Alerts

Loading alerts...

25, నవంబర్ 2023, శనివారం

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం వెనుక భారత మహిళ పాత్ర | Indian woman's role behind Australia's victory in the World Cup

కంగారూల విజయం వెనక భారత మహిళ పాత్ర

ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ ప్రపంచ కప్‌ గెలుపులో మంగుళూరు మహిళ ఊర్మిళ రోజారియో కీలక పాత్ర పోషించిందనే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించిన ఊర్మిళ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు.

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్రపంచ కప్‌ను పట్టుకుని ఉన్న ఊర్మిళ ఫొటో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ భారతీయ మహిళకూ క్రికెట్‌కూ మధ్య ఉన్న సంబంధం వెలుగులోకొచ్చింది. బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఊర్మిళ బాస్కెట్‌ బాల్‌, రోవింగ్‌, టెన్నిస్‌, బంజీ జంపింగ్‌ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. వీటన్నిట్లో టెన్నిస్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఊర్మిళ ఆ క్రీడలో రాణించాలనుకుంది. ఆ క్రీడనే తన వృత్తిగా మలుచుకోవాలని కలలు కన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం కారణంగా టెన్నిస్‌ ఆటకు దూరమైంది. అయినప్పటికీ క్రీడలకు ఆమె దూరం కాలేదు. ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొనకపోయినా, పరోక్షంగా ఆటల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ క్రమంలో స్పోర్ట్స్‌ మ్యానేజ్‌మెంట్‌ వృత్తిని ఎంచుకుంది.

ముద్దుల కూతురు

పెన్సిల్వేనియాలోని కార్నెజీ మెల్లన్‌ యూనివర్శిటీలో బిబిఎ చదివిన ఊర్మిళ సొంత ఊరు కర్నాటకలోని మంగుళూరు దగ్గరున్న కిన్నిగొలి. తల్లితండ్రులైన వ్యాలెంటైన్‌, ఐవీ రోజారియోలు నాలుగు దశాబ్దాలుగా ఖతార్‌లోని దోహాలో ఉద్యోగాలు చేసి, ప్రస్తుతం కాఫీ ప్లాంటర్స్‌గా సాక్లెష్‌పూర్‌లో స్థిరపడ్డారు. కూతురు ఊర్మిళ గురించి మాట్లాడుతూ... ‘‘ఊర్మిళ తల్లితండ్రులుగా మేమెంతో గర్వపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా ఊర్మిళ సాధించిన ఈ విజయం చిన్నదేమీ కాదు. ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడింది. ఎలాంటి సవాలునైనా అధిగమించి, పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని మా అమ్మాయి నిరూపించింది.’’ అంటూ కూతుర్ని ఆకాశానికెత్తేస్తున్నారు ఆవిడ తల్లితండ్రులు. ఊర్మిళ తల్లి ఐవీ రోజారియో దోహాలో యుజిపిసి స్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. తండ్రి వ్యాలెంటైన్‌ రోజారియో దోహాలోని ఒక ఫైనాన్స్‌ కంపెనీలో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. 40 ఏళ్ల పాటు దోహాలో పని చేసిన ఈ జంట భారతదేశానికి తిరిగొచ్చి కాఫీ ప్లాంటర్స్‌గా స్థిరపడ్డారు. వీళ్ల నలుగురు సంతానంలో అందరికంటే ఊర్మిళ చిన్నది.

ప్రస్థానం సాగిందిలా...

ప్రారంభంలో ఖతార్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌కు మూడేళ్ల పాటు పని చేసిన ఊర్మిళ, తర్వాత ఆస్ట్రేలియాకు చేరుకుని, అడిలైడ్‌ క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా మూడేళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌కు టీమ్‌ మ్యానేజర్‌గా పని చేసింది. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సమయంలో క్రికెట్‌ నుంచి నాలుగు నెలల పాటు లీవ్‌ తీసుకుని, ఖతార్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత, ప్రపంచ కప్‌ పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించే అవకాశం ఆమెను వరించింది. మ్యానేజర్‌గా ఊర్మిళ క్రికెటర్ల ట్రాన్స్‌పోర్ట్‌, నివాస ఏర్పాట్లు మొదలైన పనులను నిర్వహిస్తుంది. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! | Medicine for women's diseases is a banana!

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట!

అరటిదూటలో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. ఇది మధుమేహవ్యాధి నివారణకు

ఉపకరిస్తుంది.

‘‘ వృంతచ్ఛిన్నః సలిల విధృతః కృత్తతంతు ప్రధవాత్‌!

కంబుభ్రాంత్యా జలవిరహితః క్షార జంబీర భృష్టః

మధ్యే మధ్యే తనుసకాలితష్టార్ద్రకేనాతిపూర్ణ

స్వాదుస్తూర్ణ భతిగర్భదండః కదల్యాః ’’అంటాడు క్షేమశర్మ. అరటిదూట వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ చెప్పిన శ్లోకమిది. అరటి చెట్టు స్తంభం(స్టెమ్‌) పైన డొప్పలు వలిచేస్తే, లోపల శంఖంలా తెల్లగా ఉండే సారవంతమైన భాగాన్ని అరటి ఊచ లేదా దూట అంటారు. కదళీదండం అనేది దీని సంస్కృతనామం. ఇది తెల్లగా, నిండా పీచుకలిగి ఉంటుంది. ఆహార పీచు (డయటరీ ఫైబర్‌) కోసమే దీన్ని వండుకుని తింటారు. అరటి గెలలను కోసేసాక ఈ అరటి స్తంభాన్ని కొట్టి బైట పారేస్తారు. దాని దుంపనుండి పిలకలొచ్చి తిరిగి మరో చెట్టు పెరుగుతుంది. చెట్టు కాండం లోపల ఉండే ఊచ పారేయవలసింది కాదు. అమూల్యమైన ఆరోగ్య సంపద దీనిలో ఉంది.

లాభాలెన్నో!

అరటి దూటలో ఉండే ఆహార పీచు పేగులకు శక్తినిస్తుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థని సంరక్షిస్తుంది. కడుపులోని గ్యాసును అరికట్టి అల్సర్లు తగ్గేలా చేస్తుంది. జీర్ణకోశాన్ని శక్తిమంతం చేస్తుంది. శరీరానికి పోషకాలనిచ్చి బలాన్నిస్తుంది. చాలా మంది స్త్రీలలో తరచు కనిపించే అధిక రక్తస్రావాన్ని అరటి దూట హరిస్తుంది. కేవలం అధిక రక్త స్రావమే కాకుండా ఇతర స్త్రీ వ్యాధులకు కూడా ఔషధంలా పనిచేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్లకి అరటిదూట గొప్ప ఔషధం. దీనిలో ఇందులో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. దీనిలో ఉండే లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. అందువల్ల ఇది మధుమేహవ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. అరటి దూటకు ఉన్న మరొక లక్షణం విష దోషాలను నివారించటం. దీనితో పాటుగా కిడ్నీలను శక్తిమంతం చేస్తుంది. మూత్రంలో మంట, చీముదోషం, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తింటే అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి.

ఎలా వండుకోవాలి?

సాధారణంగా అరిటి దూట మనకు మార్కెట్లో లభిస్తోంది. ఈ దూటను చక్రాలుగా తరుగుతూ ఉంటే– కొంత పీచు వస్తూ ఉంటుంది. ఈ పీచును వేలుకు చుట్టుకుంటూ బయటకు తీసివేయాలి. ఆ తర్వాత చక్రాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పసుపు నీళ్లలో వేయాలి.( లేకపోతే గాలిలోని ఆక్సిజన్‌ వల్ల దూట నల్లగా అయిపోతుంది). ఆ తర్వాత ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. దూట ముక్కలను, సన్నగా తరిగిన అల్లం ముక్కలను నూనెలో వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసి తగినంత నిమ్మరసం వేసుకోవాలి. ఇలా తయారుచేసిన ముక్కలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

పెరుగుపచ్చడి

ఉడకపెట్టిన ముక్కల్లో పెరుగు కలిపి కొత్తిమీర, ఆవపిండి వేయాలి. దీనిలో తాళింపు వేసుకుంటే పెరుగు పచ్చడి అవుతుంది. కొందరు ధనియాల పొడిని కూడా కలిపి పచ్చడిలా తయారుచేసుకుంటారు.

సూపు

ఈ ముక్కలను ఒక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె వేయాలి. దీనిలో కొన్ని నీళ్లు కలిపి వేడి చేయాలి. అప్పుడు అది సూపుగా తయారువుతుంది.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లోహైబ్రిడ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ | Hybrid Certificate Program in Indian Institute of Foreign Trade

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లోహైబ్రిడ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌
ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ)కి చెందిన మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ డివిజన్‌(ఎండీపీ)– ‘సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. దీనిని హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండస్ట్రీ లీడర్లు, మిడిల్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఆంత్రప్రెన్యూర్స్‌, ఫ్రెషర్స్‌కు ఈ ప్రోగ్రామ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులకు లెర్నింగ్‌ వెబ్‌ పోర్టల్‌కు సంబంధించి లైఫ్‌ టైం యాక్సెస్‌ ఇస్తారు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులకు 50 శాతం ఫీజు రాయితీ లభిస్తుంది.

కోర్సు వివరాలు

ఇందులో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌, రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌, డాక్యుమెంటరీ ఫార్మాలిటీస్‌, షిప్పింగ్‌ డాక్యుమెంట్స్‌, ప్యాకేజింగ్‌, సెక్యూరిటీ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ట్రాన్సాక్షన్‌ కాస్ట్‌, ఫ్రైట్‌ ఫార్వర్డింగ్‌, లాజిస్టిక్స్‌ తదితర అంశాలు బోధిస్తారు. ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండివిడ్యువల్‌/గ్రూప్‌ అసైన్‌మెంట్స్‌, అసెస్‌మెంట్స్‌, లెక్చర్‌ ప్రజంటేషన్స్‌, కేస్‌ స్టడీస్‌, గ్రూప్‌ వర్క్‌, జనరల్‌ డిస్కషన్స్‌, క్విజ్‌లు ఉంటాయి.

ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ డాక్యుమెంటేషన్‌కు సంబంధించి 30 గంటలు, ఇండియాస్‌ ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీకి సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ ఫైనాన్స్‌కు సంబంధించి 30 గంటలు, కస్టమ్‌ రెగ్యులేషన్స్‌ అండ్‌ ఇంపోర్ట్‌ ప్రొసీజర్స్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించి 20 గంటలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌కు సంబంధించి 30 గంటలు బోధన ఉంటుంది.

ప్రోగ్రామ్‌ ప్రారంభమైన మొదటి ఆరు రోజులు క్యాంప్‌స్‌ను విజిట్‌ చేయవచ్చు. శనివారాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు; ఆదివారాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఆన్‌లైన్‌ లైవ్‌ సెషన్స్‌ ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. ఫైనల్‌ ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

ముఖ్య సమాచారం

• ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.75,000+18 శాతం జీఎస్‌టీ

• ఈ–మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30

• ఈ–మెయిల్‌: mdpmarketing@iift.edu

• వెబ్‌సైట్‌: iift.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఐటీడీలో వర్చువల్‌ రియాలిటీ కోర్సు | Virtual Reality Course at CITD

దిక్సూచిసీఐటీడీలో వర్చువల్‌ రియాలిటీ కోర్సు

D I K S U C H I


హైదరాబాద్‌–బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ)– ‘సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ వర్చువల్‌ రియాలిటీ ఫర్‌ ఇండస్ట్రీస్‌’ను నిర్వహిస్తోంది. కోర్సు వ్యవధి మూడు నెలలు. రోజుకు మూడు గంటలు తరగతులు ఉంటాయి. ప్రతినెలా రెండు, నాలుగు బుధవారాల్లో బ్యాచ్‌లు ప్రారంభమౌ తాయి. ప్రతి బ్యాచ్‌లో 15 మందికి అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కోర్సులోని అంశాలు

• ఫండమెంటల్స్‌ ఆఫ్‌ వర్చువల్‌ రియాలిటీ కాన్సెప్ట్‌, టెక్నాలజీస్‌, వీఆర్‌ హార్డ్‌వేర్‌ డివైజెస్‌, సెన్సర్స్‌; ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీ; బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌; బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ క్యాడ్‌ ప్యాకేజ్‌.

ముఖ్య సమాచారం

• కోర్సు ఫీజు: రూ.5000

• ఫోన్‌ నెం: 040 29561793

• వెబ్‌సైట్‌: citdindia.org

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సెయిల్‌లో ఆపరేటర్‌/ టెక్నీషియన్‌ ఖాళీలు | అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత | Operator/ Technician Vacancies in SAIL

సెయిల్‌లో ఆపరేటర్‌/ టెక్నీషియన్‌ ఖాళీలు
ఒడిశాలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఎస్‌పీ)లో... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 110

1. ఆపరేటర్‌–కం–టెక్నీషియన్‌

2. అటెండెంట్‌ – కం– టెక్నీషియన్‌(ట్రెయినీ)

విభాగాలు: బాయిలర్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌ వైజర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్‌, డీజిల్‌ మెకానిక్‌, సీఓపీఏ, ఐటీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: ఆపరేటర్‌–కం–టెక్నీషియన్‌కు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150; అటెండెంట్‌–కం–టెక్నీషియన్‌లకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 16

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/en/home

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ | Faculty Jobs in HCU

హెచ్‌సీయూలో ఫ్యాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌– డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌

ఖాళీలు: 22

సబ్జెక్టులు:మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఇంగ్లీష్‌, ఫిలాసఫీ, ఆంత్రోపా లజీ, డ్యాన్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

అర్హత:సంబంధిత సబ్జెక్టులో మాస్ట ర్స్‌ డిగ్రీ, ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200– రూ.2,18,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400 – రూ.2,17,100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరి తేదీ: డిసెంబరు 7

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/teaching-guest-faculty/

నేడు 'హార్టీకల్చర్' ఆఖరి విడత కౌన్సెలింగ్ | ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. | Today 'Horticulture' final phase counseling | Students who are interested but unable to apply can also attend.

నేడు 'హార్టీకల్చర్' ఆఖరి విడత కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని తొమ్మిది ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ (హార్టీకల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని పరిపాలనా భవనంలో జరుగనుంది. గతంలో ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించి 100 సీట్లకు పైగా కౌన్సెలింగ్ జరుగుతుందని, ఇతర వివరాలకు ఉద్యాన వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చునని రిజిస్ట్రార్బి శ్రీనివాసులు పేర్కొన్నారు.

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...