14, నవంబర్ 2023, మంగళవారం

11.5 కోట్ల పాన్ కార్డ్స్ రద్దు – అందులో మీ పాన్ కార్డ్ ఉందా.... చెక్ చేసుకోండి...

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

పాన్-ఆధార్ లింక్ లేటెస్ట్ అప్‌డేట్: పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. లేదంటే డీయాక్టివేట్‌ చేయక తప్పదని హెచ్చరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లింక్ చేయడానికి గడువు ఇచ్చింది. ఇది కూడా చాలా సార్లు పొడిగించబడింది. చివరి గడువు ముగియడంతో, CBDT ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డ్‌లను డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి.

11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసిన CBDT : దేశవ్యాప్తంగా 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లు ఉండగా, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెల్లడించింది. దాదాపు 12 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఆధార్‌తో లింక్ చేయలేదని, వారిలో 11.5 కోట్ల మంది కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై సీబీడీటీ స్పందించింది. 2017 జూలై 1కి ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం కేంద్రం పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తోంది. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి మార్చి 30 వరకు గడువు ఇచ్చినప్పటికీ జూన్‌ 30 వరకు చివరి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

గడువు తప్పిన వారికి మరో అవకాశం… కార్డులు డీయాక్టివేట్ అయిన వారి కార్డులను రెన్యూవల్ చేసుకునేందుకు సీబీడీటీ మరో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30, 2023 గడువును ఎవరు మిస్ చేసుకున్నారో వారు పెనాల్టీని చెల్లించడం ద్వారా తమ పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే.. కార్డు యాక్టివేట్ కావడానికి 30 రోజులు పడుతుంది. పాన్ కార్డ్ నిరుపయోగంగా మారడంతో లావాదేవీలకు ఉపయోగించలేరు. దీనికి ముందు మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? కనిపెట్టండి. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

How  to check PAN card status?

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి, ముందుగా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఆ తర్వాత అక్కడ ‘వెరిఫై యువర్ పాన్‘ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి.

ఆ తర్వాత ‘కొనసాగించు‘పై క్లిక్ చేయండి.

అంతే మీ పాన్ కార్డ్ స్టేటస్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: