ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్త విభాగంలో
క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు), క్యాజువల్ న్యూస్ రీడ ర్ కం
ట్రాన్స్‌లేటర్ (తెలుగు), క్యాజువల్ బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ నియామకాల
భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆకాశవాణి విజయవాడ హెడ్ ఆఫ్
న్యూస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంపాటి సాయి గురువారం ఒక ప్రకటనలో
తెలిపారు. నగర ప్రాంతంలో నివసిస్తూ ఆసక్తి గల అ భ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానించారు. క్యాజువల్ విధానంలో ని యమించబడిన వారికి నెలలో గరిష్టంగా 6
రోజుల పని దినాలు మించకుండా విధులు కేటాయింపు ఉంటుంది. దరఖాస్తు
చేసుకునేవారికి 20 23 నవంబరు 28 నాటికి 21 నుంచి 50ఏళ్లలోపు వయస్సు
ఉండాలన్నా రు. జనరల్ అభ్యర్థులు రూ.354, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు
రూ.266 దరఖాస్తు రుసుంతో పాటుగా ప్రసార్ భారతి, ఆకాశవాణి, విజయవాడ పేరుతో
బ్యాంక్ డ్రాప్ట్‌ను జతచేయాలన్నారు. మరింత సమాచారం కోసం 9440674057 నెంబరు
సోమవారం నుంచి శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
సంప్రదించవచ్చునన్నారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి