అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
17, నవంబర్ 2023, శుక్రవారం
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్త విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు), క్యాజువల్ న్యూస్ రీడ ర్ కం ట్రాన్స్‌లేటర్ (తెలుగు), క్యాజువల్ బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ నియామకాల భర్తీ కోసం దరఖాస్తులు
LAWCET లా కోర్సుల్లో అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది.
16, నవంబర్ 2023, గురువారం
ISRO: విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్‌లో 18 డ్రైవర్ ఖాళీలు 1. లైట్ వెహికల్ డ్రైవర్-ఎ: 09 పోస్టులు 2. హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 09 పోస్టులు
ISRO: విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్‌లో 18 డ్రైవర్ ఖాళీలు
తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.
మొత్తం ఖాళీలు: 18
1. లైట్ వెహికల్ డ్రైవర్-ఎ: 09 పోస్టులు
2. హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 09 పోస్టులు
అర్హత: పదో తరగతితో పాటు ఎల్‌వీడీ/ హెవీ డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,800.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27-11-2023
SBI Clerk Recruitment: 8,773 క్లర్క్ ఖాళీలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్ * ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం * ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక
SBI Clerk Recruitment: 8,773 క్లర్క్ ఖాళీలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్
* ఏదైనా డిగ్రీతో దరఖాస్తుకు అవకాశం
* ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి క్లర్క్ (జూనియర్ అసోసియేట్) జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. 8773 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
SBI Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త; ఎస్బీఐ లో 8 వేలకు పైగా పోస్ట్ ల భర్తీ; డిగ్రీ ఉంటే చాలు..
ఆన్ లైన్ అప్లికేషన్..
ఎస్బీఐ (SBI) లో 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 7. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో ఈ 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లను ఎస్బీఐ భర్తీ చేస్తోంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 17, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023
- ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024
- ప్రధాన పరీక్ష: ఫిబ్రవరి 2024
Eligibility: అర్హత, ఇతర వివరాలు..
ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి, ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత అయినా కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులే. వారు డిసెంబర్ 31, 2023 నాటికి ఐడీడీ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
Selection: ఎంపిక ప్రక్రియ
ఈ పోస్ట్ ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష ఉంటుంది.ఈ పరీక్ష 2024, జనవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను ఆన్ లైన్ లో రాయాల్సి ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Application Fees: అప్లికేషన్ ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల్లో జనరల్, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు రూ. 750 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ను ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు
సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా… దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్
కేటగిరీల కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 01
2. రిస్క్ మేనేజ్‌మెంట్/ ఏజీఎం- 01
3. రిస్క్ మేనేజ్‌మెంట్/ సీఎం- 01
4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్‌ఎం- 06
5. ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్‌ఎం- 05
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్- 73
7. లా ఆఫీసర్- 15
8. క్రెడిట్ ఆఫీసర్- 50
9. ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్- 04
10. సీఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జీఎస్‌టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్- 03
11. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏఎం- 15
12. సెక్యూరిటీ ఆఫీసర్- 15
13. రిస్క్ మేనేజర్- 02
14. లైబ్రేరియన్- 01
మొత్తం ఖాళీల సంఖ్య: 192.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్‌టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్‌టీ).
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 19-11-2023
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 3, 4వ వారం - 2023.
TCS NQT 2023: ప్రైవేటు కంపెనీల్లో 1.6లక్షల కొలువులు * టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తులు * నవంబర్ 27 వరకు దరఖాస్తుకు అవకాశం
TCS NQT 2023: ప్రైవేటు కంపెనీల్లో 1.6లక్షల కొలువులు
* టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తులు
* నవంబర్ 27 వరకు దరఖాస్తుకు అవకాశం
\ |
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ తదితర ఐటీ, ఐటీయేతర కార్పొరేట్ సంస్థల్లో 1.6 లక్షలకు పైగా కొలువులను దక్కించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.19లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందొచ్చు.
పరీక్ష వివరాలు...
* నేషనల్ క్వాలిఫయర్ టెస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మంచి స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే.. కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
* డిసెంబర్‌లో జరగనున్న పరీక్షకు నవంబర్ 27లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పరీక్ష డిసెంబర్ 9న నిర్వహిస్తారు.
* 2018 నుంచి 2024 వరకు విద్యా సంవత్సరాల్లో బీటెక్ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
* అభ్యర్థుల వయసు 17 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* టీసీఎస్ ఎన్‌క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
GDS Result: ఏపీ జీడీఎస్ జులై 2023 ఎంపిక ఫలితాలు * ధ్రువపత్రాల పరిశీలనకు గడువు నవంబర్ 25
GDS Result: ఏపీ జీడీఎస్ జులై 2023 ఎంపిక ఫలితాలు
* ధ్రువపత్రాల పరిశీలనకు గడువు నవంబర్ 25
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన(షెడ్యూల్-2, జులై 2023) విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల నాలుగో జాబితాను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1058 పోస్టులు ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 25లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తపాలా శాఖ సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుతుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...