అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
28, నవంబర్ 2023, మంగళవారం
4న ఆర్టీసీ అప్రెంటీస్ షిప్ ఇంటర్వ్యూలు | RTC Apprenticeship Interviews on 4th
ఇండియా స్కిల్ కాంపిటీషన్ కు దరఖాస్తులు | Applications for India Skill Competition
7,442 బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ | The filling of 7,442 B.Sc nursing seats has been completed
డీ ఫార్మసీ అడ్మిషన్లకు షెడ్యూలు | Schedule for D Pharmacy Admissions
జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు | Online Certificate Courses at JNTUH
ముఖ్య సమాచారం
• కోర్సు ఫీజు: రూ.25,000
• అడ్మిషన్ ఫీజు: రూ.1000
• దరఖాస్తు ఫీజు: రూ.500
• ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 15
• వెబ్‌సైట్: jntuh.ac.in
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్) ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(డీఐఎల్‌టీ)– ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు సబ్జెక్టులు, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి. అర్హత: ఏదేని డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగులు, ఫ్రెషర్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం; ఏదేని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కు సంబంధించి రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
Group 1 Group 2 Special గ్రహాలు – లక్షణాలు
గ్రూప్–1, గ్రూప్–2 ప్రత్యేకం
భూగోళశాస్త్రం
వి.వెంకట్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ
గ్రహాలు
సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉంటాయి. వీటిలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలు సూర్యునికి, గ్రహశకలాల(ఆస్టరాయిడ్స్) పట్టీకి మధ్య ఉన్నందున వాటిని అంతర గ్రహాలు అని పిలుస్తారు. మిగిలిన బృహస్పతి, శని, వరణుడు, ఇంద్రుడు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ప్రత్యామ్నాయంగా, మొదటి నాలుగింటిని టెరెస్ట్రియల్ అని పిలుస్తారు. అంటే భూమి లాంటివి. శిలలు, లోహాలతో ఏర్పడి సాపేక్షంగా అధిక సాంద్రత కలిగి ఉంటాయి. అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు. మిగిలిన నాలుగింటిని జోవియన్ లేదా గ్యాస్ జెయింట్ ప్లానెట్స్ అంటారు. జోవియన్ అంటే బృహస్పతి లాంటిది. ఇవి చాలా పెద్దవి, దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా హీలియం, హైడ్రోజన్ వాయువులతో ఏర్పడి ఉన్నాయి.
గ్రహాలన్నీ దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకే కాలంలో ఏర్పడ్డాయి. ఇటీవల వరకు(ఆగస్టు 2006), ఫ్లూటోను కూడా ఒకే గ్రహంగా పరిగణించేవారు. అయితే, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ సమావేశంలో, ఫ్లూటోను ‘మరుగుజ్జు గ్రహం’ అని పిలవవచ్చని నిర్ణయం తీసుకున్నారు. భూమి కక్ష్యను ఆధారం చేసుకొని సౌరకుటుంబంలోని గ్రహాలను రెండు వర్గాలుగా విభజించారు.
1. నిమ్న గ్రహాలు(Inferior Planets): బుధుడు, శుక్రుడు, భూమి
2. పుచ్ఛ గ్రహాలు(Superior Planets): కుజుడు, బృహస్పతి, శని, వరణుడు, నెఫ్ట్యూన్
పరిమాణాన్ని ఆధారం చేసుకొని సౌర కుటుంబంలోని గ్రహాల అవరోహణ క్రమం: బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్, భూమి, శుక్రుడు, కుజుడు, బుధుడు.
సూర్యుని నుంచి దూరం ఆధారంగా గ్రహాల వరుస క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్.
గ్రహాలు – లక్షణాలు
1. బుధుడు(Mercury): సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం. సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఇది సౌరకుటుంబంలో అతి చిన్న గ్రహం. దీనిని అపోలో, ఉపగ్రహ గ్రహం అని కూడా పిలుస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు. దీని మీద వాతావరణం ఉండదు. దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా గల గ్రహం(పగలు: +400 డిగ్రీల సెల్సియస్, రాత్రి: –180 డిగ్రీల సెల్సియస్)
2. శుక్రుడు(Venus): ఉదయతార, సంధ్యాతార, వేగుచుక్క ఈ గ్రహానికి ఇతర పేర్లు. దీనిని ‘ఎల్లో ప్లానెట్’ అని కూడా పిలుస్తారు. ఇది భూమికి చాలా దగ్గరగా ఉండే గ్రహం. అతి ప్రకాశవంతమైనది. అత్యంత ఉష్ణోగ్రత కలది కూడా. దీనికి ఉపగ్రహాలు లేవు. ఈ గ్రహంపై గ్లోబల్ వార్మింగ్(గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) అధికంగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్(90 శాతం), మీథేన్(మార్ష్ వాయువు), నైట్రస్ ఆక్సైడ్(లాఫింగ్ గ్యాస్) ఈ గ్రహంపై ప్రధానంగా ఉండే వాయువులు. సౌర కుటుంబంలో అత్యంత ఆల్బిడో గల గ్రహం.
నోట్: భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చెందించే శక్తి శాతం – ఆల్బిడో.
● సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువగా గల గ్రహం ఇది. శుక్రుని పరిభ్రమణ కాలం–23 రోజులు, ఆత్మభ్రమణ కాలం–243 రోజులు. ఈ గ్రహంపై పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి కవల గ్రహం. పరిమాణం, సాంద్రత, ద్రవ్యరాశుల విషయంలో భూమిని పోలి ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది.
3. భూమి(Earth): దీనిని నీలి గ్రహం, జలయుత గ్రహం, జీవరాశుల గ్రహం అని పిలుస్తారు. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే 3వది, పరిమాణంలో 5వ గ్రహం. భూమి ఏకైక ఉపగ్రహం చంద్రుడు.
● చంద్రుని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. 1.3 సెకన్లలో చంద్రుని కాంతి భూమిని చేరుతుంది. సూర్యుని తర్వాత మనకు అత్యంత ప్రకాశవంతంగా కన్పించే ఖగోళరాశి. భూమికి అత్యంత సమీపంలో గల ఖగోళ రాసి కూడా. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం – 3,84,365 కి.మీ. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గరగా ఉండే స్థితిని పెరిజీ (Perigee) అంటారు. పెరిజీ స్థితిలో భూమికి, చంద్రునికి మధ్య గల దూరం – 3,64,000. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న స్థితిని అపోజీ(Apogee) అంటారు. అపోజీ స్థితిలో భూమికి, చంద్రునికి మధ్యగల దూరం–4,04,000 కి.మీ. చంద్రుని వ్యాసం – 3,475 కి.మీ. చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తారు.
1. చాంద్ర నక్షత్ర మాసం(Sidereal Month): స్థిర నక్షత్రాల ఆధారంగా చంద్రుడు తన చుట్టూ తాను, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని ‘చాంద్ర నక్షత్ర మాసం’ అంటారు. ఆ సమయం– 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు
2. చాంద్రమాన మాసం(Senodic Month): సూర్యుని సాపేక్ష స్థానాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని చాంద్రమాన మాసం అంటారు. ఆ సమయం 29 రోజులు. చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వల్ల మనకు చంద్రుని ఒకే ముఖం కనపడుతుంది. చంద్రునిలో మనకు కనిపించేది 59 శాతం మాత్రమే. చంద్రునిపై మాత్రమే దొరికే ఖనిజం ఆర్మాల్ కొలైట్. అధికంగా దొరికే ఖనిజం టైటానియం. చంద్రునిపై వాతావరణం లేదు. శబ్దం వినపడదు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం మూలంగానే పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో అధిక వ్యత్యాసం ఉంటుంది. చంద్రునిపై పగటి ఉష్ణోగ్రత: +125 డిగ్రీ సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రత: –150 డిగ్రీ సెల్సియస్. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి బ్లూమూన్‌లు సంభవిస్తాయి. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన దృగ్విషయాన్ని సూపర్ మూన్ అంటారు. చంద్రుడు పెరిజీ స్థితిలో ఉన్నప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది.
4. కుజుడు(Mars): ఎర్రని గ్రహం, అరుణ గ్రహం, ధూళి గ్రహం దీనికి గల ఇతర పేర్లు. మొత్తం సౌరవ్యవస్థలో ఎత్తయిన పర్వత ప్రాంతం గల గ్రహం ఇది. కుజుడు రోమన్ల యుద్ధ దేవత. భూమి తర్వాత జీవి ఉండవచ్చని భావిస్తున్న గ్రహం. అక్షము, రాత్రి, పగలు విషయాల్లో భూమిని పోలి ఉంటుంది. ఫోబోస్, డిమోస్ దీని ఉపగ్రహాలు.
5. బృహస్పతి/గురుడు(Jupiter): పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం. ఎక్కువగా ఉల్కలు ఢీకొనడంతో దీనిని ఎర్రని మచ్చలు కలిగిన గ్రహం అంటారు. 1994లో ‘షూమేకర్ లెవీ’ అనే తోక చుక్క ఈ గ్రహాన్ని ఢీకొన్నది. ఈ గ్రహానికి గల మరొక పేరు తోక చుక్కల విధ్వంసకారి. గనిమెడ, యూరోపా, కాలిస్టోక్, హిమాలియా , లో, దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.
6. శని(Saturn): పరిమాణపరంగా రెండో పెద్ద గ్రహం. దీనిని కనుగొన్న వ్యక్తి గెలీలియో. ఇది అత్యధిక వలయాలు గల గ్రహం. అందమైన గ్రహం అని కూడా పిలుస్తారు. శుభ (Golden Planet), అశుభ గ్రహం(Cruel Planet) అని కూడా అంటారు. నీటి సాంద్రత కంటే ఈ గ్రహం సాంద్రత అతి తక్కువగా ఉంటుంది. ఈ గ్రహానికి మొత్తం 61 ఉప గ్రహాలు ఉన్నాయి. టైటాన్, కాలిప్సో, పాన్, అట్లాస్, జానస్ దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.
7. వరుణుడు(Urenus): ఇది ఆకుపచ్చని గ్రహం. దీనిని హర్షెల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. ఈ గ్రహానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. మిరిండ్, జాలిట్, పోర్షియా, ఏరియ్, టైటానియా దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.
8. ఇంద్రుడు(Neptune): దీన్ని Baby Blue Planet అంటారు. సూర్యునికి అత్యంత దూరంగా ఉండే గ్రహం. అతి శీతల గ్రహం. దీనికి మొత్తం 13 ఉపగ్రహాలు ఉన్నాయి. ట్రిటాన్, తలస్సా, గలాతియా, ప్రోటియస్ దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
Recent
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...