌకీదార్ (మహిళ)
10. డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.
వెబ్సైట్: https://prakasam.ap.gov.in/
రాజమహేంద్రవరంలో అకౌంటెంట్లు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్సీఎస్సీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2 అకౌంటెంట్ గ్రేడ్-3 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విద్యార్హత: ఎంకాంతో పాటు కంప్యూటర్ స్కిల్స్.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్, కలెక్టరేట్ కాంపౌండ్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-11-2023.
వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in/
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...